ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలిశాడు… తను టీడీపీ కోసం పనిచేస్తాడు… ఇవీ నేటి వార్తల సారాంశం… నిజానికి చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ నడుమ ఏ చర్చలు జరిగాయో ఎవరికీ తెలియదు… ఫలానా అంశం చర్చించి ఉంటారని ఊహించడమే… నిజానికి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంత పాపులర్ వ్యూహకర్త ఏమీ కాదు… ఆశ్చర్యంగా ఉందా.,,? ఇదే నిజం…
ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ వ్యూహకర్త సునీల్ కనుగోలు… కర్నాటకలో తను అనుసరించిన స్ట్రాటజీలు సక్సెసయ్యాక తెలంగాణ బాధ్యతలు కూడా ఇచ్చారు… ఇక్కడా సక్సెస్… ఇప్పుడిక హర్యానా, మహారాష్ట్ర అప్పగించారు… మహారాష్ట్రలో పార్టీని పైకి లేపడం తనకు ఓ పరీక్ష… ఏపీలాగే అక్కడా కాంగ్రెస్ మట్టిగొట్టుకుపోయింది… కానీ ఒక సక్సెస్ మరో అవకాశాన్ని మోసుకొస్తుంది కదా… సహజం…
Ads
నిజానికి వైసీపీకి ఎలా స్పందించాలో తెలియడం లేదు, మింగుడుపడటం లేదు… ఈ వార్తలు బహుళ ప్రచారంలోకి రాగానే… జగన్ కోసం మేం వర్క్ చేస్తున్నామని ఐప్యాక్ ప్రకటించింది… ఈ పీకే సంస్థ ఐప్యాక్ టీమే జగన్ కోసం పనిచేస్తోంది చాన్నాళ్లుగా… పైగా పీకే టీంలో పనిచేసి సొంత దుకాణాలు పెట్టుకున్నవాళ్లు కూడా వివిధ శాఖల తరఫున పనిచేస్తూ ప్రభుత్వంలో లోతుగా దూరిపోయారు… ఇంకా లోతులోకి వెళ్తే… పీకే తను ఇప్పుడు ఐప్యాక్ కోసం పనిచేయడం లేదని ప్రకటించాడు… వ్యూహాల వ్యాపారాన్ని మానేసినట్టు చెప్పాడు…
ప్రస్తుతం జగన్ పార్టీ వ్యవహారాలు రిషిరాజ్ చూస్తున్నాడు… తను పీకే మనిషే… పైగా తెలుగుదేశం సోషల్ మీడియా వ్యవహారాల్ని రాబిన్ శర్మ చూస్తున్నాడు… ఈయన కూడా ఐప్యాక్ పాత కాపే… ఆ సంస్థ ఫౌండర్ మెంబర్… కానీ చంద్రబాబే తను పెద్ద వ్యూహకర్త అనుకుంటాడు… సో, రాబిన్ సోషల్ మీడియా, సర్వే వ్యవహారాలకే పరిమితం అయినట్టున్నాడు… మరి పీకేతో భేటీ దేనికి అంటారా..?
(సునీల్ కనుగోలు)
తను ఇప్పుడు స్ట్రాటజీల దందాలో లేడు… పొలిటికల్ యాంబిషన్స్ విపరీతం… దగ్గరకు చేరదీసిన నితిశ్ నెత్తి మీద జెల్లకొట్టేసి, సొంత పొలిటికల్ ఇమేజీ కోసం పాదయాత్ర చేశాడు… ఎవడూ పట్టించుకోలేదు… మరి తన వ్యూహనైపుణ్యం తనకు ఎందుకు పనిచేయలేదు..? నిజానికి తను గెలుపు అవకాశాలున్న పార్టీలనే ఎంచుకుంటాడు… ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటాడు… తమిళనాడులో డీఎంకేకు అనుకూలత ఉన్నప్పుడు ఆ కంట్రాక్టు… గెలిచాడు…
