Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పగతో ఓ ఆత్మ పునర్జన్మ… మళ్లీ మనిషి రూపంలో రాకడ… మీకు ఓ దండంరా భయ్…

November 24, 2022 by M S R

అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ ఉంటయ్… రైటర్ దయ, ప్రేక్షకుడి ప్రాప్తం, డైరెక్టర్ ఇష్టం, ప్రొడ్యూసర్ కరుణ, సదరు టీవీ చానెల్ ఔదార్యం… ఆ కథల జోలికి వెళ్తే, ఆ పెంటలో పడి ఇప్పట్లో పైకి లేవలేం గానీ… ఓ విషయం చెప్పుకుందాం

ఏళ్లు నడిచే ఈ  సుదీర్ఘ ఎపిసోడ్ల కారణంగా అప్పుడప్పుడూ కొందరు నటులు హఠాత్తుగా మానేస్తారు… లేదా వెళ్లగొట్టబడతారు… రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే, లేదా వేరే డబ్బొచ్చే సీరియళ్ల వైపు షిఫ్లయిపోతే, ఇంకేమైనా సమస్యలు తలెత్తితే నటీనటుల్ని మాన్పించేస్తారు… ఆ తేడా ప్రేక్షకుడికి తెలియకుండా కథలో ఆ పాత్రను ఏ తీర్థయాత్రలకో పంపించేస్తారు… లేదా పాత్రల్నే మాయం చేస్తారు… అడిగేవాడెవ్వడు..? తీసేవాడికి చూసేవాడు లోకువ… లేదంటే కొన్నిసార్లు హఠాత్తుగా ఆ నటీనటుల బదులు కొత్తవాళ్లను పెట్టేస్తారు… ఓహో, యాక్టర్స్ మారిపోయారా అని ప్రేక్షకుడే తన జ్ఞానం కొద్దీ గుర్తించి, అడ్జస్ట్ అయిపోవాలి తప్ప ఆ సీరియల్ వాడేమీ చెప్పడు…

premi

Ads

ఇంతటి మూసీలోనూ మెచ్చుకునే అంశం ఏమిటంటే… నటీనటుల నటన… సినిమాల్లో క్లోజప్ షాట్స్ తక్కువ… ఎలాగూ ఇప్పుడు నటన తెలిసిన నటులు దొరకడం లేదు కాబట్టి హీరోలు సహా లాంగ్ షాట్లకే పరిమితం అవుతున్నారు… కానీ టీవీ సీరియళ్లలో మంచి నటులు కనిపిస్తున్నారు… హీరోలు, హీరోయిన్లు కాదు, నటులు కనిపిస్తున్నారు… ఎటొచ్చీ ఆ రచయితలు, దర్శకులే దరిద్రం… ఇక వారి ప్రజెంటేషన్ స్కిల్స్, పాతాళస్థాయి అభిరుచి గురించి తరువాత మాట్లాడుకుందాం గానీ… నటీనటులు అకస్మాత్తుగా సీరియళ్లు మానేస్తే అప్పటికప్పుడు కథను ఎలా మారుస్తారు అనేది కాస్త నవ్వొచ్చే యవ్వారం… లేదా టీఆర్పీలను బట్టి సాగదీయడం, మానేసిన నటీనటులను మళ్లీ రప్పించడం… అబ్బో,

varsha

కార్తీకదీపం చూశాం కదా, ఏవో పిచ్చి ట్విస్టు ఇచ్చి, పరిటాల శ్రీరాం, ప్రేమి విశ్వనాథ్‌లను చంపేసీ, రేటింగ్స్ ఢమాల్ అనడంతో, మళ్లీ కథను మార్చేసి, గడియారాన్ని వెనక్కి తిప్పేసి, ఏదో లాగుతూ ఉన్నారు… నిజానికి అందులో ప్రేమి మంచి నటే అయినా ఆమెను అనేకసార్లు అర్చన అనంత్, శోభా శెట్టి దాటేసి, తమ ముద్ర వేస్తున్నారు… అర్చన అయితే కేరాఫ్ అనసూయ సీరియల్‌ను ఆఫ్ పీక్ టైంలో కూడా మంచి రేటింగ్స్‌తో ఉంచుతోంది… ఈటీవీ, జెమిని సీరియళ్లను పెద్దగా ఎవరూ చూడరు కానీ కాస్తో కూస్తో మాటీవీ, జీటీవీ పోటీలు పడుతుంటయ్…. జీటీవీ దరిద్రం ఏమిటంటే… పునర్జన్మలు, మూఢనమ్మకాలు, మంత్రమంత్రాలు ఎట్రెట్రా… మనల్ని పాతరాతి యుగం వైపు తీసుకెళ్తుంటయ్ సీరియళ్లు… మరీ త్రినయని సీరియల్‌లో పాము పాలు తీసుకుపోతూ ఉంటుంది… జ్యోతిష్కులు, సోది చెప్పేవాళ్లు కథను నడిపిస్తూ ఉంటారు…

anusri

మరీ ఎంత ఘోరం అంటే… ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ వస్తుంది… జీటీవీలో… ఒకప్పుడు మంచి రేటింగ్స్ వచ్చేవి… దాన్ని క్రమేపీ భ్రష్టుపట్టించారు… నిజానికి మంచి దమ్మున్న కథ… కానీ చెత్త దర్శకత్వం… త్రినయని గానీ, ప్రేమ ఎంత మధురం గానీ, కార్తీకదీపం గానీ ఒరిజినల్స్ వేరు, ఎలా తెలుగీకరించుకోవచ్చో దర్శకులకు తెలిసిపాడుకాదు… మనం నటీనటుల హఠాత్తు రాకడ, ఆకస్మిక అదృశ్యాల గురించి కదా చెప్పుకునేది…

ads in serials

జబర్దస్త్ నుంచి హఠాత్తుగా చలాకీ చంటి లేదా ఫైమా మాయమై, బిగ్‌బాస్ హౌజులో తేలితే, వాళ్ల స్కిట్లు మాత్రమే ఉండవు… కానీ సీరియళ్లు అలా కాదు కదా… కథనం దెబ్బతింటుంది… కార్తీకదీపంలో దీపను, కార్తీక్‌ను చంపేశాక, ఆ పిల్లలు పెద్దవాళ్లవుతారు కదా, ఒక పాత్రకు కీర్తి భట్, మరో పాత్రకు అమూల్యను తీసుకున్నారు… కానీ మారిన స్థితిలో వాళ్లిద్దరినీ తీసిపారేశారు… అప్పటికే మనసిచ్చిచూడు సీరియల్‌ను ఒంటిచేత్తో మోస్తున్న కీర్తి… అదీ అర్థంతరంగా ఆగిపోవడంతో… చేతిలో ఏ అవకాశం లేక ఖాళీ అయిపోయి… చివరకు ఇప్పుడు బిగ్‌బాస్ హౌజులో తేలింది…

gowri raj… gouriraj pvt photo

ఈ ఒక్క సీరియల్ చూస్తే చాలు, టాప్ సీరియళ్లు ఎంత దరిద్రంగా ఉంటాయో అర్థమైపోతాయి… నటీనటుల పారితోషికాలు, డిమాండ్లను బట్టి కథల్ని మార్చేస్తుంటారు… తోకలు కత్తిరిస్తుంటారు దర్శకులు… ఈ సీరియల్‌లో కూడా జగదీష్, జలంధర్ అనే పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి… లీడ్ రోల్ చేసే శ్రీరాం వెంకట్ మినహా దాదాపు అందరూ బాగానే నటిస్తారు… నిజానికి ఇదీ పాన్ ఇండియా సీరియల్… ఒరిజినల్ మరాఠీ… అది తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం భాషల్లో రీమేక్ అవుతోంది…

