Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముందు నీ గోచీబట్ట సర్దుకోవోయ్ నొటోరియస్ బీహారీ డెకాయిట్..!!

October 4, 2025 by M S R

.

ప్రశాంత్ కిషోర్… వర్తమాన రాజకీయాల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని ఈ వింత పొలిటికల్ బ్రోకర్ కేరక్టర్ గురించి చెప్పుకోవాలి… ఎందుకంటే..? తను వచ్చే ఎన్నికలకు తెలంగాణ వస్తాడట, రేవంత్ రెడ్డిని పనిగట్టుకుని ఓడిస్తాడట… రాహుల్ గాంధీ గానీ, మోడీ గానీ కాపాడలేడట…

నరే, అంత సీన్ ఏమీ లేదు తనకు… కానీ ఎందుకు రేవంత్ రెడ్డిపై ఎందుకు కోపం..? తను బీహారీ డీఎన్ఏ‌లో కూలీపని చేసుకునే గుణం ఉందని ఎప్పుడో అన్నాడట… అది అవమానించినట్టు అట, అందుకని ఓడిస్తాడట… అంటే కూలీ పని అనేది అంత తప్పుడు మాటా..? వర్క్ ఫోర్స్, లేబర్ అనేవి బూతు మాటలా..? ఏమీ కాదే…! కానీ ప్రశాంత్ కిషోర్‌ మాత్రం పదే పదే ఈ విమర్శ చేస్తున్నాడు…

Ads

ఇక్కడ ఓ విషయం… ఇదే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్‌రెడ్డి కోసం పనిచేస్తున్నాడనే కోపంతో చంద్రబాబు ఓసారి ఇతన్ని బీహారీ డెకాయిట్ అన్నాడు… తననే నేరుగా… బహిరంగంగా…! అలాంటి చంద్రబాబు కోసం జగన్ క్యాంపు వదిలేసి వచ్చి మరీ ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు… ఓహో, బీహారీ కూలీ పదంకన్నా బీహారీ డెకాయిట్ పదం గౌరవనీయమైందా..? సరే… డబ్బు ఇస్తే అన్నీ వోకేనా..?

పీకే

https://www.facebook.com/reel/3287087581456388

దేశ రాజకీయాలను భ్రష్టుపట్టించినవాడు ప్రశాంత్ కిషోర్… ఐప్యాక్ పేరుతో ప్రాపగాండా, నెగెటివ్ క్యాంపెయిన్, అబద్ధపు ప్రచారాలు, వ్యక్తిత్వ హననాలు గట్రా ఈ పీకే చేయని అకృత్యం లేదు… సిద్ధాంతాలు, కార్యకర్తలు, ప్రజల్లోకి వెళ్లడాలు మానేసి… ప్రశాంత్ కిషోర్ ఉంటే చాలు గెలుస్తామనే పిచ్చి భ్రమల్లోకి కొన్ని పార్టీలను తీసుకెళ్లాడు… నిజంగాా దేశ రాజకీయాల దురవస్థ ఇది…

  • పోనీ, తనకు ఏమైనా విశ్వసనీయత ఉందా..? ఉండదు, లేదు… ఈ కేరక్టర్లకు క్రెడిబులిటీ ఏముంటుంది..? అటు తన శిష్యరత్నం ఒడిస్సా రిషి రాజ్‌ను జగన్ క్యాంపులో చేర్చి, తను ఐప్యాక్ కోసం పనిచేయడం లేదని అంటూనే ఇటు చంద్రబాబు క్యాంపులో చేరి పనిచేశాడు… డబుల్ ఏజెంట్ అంటారు దీన్ని … అంటే అనైతికంగా వైరివర్గాలకు పనిచేయడం…

డీఎంకేకు చేస్తాడు, అదేసమయంలో కమలహాసన్ మక్కల్ నీది మయ్యం కోసం చేస్తాడు… ఠాక్రే శివసేనకు చేస్తాడు, సమాంతరంగా షిండేకు పనిచేస్తాడు… తరువాత డీఎంకెేకు పనిచేసినవాడే విజయ్ టీవీకే పార్టీకి పనిచేస్తానని ప్రకటిస్తాడు… (ఒకవైపు తను ఐప్యాక్ పని, స్ట్రాటజిస్టు పనిచేయడం లేదు, పూర్తి టైమ్ రాజకీయాల్లోనే అని చెబుతూనే…) అదుగో ఆ దిక్కుమాలినతనమే తను ఎటు తీసుకెెళ్లిందీ అంటే…

