Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి సినిమా ప్రేమనగర్ కాదు… ప్రేమాభిషేకం కూడా కాలేదు…

January 29, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… ఎయన్నార్- దాసరి- రామానాయుడు కాంబినేషన్లో 1981సెప్టెంబర్ 24 న వచ్చిన ఈ ప్రేమ మందిరం సినిమా ప్రేమనగర్ , ప్రేమాభిషేకం సినిమాల్లాగా బ్లాక్ బస్టర్లు కాకపోయినా వంద రోజులు ఆడింది .

అదృష్టవశాత్తూ సినిమాలో హీరోహీరోయిన్లను చంపలేదు . చంపి ఉంటే ఈ వంద రోజులు కూడా ఆడేదే కాదు . దాసరి మార్క్ సినిమా . యన్టీఆర్ మనుషులంతా ఒక్కటే ఛాయ కాస్త కనిపిస్తుంది . కధాంశం వేరు .

Ads

శుధ్ధోధన మహారాజు మనుషుల కష్టాలు తెలవకుండా ఉండటానికి సిద్దార్ధుడిని అంతఃపురానికే పరిమితం చేసినట్లు ఈ సినిమాలో జమీందారు గారు మనమడిని లోకంలోని ఆకర్షణలకు లోనుకాకుండా ఉండేందుకు దివాణం దాటనివ్వడు . బయట ప్రపంచాన్ని చూడాలని బయటపడ్డ హీరో దేవదాసి హీరోయిన్ అందానికి , నాట్య నైపుణ్యానికి ఫిదా అయిపోయి ప్రేమించేస్తాడు .

తాతను ఎదిరించి దేవదాసి మధురని పెళ్ళి చేసుకుంటాడు . తండ్రి దివాణానికి తీసుకుని వెళతాడు . కొత్త జంటను చంపేయమని జమీందారు ఆర్డర్ వేస్తాడు . హీరో తండ్రి కొత్త జంటకు ఇవ్వవలసిన విషాన్ని తాను , తన పెద్ద జమీందారు తండ్రి తాగే పాలల్లో కలుపుతాడు . హీరో తండ్రి , తాత చనిపోతారు . ఈ ముగింపును మాత్రం తప్పక మెచ్చుకోవాలి . ఏ బాలచందరో దాసరిని ఆవహించలేదు . రామానాయుడు ఒప్పుకోడనుకోండి . నవలలోని ముగింపునే మార్చాడు ప్రేమనగర్లో ఆయన .

మొత్తం మీద సినిమా బాగానే ఉంటుంది . ఎయన్నార్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం , జయప్రద అందాలు , నృత్యాలు , కె వి మహదేవన్ సంగీతం , దాసరి ఆఫ్ బీట్ ఫ్యూడల్ వ్యతిరేక ఆలోచనా విధానం సినిమాను గట్టెక్కించాయి . వేటూరి , సి నారాయణరెడ్డి , ఆరుద్ర వ్రాసిన పాటల్ని ప్రత్యేకంగా మెచ్చుకోవలసిందే .

anr

చంద్రోదయం , ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం , తొలిసారి పలికెను హృదయం పాటల్లో జయప్రద నృత్యాలు సినిమాకు హైలైట్ . మొదటి రెండు పాటల్ని వేటూరి వ్రాస్తే , మూడో పాటను సి నారాయణరెడ్డి వ్రాసారు . వేటూరి వ్రాసిందే మరో పాట మా ఇంటి అల్లుడా మాపటేల గిల్లుడా అంటూ మూడు తరాల దేవదాసిలు నిర్మలమ్మ , సూర్యకాంతం , రాజసులోచనల డాన్స్ ప్రేక్షకులకు కాస్త ఎబ్బెట్టుగా సాగుతుంది.

దాసరి వ్రాసిన క్లైమాక్స్ సాంగ్ అమరం అమరం మన కధ అమరం బాగుంటుంది . ఎయన్నార్ , జయప్రదలు నటించిన సినిమా పేర్లతో సాగే పాట ‘ఎప్పుడో ఎక్కడో చూసినట్లు ఉన్నది’ సరదాగా ఉంటుంది . ఆరుద్ర వ్రాసారు .

ambika

వేటూరి వ్రాసిందే మరో పాట ఆటా తందానతాన పాటా ఎయన్నార్ , దాసరి అద్దాలమేడ సినిమా హీరోయిన్ అంబికల మీద కూడా బాగుంటుంది . ఈ సినిమా ఆడటానికి ముఖ్య కారణం పాటలు , సలీం నృత్య దర్శకత్వం అనే చెప్పాలి . మనుషులంతా ఒక్కటేలో కనిపించిన బెంగుళూరు పెలస్ మళ్ళా ఈ సినిమాలో కనిపిస్తుంది . బ్రిటిష్ ఇండియా కధ కాబట్టి ఈ పేలస్ అవసరమే .

గుమ్మడి , జగ్గయ్య , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , నగేష్ , చలం , పి జె శర్మ , రావి కొండలరావు , శ్రీధర్ , బాలకృష్ణ (అంజి గాడు) , గీత , రమాప్రభ ప్రభృతులు నటించారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూడని ఎయన్నార్ , జయప్రద అభిమానులు చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతిని… ఆ వెగటు కూతల నిర్మాత పిచ్చి కూతలు మళ్లీ… కవరింగు…!
  • అరాచకం..! షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు..!!
  • వావ్… వాట్ ఏ క్రికెట్ మ్యాచ్… మూడు సూపర్ ఓవర్లతో ఫలితం…
  • దిల్ రాజు గారూ… మరి మీకూ బాధ్యత ఉండాలి కదా, మరిచారా..?!
  • మోడీ సైప్రస్ ఫోటో వెనుక… శత్రు తుర్కియేకు ఓ స్ట్రాంగ్ వార్నింగ్..!!
  • జాగ్రత్త, ప్రభుత్వ సంస్థల పేరిట సైబర్ ఫ్రాడ్… పదిమందికీ షేర్ చేయండి…
  • లతా, ఎందుకు చేశావీ పని..? గాంధీ మునిమనమరాలు- ఓ ఫ్రాడ్ కేసు..!!
  • ‘సూపర్ సిక్స్’ ప్యాక్ రేవంత్ రెడ్డి… నిజంగానే ఇది చేస్తే మరింత మేలు..!!
  • పార్టీ జర్నలిస్టు వేరు- పార్టీ కార్యకర్త వేరు… తేడాను చెరిపేశారు…
  • వినోద రూపంలో సందేశం ఓ మంచి కళ… ఈ ఇద్దరు దొంగలు వాళ్లే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions