.
Subramanyam Dogiparthi … హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన ముకద్దర్ కా సికందర్ సినిమాకు రీమేక్ 1980 అక్టోబర్ 24న విడుదలయిన ఈ ప్రేమ తరంగాలు సినిమా . హిందీలో అమితాబ్ , వినోద్ ఖన్నా , రేఖ , రాఖీ , అంజాద్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో నటించారు . మరెందుకనో మన తెలుగు సినిమాను జనం ఆదరించలేదు .
యస్ పి చిట్టిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ పాత్రను కృష్ణంరాజు , వినోద్ ఖన్నా పాత్రను చిరంజీవి , రేఖ పాత్రను జయసుధ , రాఖీ పాత్రను సుజాత , అంజాద్ ఖాన్ పాత్రను సత్యనారాయణ వేసారు . జయసుధది దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్ర వంటి పాత్ర . ఇలాంటి పాత్రనే మళ్ళా ప్రేమాభిషేకంలో నటించింది ఆమె .
Ads
సెంటిమెంట్ , ఏక్షన్లతో కూడుకున్న విధి బలీయం సినిమా . సుజాతను కృష్ణంరాజు ప్రేమించినా చివరిదాకా చెప్పడు . సుజాత , చిరంజీవిలు ప్రేమించుకుంటారు . కృష్ణంరాజుని జయసుధ చంద్రముఖి లాగా ఆరాధిస్తుంది . జయసుధని సత్యనారాయణ గాఢంగా ప్రేమిస్తాడు . ఇలా criss criss love story అన్న మాట .
కృష్ణంరాజుది అమరదీపం సినిమాలో అన్న పాత్ర వంటిదీ సినిమాలో కూడా . సినిమా చివరకు వచ్చేటప్పటికి కృష్ణంరాజు , జయసుధ , సత్యనారాయణ ముగ్గురూ చనిపోతారు .
మహానటి సావిత్రి కాసేపు కనిపిస్తుంది . కాంతారావు , బేబి తులసి , పి జె శర్మ , కె వి చలం , నర్రా , సారధి , చలపతిరావు , ఝాన్సీ , భీమరాజు , రమణమూర్తి , ముక్కామల , ప్రభృతులు నటించారు . చాలా పాత్రలు ఉంటాయి సినిమాలో . Looks overcrowded .
కాస్తో కూస్తో చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు కాస్త ఊరట . సి నారాయణరెడ్డి వ్రాసిన ప్రేమ తరంగాలు నవజీవన రాగాలు , కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఐకానిక్ సాంగ్ అయిన ప్రేమ తరంగాలు హిట్ సాంగ్ కూడా . ఆత్రేయ వ్రాసిన మనసు ఒక మందారం చెలిమి తన మకరందం , నవ్వేందుకే ఈ జీవితం నవ్వొక్కటేరా శాశ్వతం , నా హృదయం తెల్ల కాగితం పాటలు శ్రావ్యంగా ఉంటాయి . చిత్రీకరణ కూడా బాగుంటుంది .
గొల్లపూడి డైలాగులు బాగుంటాయి . ఈ సినిమాను తమిళంలోకి కూడా రీమేక్ చేసారు . తమిళంలో శివాజీ , శ్రీప్రియ , మాధవి నటించారు . అక్కడ ఎలా ఆడిందో తెలియదు . ముకద్దర్ కా సికిందర్ సినిమా కూడా యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పకుండా చూడండి .
సాథీరే ఓ సాథీరే పాట సూపర్బుగా ఉంటుంది . రేఖల గురించి చెప్పేదేముంది . అలాంటి melancholic పాత్రల్లో ఆమెకు సాటి ఆ తరంలో , తర్వాత తరంలో ఎవరున్నారు ? ఆమెకు ముందు మీనాకుమారే . మన తెలుగులో మహానటి సావిత్రి . సావిత్రి తర్వాత జయసుధ .
అలాగే అమితాబ్ . melancholic పాత్రల్లో రాజ్ కుమార్ , రాజ్ కపూర్ , దిలీప్ కుమార్ల తర్వాత తరంలో ఆయనకు ఆయనే సాటి . హిందీ సినిమా తప్పక చూడండి . మన తెలుగు సినిమా కాస్త బోరే . కృష్ణంరాజు , చిరంజీవి , జయసుధ అభిమానులు అయితే ట్రై చేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article