.
ఇప్పుడు ప్రధానంగా కుర్చీ మడత పెట్టే పాటలే ఎక్కువ… మెలొడీ, భావగర్భితమైన పాటలు చాలా తక్కువ… అఫ్‌కోర్స్, గతంలో కూడా గ్గుగ్గూ గ్గుగ్గూ గుడిసుంది వంటి పాటలూ బోలెడు…
కాకపోతే అప్పట్లో ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సినారె… సాహితీ విలువలున్న ప్రయోగాలు కొన్ని చేసేవాళ్లు… అలాగే పదసౌందర్యం ప్రధానమైన ప్రయోగాలూ చేసేవాళ్లు… అలాంటివి బోలెడు…
Ads
ప్రాసలు, పదప్రయోగాల్లో వేటూరి ప్ర-సిద్ధహస్తుడు… అనుకోకుండా యూట్యూబ్‌లో జైలుపక్షి సినిమాలోని ఓ పాట కనిపించింది…
సుహాసిని, శోభన్‌బాబు డ్యూయెట్… సినారె ఓ చిన్న ప్రయోగం… పల్లవి, చరణాల్లో కూడా ప్రతి వాక్యం చివర ‘ళ’ వచ్చేలా రాశాడు… చేయి తిరిగిన రచయితకు అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు… కానీ ఓ మంచి ట్యూన్‌లో కేవీ మహదేవన్ ఆ పాటను పొదిగాడు… ఆసక్తికరంగా ఉంటుంది పాట…
సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ హైదరాబాదు అప్పటి దర్శనీయ స్థలాల్ని, అంటే మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లు, బిర్లా టెంపుల్ గట్రా చూపిస్తూ సరదాగా చిత్రీకరించాడు…
ఇదీ ఆ పాట… ప్రేమ కళ, చంద్ర కళ, ఆది కళ, పెళ్లి కళ, మౌన కళ, గాన కళ , నాట్య కళ, కావ్య కళ, చిలిపి కళ, మదన కళ , జీవ కళ, యోగ కళ… అంటూ చివరకు ‘‘ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సంయోగ కళ’’ అని ముగిస్తాడు…
మనసంతా ప్రేమ కళా… తనువంతా చంద్ర కళా
ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ
మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళనడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ
కళ్ళలో కవితలల్లితే.. అది కావ్య కళ
చంపను చిటుకున మీటితే… అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ
చంపను చిటుకున మీటితే… అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళనిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సంయోగ కళ
Share this Article