పీకే

మొదట్లో బీజేపీకి చేశాడు, త్వరలోనే గుణం అర్థమైపోయి మోడీ తనను తరిమేశాడు… తరువాత కాంగ్రెస్… యూపీలో అట్టర్ ఫ్లాప్… పంజాబ్‌లో ఏకంగా కేబినెట్ పోస్టులో సలహాదారుగా చేరాడు… ఓ తెర వెనుక స్ట్రాటజిస్టుకు ప్రభుత్వంలో ఏం పని..? అనైతికత అంటేనే ప్రశాంత్ కిషోర్ ఓ ఐకన్…

డబుల్ ఏజెంట్ సరే… పోనీ, నమ్మినవాళ్లను అనుసరించే గుణం ఉందా..? అదీ లేదు… ఫాఫం, బీహార్ సీఎం నితిశ్‌కు వారసులు లేరు, ప్రశాంత్ కిషోర్, నువ్వేరా నా వారసుడివి, తరువాత బీహార్ సీఎం పీఠం నీదే అని చెప్పాడు… కొన్నాళ్లు అలాగే ఉన్నాడు, తనను తన్నేసి… సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు.., అది ఒక అడుగు ముందుకు, వంద అడుగులు వెనక్కి… పాదయాత్ర చేస్తే జనం ఎవడూ దేకలేదు…

నటుడు విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) తొలి వార్షికోత్సవ సభలో విజయ్ ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు… ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోనీ ఎలా గెలిపిస్తున్నాడో అదేవిధంగా టీవీకేను తాను గెలిపిస్తానన్నాడు… ఎక్కడ బెడిసిందో గానీ మళ్లీ పత్తా లేడు…

pk

మరో మంచి ఉదాహరణ తన డబుల్ క్రాస్ తత్వానికి… డీఎంకే ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకేకు “అపూర్వ” అని ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు పనిచేసేది… గత ఆంధ్రా ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తరుపున ఈ అపూర్వ టీడీపీ కోసం పనిచేసింది…

  • ఒకవైపు తన శిష్యుడు రిషి రాజ్ జగన్ కోసం, మరో శిష్యురాలు టీడీపీకి… నిజానికి డీఎంకెేకు అధికారికంగా రాబిన్ శర్మ ఎప్పట్నుంచో పనిచేస్తున్నాడు… అదే రాబిన్ టీడీపీ కోసం చేస్తాడు… అందరూ ఒకే స్కూల్… తను టీడీపీకి లోపాయికారీగా పనిచేస్తే అది గెలిచింది, వందల కోట్ల ఖర్చుతో తన శిష్యుడు రిషి రాజ్‌ను జగన్ క్యాంపులో పెడితే, అడ్డదిడ్డం పనితీరుతో చివరకు జగన్ పార్టీని మరీ 11 స్థానాల హీన స్థాయికి దిగజార్చింది… ఫాఫం జగన్, నమ్మి అడ్డగోలుగా మునిగిపోయాడు…

ప్రశాంత్ కిషోర్ అంచనాలు, వ్యూహాలు, సర్వేలు, ప్రాపగాండా అంటే ఒకప్పుడు ఆహా ఓహో… స్టాలిన్, ఠాక్రే, జగన్, మమత… పేరొందిన అందరు నాయకులకూ తను వ్యూహకర్త… నిజానికి తను గెలుపు అవకాశాలున్న పార్టీ క్యాంపులోనే చేరతాడు… వందల కోట్లు కొల్లగొడతాడు… ఇది ఒక హిండెన్‌బర్గ్ స్ట్రాటజీ… ఒక ఝన్ ఝన్ వాలా స్ట్రాటజీ… నమ్మినోడు పిచ్చోడు…

పీకే

మరి అంతమందిని గెలిపించాడు కదా, తను సొంతంగా పార్టీ పెట్టి బీహార్ ఉపఎన్నికల్లో ఆమధ్య నిలబడితే నాలుగు స్థానాల్లో పోటీచేస్తే మూడింట్లో మూడో స్థానం, మరొక దాంట్లో నాలుగో స్థానం… శకునం చెప్పే కుడితి తొట్లో పడ్డట్టు… తన వ్యూహాలు ఓ నాన్సెన్స్…

