సామాజిక పింఛన్ల పథకానికి వైఎస్ఆర్ పేరును తీసేసి ఎన్టీయార్ భరోసాగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది… ఇదీ పొద్దున్నే కనిపించిన వార్త… సరే, ఊహించిందే… ఇది మాత్రమే కాదు… అనేకానేక పథకాలకు జగన్, వైఎస్ పేర్లున్నయ్, అవన్నింటినీ తుడిచేస్తాడు చంద్రబాబు… ఎన్టీయార్ పేరో, మరో పేరో పెడతాడు, సరే, వాళ్లిష్టం…
నిజానికి ఇలా నాయకుల పేర్ల బదులు ఇంకేవైనా మంచి తెలుగు పేర్లు పెట్టి ఉంటే… ఇలా ఎడాపెడా పేర్ల మార్పిడి పథకం అవసరం లేదు… ఉండదు… మరీ జగన్ హయాంలో పథకాలకు వైఎస్ పేరు పెట్టిన తీరు చాలా టూమచ్… జస్ట్, వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రం పేరు మార్చలేదు, అంతే…
అసలు ఇదే కాదు, చంద్రబాబు కరకట్ట గెస్ట్ హౌజు నుంచి క్యాంటీన్లు, అమరావతి దాకా జరిగిన చాలా విధ్వంసాన్ని చంద్రబాబు ఇప్పుడు పునర్నిర్మాణం స్టేజీలోకి తీసుకురావాలి, వస్తాడు… స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్స్‌పై జగన్ బొమ్మ ఉన్నా సరే, పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం సరైన పాజిటివ్ చర్య… దాంతో చంద్రబాబుకు పొలిటికల్ నష్టమూ లేదు, సో, అలాంటి ఇష్యూస్ జోలికి పోకపోవడమే ఉత్తమం…
Ads
తను చెప్పిన అంశాల్లో చకచకా అయిదు ‘తొలి సంతకాలు’ చేసి చంద్రబాబు ఫస్ట్ రోజే మంచి మార్కులు కొట్టేశాడు… కొలువులివ్వాలి కాబట్టి మెగా డీఎస్సీ, జనంలో సందేహాలున్నాయి కాబట్టి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటివి అవసరమా లేదానేది వేరే డిబేట్.,. కానీ జగన్ నుంచి నిన్న విచిత్రమైన, ఇప్పుడు తను మాట్లాడకూడని అంశాలు వినిపించాయి…
పార్టీ ఎమ్మెల్సీల భేటీలో… ఇప్పటికీ మనకే మండలిలో మెజారిటీ… అందరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పుకొచ్చాడు… అన్యాపదేశంగా జగన్ బిల్లులకు అప్పట్లో చంద్రబాబు మండలిలో మోకాలడ్డినట్టు ఇప్పుడు జగన్ అడ్డుపడతాడా..? అదేనా హింట్..? అది బయటికి వెల్లడించాలా..? అప్పట్లో జగన్ మండలి రద్దుకు నిర్ణయం తీసుకుని, తరువాత వెనక్కి తగ్గాడు, మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మండలి రద్దుకు సాహసంగా నిర్ణయం తీసుకోవాలా..? మండలిలో మాకు బలముంది అని జగన్ చంద్రబాబును అలర్ట్ చేయడం అవసరమా..?
సరే, మనం మళ్లీ లేస్తాం, ఇంతకు మించిన ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాం, పర్లేదు, నాలుగైదు కేసులు పెడతారు, అంతేకదా, పోరాడదాం వంటి మాటలు అవసరమే, కేడర్ డిమోరల్ గాకుండా చూసుకోవాల్సిన అవసరమూ ఉంది… గుడ్… కానీ ఇప్పుడు ఎన్డీయే ఉన్న స్థితిలో ప్రత్యేక హోదాకు మద్దతుకు లింక్ పెట్టకపోవడం చంద్రబాబు చేసిన తప్పు అంటాడు జగన్… అదెట్లా..?
చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి… బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే వోట్లు అడిగాయి… మద్దతుకు కొర్రీలు అనైతికం అవుతుంది… పైగా టీడీపీ తన మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదాను ప్రస్తావించలేదు… కాంగ్రెస్ ఎలాగూ గాలికిపోయే పేలపిండి అన్నట్టుగా తన మేనిఫెస్టోలో పెట్టింది, వచ్చేదీ లేదు, పోయేదీ లేదు కాబట్టి… పైగా గత అయిదేళ్లలో బీజేపీకి పార్లమెంటులో ప్రతీ దశలో మద్దతునిచ్చిన జగన్ ఏ ఒక్కరోజూ ప్రత్యేక హోదాను అడగలేదు, ప్రస్తావించలేదు, అసలు ఆ ఊసే లేదు… ఇప్పుడేమో చంద్రబాబు ప్రత్యేక హోదాను పక్కనపడేశాడు అనడం విచిత్రం… ఇలాంటివి ఇంకా ఎమోషన్స్‌ను రాజేయలేవు…
సాయిరెడ్డి ఎక్కడో చెబుతున్నాడు… మాకు రాజ్యసభలో 11 మంది ఉన్నారు, బీజేపీకి మా అవసరం ఉంది, టీడీపీ లోకసభలో ఉంటే మాకు రాజ్యసభలో బలం అని చెప్పుకొచ్చాడు… అంటే అమిత్ షాకు హింట్ ఇస్తున్నాడా..? ఇదుగో ఇక్కడ కాస్త చూసుకో అని..! నిజంగానే ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి ప్రతికూల స్టాండ్ తీసుకోగలదా వైసీపీ..? ఇదుగో ఇలాంటి సందర్భాల్లోనే సంయమనం పాటిస్తూ… ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం తప్పుటడుగు వేస్తుందో కాచుక్కూర్చోవాల్సిందే తప్ప మళ్లీ ప్రత్యేక హోదా పాటెత్తుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు… చూసేవాళ్లకూ నచ్చదు..!!
Share this Article