manasa

నవ్వొచ్చేది ఏమిటంటే… ఈ సీరియల్ కన్నడ వెర్షన్ జోతెజోతియాలెలో మానస మనోహర్ చేస్తుంటుంది… తెలుగులో కీలకమైన రాజనందిని అనే ఆత్మ, బాధిత ప్రియురాలి పాత్రను చేయాలి… ఏడాదిన్నరగా రేటు కుదరలేదో మరేమిటో గానీ అప్పటి నుంచీ ఆమె ఎంట్రీ వాయిదా పడుతూనే ఉంది… ఇప్పుడు రేట్లు, టరమ్స్ కుదిరినట్టున్నయ్… ఇంకేముం..? కథలో ప్రవేశపెట్టారు… ఈమె కొత్తేమీ కాదు మనకు… మంచి మెరిట్ ఉన్న నటి, ఏదో ఓ దిక్కుమాలిన సినిమాలో హీరోయిన్‌గా చేసింది… ఈమె మాత్రమే కాదు, సీరియల్‌లో వర్ష కనిపించేది, ఆమె వదిలేసి, జబర్దస్త్‌లో తేలింది… ఆమె ప్లేసులో ఇంకెవరినో తీసుకొచ్చి పెట్టారు…

rajanandini

ఒక ఆత్మ… ఆల్‌రెడీ ఎవరిగానో పునర్జన్మ ఎత్తింది… ఐనాసరే మళ్లీ తనే మనిషిగా రూపం సంతరించుకుని వచ్చేసింది… హహహ, రాజనందిని పాత్ర ప్రస్తుతం అదే… ఇందులో మీరా పాత్రలో అనుశ్రీ నటించేది… ఆమె కూడా సీరియల్‌ను హైజాక్ చేసింది కొన్నిరోజులు, తీసిపడేశారు… ఈమధ్య రాగసుధ పాత్రలో గౌరీరాజ్ అదరగొడుతోంది… జిండే పాత్రలో రాంజగన్ సరేసరి… ఎక్కడ ఏం తేడా కొట్టిందో కానీ షీలా పాత్రను చేసే నటినే పక్కకు తప్పించేశారు… చెబుతూ పోతే… అన్నీ ఇవే కథలు… సీరియల్స్ అన్నీ దరిద్రం… కానీ నటీనటుల మెరిట్ మాత్రం సూపర్బ్… ఇంతకీ ఈ మానస మనోహర్‌ను ఎన్నిరోజులు ఉంచుతారు మహానుభావా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూట్యూబు డైట్ ఫ్లాన్లతో బీకేర్‌ఫుల్… ఓ యువకుడు కన్నుమూశాడు…
  • సీఎం రమేష్ స్విచ్ నొక్కితే… బండి సంజయ్ లైటు వెలిగింది…!!
  • పెద్ద ప్రక్రియ ద్వారా విధుల నుంచి తప్పిస్తే సరి… అంతేనా శిక్ష..?!
  • ఆ ఓటీటీలో రిలయెన్స్‌కూ వాటా… ఐనాసరే, కేంద్రం బ్యాన్..!
  • ఆ మోనిత మళ్లీ వస్తోంది… ఈసారి అంతకు మించిన నెగెటివ్ షేడ్స్‌తో..!!
  • ఏడాదిలో తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్‌లో మార్పులు ఇవీ..!
  • షాకింగ్ కలెక్షన్లు… పొరుగు భాషల్లో పోయినట్టే… మరి తెలుగులో..?
  • పది అవతారాలు సరే… ఒకటీరెండు అవతారాలపై అదే సందిగ్ధత…
  • జొమాటో, స్విగ్గీ… ఏదైనా అంతే… ఫుడ్డు తక్కువ, రేట్లు ఎక్కువ…
  • హరిహరా..! ఇవేం కలెక్షన్లు నాయకా..? థియేటర్లు నిర్మానుష్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions