ఫాఫం వంటలక్క… ఆమెకు నీరాజనాలు పట్టిన జనాలే ఇప్పుడు ఇక చాల్లే, ఫోఫోవమ్మా అనేస్తున్నారు… కార్తీకదీపం సీరియల్ స్థితిగతులు మరింత దిగజారినయ్… నిజానికి ఈ సీరియల్ రోజురోజుకూ రేటింగ్‌పరంగా ఎలా పతనమవుతుందో ‘ముచ్చట’ చెబుతూనే ఉందిగా… ఈ వారం బార్క్ రేటింగ్స్ చూస్తే… అసలే ఆ ఏడుపు సీరియల్ నటులకు మరింత ఏడుపొచ్చేలా ఉన్నయ్… ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల రేటింగ్స్‌ను దాటి, అబ్బో, మాటీవీ వాడి రేటింగ్ మేనేజ్‌మెంట్‌కు తిరుగులేదు, కథానాయిక ప్రేమీ విశ్వనాథ్‌కు ఎదురులేదు అన్నట్టుగా ఉండేది… మరి ఇప్పుడు..?
31.1.2022… దేవత… 12.84 టీఆర్పీ
31.1.2022… ఇంటింటి గృహలక్ష్మి… 12.55 టీఆర్పీ
29.1.2022… గుప్పెడంత మనసు… 12.37 టీఆర్పీ
3.2.2022… కార్తీకదీపం… 10.01 టీఆర్పీ
31.1.2022… జానకి కలగనలేదు… 9.88 టీఆర్పీ
ఇవన్నీ మాటీవీ సీరియళ్ల రేటింగులో… ఉదాహరణకు ఇవన్నీ… కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు మోనోపలీ ఏమీ కాదు… మిగతా సీరియళ్లు దాన్ని తొక్కేస్తున్నయ్… కాదు, ప్రేక్షకులే తిరస్కరిస్తున్నారు… వాస్తవానికి దిక్కుమాలిన కథ, కథనాలతో, చెత్త ఎపిసోడ్లతో చిరాకెత్తించడం ప్రతి సీరియల్‌కూ అలవాటే… కానీ ఇన్నాళ్లూ కార్తీకదీపం అంటే అదొక క్రేజు… కానీ ఇప్పుడు జనం తలపట్టుకుంటున్న సీరియల్…
Ads
పేరుకు మాటీవీ టాప్ సీరియళ్ల జాబితాలో కార్తీకదీపమే ఉంటుంది… కానీ ఒకప్పుడు హైదరాబాద్ బార్క్ కేటగిరీలో 16, 17, 18 టీఆర్పీల దాకా వెళ్లి, అందరికీ ఈర్ష్య పుట్టించి, ప్రేమిని అత్యంత పాపులర్ నటిని చేసిన ఈ సీరియల్ రేటింగ్స్ ఇప్పుడు గరిష్టంగా 14 మాత్రమే… ఒకరోజయితే మరీ 10 కు పడిపోయింది… అంటే ఓ సాదాసీదా సీరియల్ స్థాయికి జారిపోయింది… ఒకరోజు దేవత సీరియల్ 12.84 కు చేరిందంటే అర్థం అవుతోంది కదా… నిజానికి ప్రేమికన్నా ఇప్పుడు కాస్తో కూస్తో ఆ సీరియల్‌ను నిలబెడుతున్నది మోనిత పాత్ర పోషిస్తున్న శోభ శెట్టి మాత్రమే… కొత్త పాత్రల్ని ఏవేవో తీసుకొస్తున్నా అవేవీ ప్రేక్షకులకు ఎక్కడం లేదు… ఆ ఇద్దరు పిల్లలు కృతిక, సహృద ప్లస్ ఆ నల్కా హీరో నిరుపమ్ కూడా విసుగెత్తిస్తున్నారు…
కేరాఫ్ అనసూయ అనే సీరియల్‌ను ఒంటిచేత్తో లాగిస్తున్న అర్చన అనంత్ (సౌందర్య పాత్రధారి) ఈ కార్తీకదీపంలో వెలవెలబోతోంది… కారణం ఆ పాత్ర దరిద్రమే… నిజానికి ప్రేమి పరిస్థితే దయనీయం… ఆమెకు వేరే సీరియల్స్ ఏమీ లేవు చేతిలో… సల్మాన్ త్రీడీ అనే ఒక ఏడు భాషల సినిమాలో చేస్తోంది కానీ అది ఓ చిన్నపాత్ర… వెరసి కార్తీకదీపం కొడిగట్టింది, ఏమోయ్, పిచ్చి దర్శకా, కళ్లు తెరువు… కథ ముగించెయ్…!! లేకపోతే చివరకు అదే మాటీవీలో దరిద్రపు రేటింగ్స్‌తో కుంటుతున్న కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్, మాయాద్వీపం కూడా నీ కార్తీకదీపాన్ని దాటేసే ప్రమాదం ఉంది…!!
Share this Article