నిజానికి ఎన్నికల్ని ప్రభావితం చేసేవి బోలెడు అంశాలుంటాయి… కేసీయార్ మొన్నటి ఎన్నికల్లో బోలెడు సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, డిజిటల్ క్రియేటర్లు, సొంత సోషల్ మీడియా వింగ్స్ మీద కోట్లకుకోట్లు తగలేశాడు… ఏం జరిగింది..? తన మీద వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకతను 0.5 శాతం కూడా తగ్గించలేకపోయాయి…

కానీ ఇదే ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు…? మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ కు తిరుగు లేదు, BRS హ్యాట్రిక్ కొడుతుందని అభిప్రాయపడ్డాడు… ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవొచ్చు అనీ అభిప్రాయపడ్డాడు… దక్షిణాదిలో బీజేపీ భారీగా సీట్లు గెలుస్తుంది అన్నాడు… ఏమైంది..? తుస్…

పీకే

ఓ మిత్రుడు చెప్పినట్టు… ప్రశాంత్ కిషోర్ Strategist నుంచి Paid Influencer గా రూపాంతరం చెందాడు…. మొదట్లో కేసీయార్ తనను పిలిచాడు… ‘ఈ కొద్దిరోజులు మీ సేవలు మాకు అవసరం.. గెలిపించండి.. తర్వాత ఏమున్నా మాట్లాడుకుందాం’ అని పీకేతో పదే పదే కేసీఆర్ అన్నాడట… ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు విషయాలు చర్చించినట్లుగా సమాచారం… తరువాత ఆశించిన భారీ ప్యాకేజీ కుదరలేదేమో… కేసీయార్ కూడా తరిమేశాడు…

ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం అంటే… రేవంత్ రెడ్డి తనను గెలిపించాలని ఢిల్లీలో తనను మూడుసార్లు అడిగాడట… మరి నీ పనే అది కదా, అడిగినంత డబ్బు ఇస్తా అన్నప్పుడు ఒప్పుకోవాలి కదా… ఐనా సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి అధికారిక స్ట్రాటజిస్టుగా పనిచేస్తున్నప్పుడు (అఫ్‌కోర్స్, కర్నాటక, తెలంగాణలో మాత్రమే సక్సెస్ తను) ప్రశాంత్ కిషోర్ సాయం ఎందుకు అడుగుతాడు రేవంత్ రెడ్డి..?

పీకే

పోనీ, అడిగాడు అనుకుందాం… అటు కేసీయార్ క్యాంపుకూ సలహాదారు… ఇటు రేవంత్ రెడ్డికీ పనిచేయడానికి డబుల్ ఏజెంట్ పనికి సిద్ధపడ్డాడా తను..? భారీగా ఆశించిన ప్యాకేజీ కుదరక రేవంత్ రెడ్డితో బెడిసిందా..? ఏమిటి నిజం..?

ఐనా… నీదో రాజకీయ పార్టీ… జనం నమ్మినా నమ్మకపోయినా, తన్ని తరిమేసినా… బీహార్ ఫీల్డే నీ కార్యస్థలం… అటు తేజస్వి యాదవ్, ఇటు నితివ్, మరోవైపు బీజేపీ సర్వ సాధన సంపత్తి మొహరిస్తున్నాయి… ఈ స్థితిలో నీ గోచీబట్ట చూసుకుని, నీ రాష్ట్రంలో చూసుకోక… ఏవేవో పిచ్చి ప్రేలాపనలు దేనికి పీకే..?

  • అబద్ధాలు, ఆత్మవంచనలు ఎల్లకాలం పనిచేయవు… వచ్చే బీహార్ ఎన్నికల తరువాత నీ పార్టీ ఉంటే… అప్పుడు మళ్లీ మాట్లాడుకుందాం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…
  • భార్యను చంపాడని జైల్లో వేశారు… రెండేళ్లకు ఆ భార్య కనిపించింది…
  • కిిం కర్తవ్యం..? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు..!!
  • స్వదేశీ విస్కీమేకర్లకు కిక్కిచ్చే అవార్డులు… అంతర్జాతీయ అమ్మకాలు…
  • బహుశా చాలామంది సినిమా సెలబ్రిటీలకు జీర్ణం కాని కథ..!!
  • రక్తికడుతున్న జుబ్లీహిల్స్ పోటీ… రేవంత్‌రెడ్డి ఎత్తులు ఇంట్రస్టింగ్..!
  • నాతూ పెళ్లాం తావాలి… మనిషి వైకల్యాల నుంచి పుట్టించే కామెడీ…
  • ఇంటిపేరు పూరీ ఐనా సరే… తనకు ఉప్మా అంటేనే అడిక్షన్ తెలుసా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions