కార్తీకదీపం సీరియల్‌తో ప్రతి తెలుగింటికి ఆడపడుచుగా మారిపోయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి వేరే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఆ ఒక్క సీరియల్ ఆమెకు అబ్బురపరిచే ఆదరణను తీసుకొచ్చింది… సరే, కార్తీకదీపం సీక్వెల్ పెద్దగా క్లిక్ కాకపోయినా సరే, ప్రేమి పట్ల తెలుగుజనం ప్రేమ తగ్గలేదు… నిజానికి ఆ సీరియల్‌కు ఆమే ప్రాణం…
మరీ అందగత్తె ఏమీ కాదు, తెలుగు రాదు… ఐనాసరే, సూపర్ సక్సెస్… ఆమె తరువాత పరిటాల నిరుపమ్ కూడా అంతే ఆదరణను పొందాడు… టీవీ శోభన్‌బాబు… నిరుపమ్ సంగతి సరే, కానీ ప్రేమి పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వదు, బయటి ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడం చాలా అరుదు… అలాంటిది స్టార్ మాటీవీ ఆమెను బయటి కేంద్రాలకు కూడా తీసుకొచ్చేసింది…
ఇన్నాళ్లూ స్టూడియోలో జరిగే మా ఉత్సవాన్ని ఇప్పుడు జిల్లాల్లోకి తీసుకుపోతోంది… గతంలో ఈటీవీ తెలుగు సినిమా పాటలతో విస్తృతంగా జనంలోకి వెళ్లేది… ఇప్పుడు మానేసినట్టుంది… ఇప్పుడు ఆ బాటలో మాటీవీ వెళ్తున్నట్టుంది… వచ్చే ఆదివారం మధ్యాహ్నం ప్రసారం కాబోయే ఈ మా ఉత్సవం ప్రోమో బాగుంది చూడటానికి…
Ads
ఎటొచ్చీ ఝాన్సీ గాకుండా హోస్టింగ్ వేరే వాళ్లయితే బాగుండేది… అలాగే పల్లవి ప్రశాంత్‌ను పట్టుకొచ్చి మళ్లీ ఏదో ఓవరాక్షన్ చేయించాారు… రైతు అనే పేరుతో తను బిగ్‌బాస్ షోలో నడిపించేదే పెద్ద డ్రామా… తోడుగా యావర్, శివాజీ… వచ్చిన డబ్బును రైతులకు పంచుతానని చెప్పి, జల్సా చేస్తున్నాడు, నెగెెటివిటీ బాగా పెరిగి ఉంది జనంలో… అలాంటి కేరక్టర్‌ను స్టార్ మా ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తుందో తెలియదు…
పర్లేదు, నిరుపమ్, ప్రేమి మాత్రమే గాకుండా… కమెడియన్లు సద్దాం, యాదమరాజు, రీతూ చౌదరి తదితరులు కూడా కనిపించారు… ఫన్ ఓరియెంటెడ్… స్టూడియోలో చేసే తమాషాలే, ఫన్నీ ఆటలే వేదిక మీద… చివరకు ప్రేమితో దోసెలు కూడా వేయించారు…
కొందరు ప్రేక్షకులను వేదికపైకి అనుమతించి, ఇన్వాల్వ్ చేయడం వంటివి, ఇలాంటి బయటి ఉత్సవాలు కూడా మాటీవీ బ్రాండ్ వాల్యూ పెరగడానికి దోహదపడుతాయి… మంచి స్ట్రాటజీయే… కాకపోతే వ్యయం, ప్రయాస ఎక్కువ… స్టూడియోలో క్లోజ్‌డ్ ఎన్విరాన్‌మెంట్ కాబట్టి సాఫీగా ప్రోగ్రాం షూట్ చేసుకోవచ్చు… టేకులు కూడా తీసుకోవచ్చు, కానీ లైవ్ ప్రసారాల్లో కుదరవు…
తెలంగాణ సాంస్కృతిక కేంద్రం వరంగలే కదా… అక్కడే ఈ మా ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం కూడా బాగుంది… వరంగల్ జనానికి కళాభిరుచి ఎక్కువ కదా… ఇలాంటివి ఇట్టే సక్సెసవుతాయి… ప్చ్, ఈ ఉత్సవాల్లో కూడా కుర్చీ మడతబెట్టి పాట, డాన్సులు తప్పలేదు… అదొక జాతిగీతమైపోయింది… ఖర్మ..!!
Share this Article