.
John Kora ….. ప్రీతీ.. పంజాబ్.. ఒక అయ్యర్ .. పంజాబ్ కింగ్స్ జట్టు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
చివరి సారిగా 2014లో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టాప్-2లో నిలిచింది. ఈ రోజు బెంగళూరు, లక్నో మధ్య జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడమే కాకుండా.. రన్ రేట్ మెరుగుపరుచుకుంటే పంజాబ్ రెండో స్థానంలో నిలుస్తుంది. లేకపోతే పంజాబ్‌దే అగ్రస్థానం. ఏదేమైనా ఫైనల్‌కు చేరుకోవడానికి పంజాబ్‌కు రెండు అవకాశాలు మాత్రం గ్యారంటీగా ఉన్నాయి.
ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను క్వాలిఫయర్స్-1కు తీసుకెళ్లిన ఘనత శ్రేయస్ అయ్యర్‌కు దక్కుతుంది. 2020లో ఢిల్లీ జట్టును మొదటి సారిగా ఫైనల్‌కు చేర్చాడు. ఇక గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకు ఏకంగా ట్రోఫీనే అందించాడు.
Ads
తాజాగా పంజాబ్ జట్టును క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. గతేడాది కేకేఆర్‌కు ట్రోఫీని అందించినా.. కోచ్ గౌతమ్ గంభీర్‌తో ఉన్న విభేదాల కారణంగా జట్టును వదిలేశాడు. ఈ ఏడాది కేకేఆర్ జట్టు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే లీగ్ నుంచి నిష్క్రమించింది. కానీ శ్రేయస్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఫైనల్స్‌కు ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచింది. కూల్ అండ్ స్ట్రాటజిస్ట్ …
ప్రీతీ.. ది గ్రేట్..
పంజాబ్ కింగ్స్ సహ భాగస్వామి, సినీ నటి ప్రీతీ జింటా తొలి టైటిల్ కోసం 18 ఏళ్లుగా వేచి చూస్తోంది. ఇన్నేళ్లలో ఒక ఓనర్‌గా ప్రొఫెషనల్‌గానే కాకుండా.. జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. పంజాబ్ జట్టులో మోహిత్ బర్మన్ (డాబర్, ఎవరెడీ బ్యాటరీ కంపెనీల ఓనర్)కు 48 శాతం, నెస్ వాడియా (బాంబే డయింగ్ ఓనర్)కు 23 శాతం, ప్రీతీ జింటాకు 23 శాతం, కరన్ పాల్ (ది పార్క్ హోటల్స్ ఓనర్)కు 6 శాతం వాటాలు ఉన్నాయి.
ఈ ఓనర్లలో ప్రతీ మ్యాచ్‌లో గ్యాలరీల్లో కనపడేది ప్రీతీ జింటా, నెస్‌వాడియాలే. వీళ్లద్దరూ కేవలం ఓనర్లే కాకుండా.. ఒకప్పుడు ప్రేమికులు. నెస్ వాడియాతో కొన్నేళ్ల పాటు ప్రీతీ జింటా రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే 2018లో వీరిద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. నెస్ వాడియా తనను వేధించాడని కన్నీళ్లు పెట్టుకుంది. వాంఖడే స్టేడియంలో అందరి ముందే తనను కొట్టాడని కేసు కూడా పెట్టింది. అప్పటికే ఆ జంట విడిపోయింది. కానీ ప్రీతీ మాత్రం పంజాబ్ కింగ్స్ భాగస్వామిగా కొనసాగింది.
ఇక తాజాగా కో-ఓనర్స్ నెస్ వాడియా, మోహిత్ బర్మన్‌పై కేసు పెట్టింది. పంజాబ్ కింగ్స్ మాతృసంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కొత్త డైరెక్టర్ నియామకానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా.. ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ప్రీతీ జింటా కేసు వేసింది.
ఓనర్ల మధ్య వివాదాలు నడుస్తున్నా.. జట్టును ఎంకరేజ్ చేయడానికి ప్రీతీ మాత్రం స్టేడియంకు వస్తోంది. యాజమాన్యం గొడవలను పైకి కనపడనివ్వకుండా.. స్టేడియంలో నవ్వుతూ జట్టును ఉత్సాహపరుస్తోంది. ప్రీతీ అమెరికాకు చెందిన జెనీ గుడ్ఇనఫ్ అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకొని అక్కడే ఉంటోంది.
కానీ ఐపీఎల్ జరిగే రెండు నెలలు మాత్రం ఇండియాకు వస్తుంది. అయితే వచ్చిన ప్రతీ సారి పంజాబ్ కింగ్స్ ఓనర్లతో ఆమెకు గొడవలే జరుగుతున్నాయి. అయినా సరే పంజాబ్ జట్టు నుంచి తన వాటాను మాత్రం వెనక్కు తీసుకోవడం లేదు.
తనకు క్రికెట్ అంటే ఇష్టమని.. పంజాబ్ జట్టు నాకు ప్రాణమని ఒకసారి చెప్పింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం కేవలం ఆర్సీబీనే కాదు.. అంతకు మించి ఎదురు చూస్తోంది ప్రీతీ జింటానే. మరి ఈ సారి ఆమె కల నెరవేరుతుందా లేదా చూడాలి…. #భాయ్‌జాన్
తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని అనితరసాధ్యంగా ప్రదర్శించిన శ్రేయాస్ అయ్యర్‌కు భారత జట్టులో కీలక బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు..?!
అన్నట్టు… భారత సైన్యం సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) కు రూ.1.10 కోట్లు విరాళంగా ఇచ్చింది ఆమె… పంజాబ్ కింగ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధి నుంచి ప్రీతి ఈ విరాళాన్ని అందించింది…
ఐపీఎల్ లేడీ ఓనర్లలో… హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ చాన్స్ ఎగిరిపోయాక కావ్య మారన్ స్టేడియం రావడం మానేసింది… ముంబై ఓనర్ నీతా అంబానీ రెగ్యులర్‌గా వస్తుంది… కానీ కోల్‌కత్తా జట్టు కోఓనర్ జుహీ చావ్లా ఎప్పుడూ పెద్దగా కనిపించలేదు… కానీ ప్రీతి జింతా కూడా రెగ్యులర్‌గా వస్తుంది… ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంది…
Share this Article