Sridhar Bollepalli ……….. ఒకడే వొక్కడు మొనగాడు.. (సగం) ఊరే మెచ్చిన పనివాడు… పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీగా రెణ్నెల్ల క్రితం ప్రవీణ్ ప్రకాష్ (IAS) డ్యూటీ ఎక్కారు. అంతకుముందు ఆ స్థానంలో పని చేసిన రాజశేఖర్ గారు చాలా మంచివారు (మా టీచర్ల దృష్టిలో). ఎంచేతంటే, సమర్ధుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నా, ఆయన ఎప్పుడూ ఆఫీసు వదిలి స్కూళ్ల మీద పడి, అదిలించి బెదిరించింది లేదు.
Ads
చిట్టి చిలకమ్మా, బడికి పోయావా, షూ తెచ్చావా, గూట్లో పెట్టావా, చెప్పులు తొడిగావా, చెంగున దూకావా.. అనే రైముని జాతీయగీతంగా పాడుకునే పిల్లలంతా షూ బయటికి తీసి, దుమ్ము దులిపి, బడికేసుకురావడం మొదలెట్టారు. లేతలేత పిల్లగాళ్లు అంతంత బరువులు ఏం మోస్తారు లేద్దూ అన్న మానవత్వంతో కొన్ని పుస్తకాలు యిచ్చి, కొన్ని యివ్వకుండా స్టాక్ రూములో ఆఫీసు రూములో భద్రంగా దాచిపెట్టిన వాళ్లంతా.. ముత్తు సినిమాలో రజనీకాంత్ పంచెలు, చీరలు పంచినట్టు టకటకా టకటకా పంచేశారు.
ఎఫ్.ఏ - 2 పరీక్ష (మన చిన్నప్పటి రెండో యూనిట్టు పరీక్ష మాదిరి) పెట్టిన పంతుళ్లంతా అదే రోజు రాత్రి పేపర్లు దిద్దేసి, తెల్లారి పొద్దునకల్లా క్లాసుల్లో మార్కులు అనౌన్సు చేయడం ద్వారా పిల్లల్ని దిగ్భ్రాంతికి లోను చేశారు.
పెదరాయుడులో ఎమ్మెస్ నారాయణ సౌందర్యతో చెప్పినట్టు.. ఎప్పటికీ చూడలేవనుకున్నవి చూడడం, ఎన్నటికీ వినలేమనుకున్నవి వినడం నిత్యకృత్యంగా మారింది. పెద్దయ్యగారిచేత తలంటించుకుంటున్న టీచర్లు, అధికారుల జాబితా పండగకి రాసుకున్న సరుకుల చీటీలాగా రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రవీణ్ ప్రకాష్ గారి వర్కింగ్ స్టయిలు కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. అంత స్ట్రిక్టుగా వుంటూ, విప్లవాత్మక మార్పులు సాధించేయాలనే తొందర అధికారుల్లో వున్నప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లే ప్రమాదం వుంది. ప్రస్తుతానికైతే సివియర్ డిమేజింగు ఏం లేదు. నా వరకూ నాకు హ్యాపీ ఫీలింగ్సే…
Share this Article