మమతకు తిరుగు లేదు, పీకే లేకపోయినా ఆమె గెలిచేది…, ఆ సక్సెస్ పీకే ఖాతాలో పడింది… సేమ్, శివసేన… తను అంతటి సమర్థుడే అయితే, తమిళనాట కమల్‌హాసన్ సాధించిందేముంది..? గుండుసున్నా… పైగా పీకే పెద్ద చంచల స్వభావి… తన క్రెడిబులిటీనీ ఎన్నడో కోల్పోయాడు… మొదట్లో బీజేపీ, తరువాత కాంగ్రెస్ కూడా తనను వదిలించుకున్నాయి… పంజాబ్ ప్రభుత్వంలో సలహాదారుగా చేరాడు, వాళ్ల ప్రభుత్వం కూలిపోయి తనూ పంజాబ్ వదలక తప్పలేదు… ఇప్పుడు తను ఎక్కువగా ఈ స్ట్రాటజీ దందాలో గాకుండా పొలిటికల్ వ్యవహారాలు, బ్రోకరిజం నమ్ముకున్నట్టున్నాడు…
(రాబిన్ శర్మ)
ఆమధ్య కేసీయార్‌తో భేటీ అనే వార్తలు వచ్చాయి… కొన్నాళ్లు సొంతంగా రాష్ట్రంలో తిరిగాడు… అత్యున్నత ప్రోటోకాల్‌తో… కానీ కేసీయార్ తనను తరిమేశాడు… (కేసీయార్‌లు, చంద్రబాబులు వేరే ఎవరో పన్నే వ్యూహాలను నమ్మరు, వాళ్లే చాణుక్యులు కదా… పైగా కేసీయార్ కోసం వర్క్ చేసిన సోషల్ మీడియా, స్ట్రాటజిస్టుల టీమ్స్ పాత ఐప్యాక్ వర్కర్లే…) నిజానికి పీకే కేసీయార్‌తో భేటీ వేసినా, చంద్రబాబుతో భేటీ వేసినా ఇంకేదో పరమార్థం ఉంది… అది పార్టీల నడుమ సాగే అంతరంగిక బేరాలు, సంప్రదింపుల యవ్వారం…
పోనీ, అదే నిజమనుకుంటే… చంద్రబాబుతో బీజేపీకి సఖ్యత లేదు, అలాగని ఇండి కూటమితో బాగాలేడు… మరెవరి కోసం పీకే చంద్రబాబుతో సంప్రదింపులు సాగిస్తున్నాడు..? అదీ ప్రశ్న… (ఐనా చంద్రబాబు ఆ పీకే (పవన్ కల్యాణ్) చాలు, ఈ పీకే దేనికి..? పైగా తనే తిట్టాడు గతంలో బీహారీ డెకాయిట్స్ అని… రాబోయే ఎన్నికల గోదావరిని ఈదడానికి ఈ తోక ఎలా పనికొస్తుంది బాబూ…)
జగన్ కూడా ఈ పీకేను పెద్దగా నమ్మడం లేదు… తను జాతీయ స్థాయిలో ప్రణయ్ రాయ్, మరో సంస్థ కలిపి ‘‘యాంటీ ఇన్‌కంబెన్సీ’’ మీద చేసిన ఓ పెద్ద స్టడీ రిపోర్ట్స్ ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పీకేయబోతున్నాడు… ఆ ప్రక్రియ స్టార్ట్ చేశాడు… ఆ పని కేసీయార్‌కు చేతకాలేదు గనుకే చతికిలపడ్డాడు… ఈ మొత్తం ముఖచిత్రంలో పీకే ఎక్కడా లేడు… సో, చంద్రబాబు, పీకే భేటీ దేనికోసం అనేది తేలాల్సి ఉంది… ఆ భేటీలో టీడీపీ స్ట్రాటజిస్టు రాబిన్ శర్మ కూడా ఉన్నాడు… ఇద్దరూ కలిసి పనిచేస్తారనేది అబద్ధం…
మొదట్లో పీకేను బీహారీ డెకాయిట్ అనేవాడు చంద్రబాబు… ఇప్పుడు తనకు ఆప్తుడయ్యాడా..? వెంటనే జగన్ క్యాంపు చంద్రబాబు భాషను అందిపుచ్చుకుని ఆ బీహారీ డెకాయిట్ అనే తిట్టును అదే పీకేపై ప్రయోగిస్తోందా..? సాక్షిలో ఇలాంటి హెడింగ్స్ సూచించేది అదేనా..? పీకేను ఆల్‌రెడీ వదిలించుకున్నాడా జగన్..?
చివరగా… నిజంగా భారత రాజకీయాల్లో ఈ స్ట్రాటజిస్టుల పర్వం మొదలయ్యాక రాజకీయాలు మరింత భ్రష్టుపట్టాయి… ఫేక్ పిక్స్, ఫేక్ స్లోగన్స్, ఫేక్ జీవోలు, ఫేక్ వార్తలు, ఫేక్ క్యాంపెయిన్లతో ఎదుటి పార్టీల మీద నెగెటివిటీని పెంచే కుట్రలు ఇవి… మన డెమోక్రసీకి దీర్ఘకాలికంగా నష్టదాయకాలు… మిత్రుడు Mani Bhushan ఏమంటాడంటే…
Share this Article