Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Not Now… మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైమ్ ఎఫయిర్…!!

July 20, 2024 by M S R

మాదిరెడ్డి సులోచన నవల ప్రేమలు పెళ్ళిళ్ళు ఆధారంగా నిర్మించబడిన ఈ సినిమా 1974 జనవరిలో వచ్చింది . మన దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే లైఫ్ టైం ఎఫైర్ . టివిలు , ఫ్రిజ్లు , కార్లు మార్చేసినట్లు భార్యల్ని భర్తల్ని మార్చేసే రోజులు వచ్చాయి మన దేశంలో కూడా .

రోజూ కీచులాడుకుంటూ , తన్నుకుంటూ గడిపేదాని కన్నా విడిపోవటమే బెటర్ అనే రోజులకు వచ్చాం . ఇదీ కరెక్టే . సర్దుకుపోయే ఓపిక ఉండాలి . లేకపోతే విడిపోవటమే శరణ్యం .

ప్రేమించుకున్నాం అని భ్రమించి మతాంతర వివాహం చేసుకుని , సర్దుకుపోలేక విడిపోతుంది ఓ జంట . భర్త మత్తుకు అలవాటు పడిపోతాడు . మరో స్త్రీ వచ్చి దారిలో పెట్టుకుంటుంది . మొదటి స్త్రీ పాత్రను సినిమా చివర్లో నిష్క్రమింపచేస్తాడు దర్శకుడు . టూకీగా ఇదీ కధ .

Ads

ఇలాంటి కధాంశాలతో మనకు సినిమాలు కుప్పలు కుప్పలు వచ్చాయి . ప్రేమించుకుని విడిపోయే జంటగా అక్కినేని , జయలలితలు నటించగా , రిపేర్ చేసుకుని దారిలోకి తెచ్చుకునే స్త్రీగా శారద నటించారు . ఇతర పాత్రల్లో జి వరలక్ష్మి , రాజబాబు , SVR , నిర్మలమ్మ , రామకృష్ణ , గీతాంజలి , అల్లు రామలింగయ్య , శ్రీధర్ , భానుప్రకాష్ , సంధ్యారాణి ప్రభృతులు నటించారు .

వి మధుసూధనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు M S విశ్వనాథన్ సంగీత దర్శకులు . పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . సి నారాయణరెడ్డి వ్రాసిన చిలికి చిలికి చిలిపి వయసు వలపు వాన అవుతుంది పాట బాగుంటుంది . దాశరధి వ్రాసిన మనసులు మురిసే సమయమిది పాట కూడా బాగుంటుంది . ఎవరు నీవు నీ రూపమేది , ఎవరున్నారు పాపా నీకెవరున్నారు , మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు పాటలు థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి .

కాలేజి రోజుల్లోనే చూసా . ANR లెవెల్లో ఆడనట్లు గుర్తు . ఈమధ్యే టివిలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . అక్కినేని , జయలలిత , శారద అభిమానులు చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……..( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లానికి తెలీకుండా లవర్‌తో జాలీ విదేశీ ట్రిప్‌ ప్లాన్… కానీ..?
  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!
  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!
  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions