కరోనా మార్కెట్లో కోట్లకుకోట్ల దందాకు తెరతీసిన రెమ్‌డెసివర్ వాడకానికి మన ప్రభుత్వం ఎట్టకేలకు తెరవేసింది… ఆ మందు వాడకండీ అనేస్తోంది… ఇంతకుముందు స్టెరాయిడ్ల వాడకాన్ని చూసీచూడనట్టు వదిలేసింది… అఫ్ కోర్స్, కరోనా నియంత్రణ, వైద్యం, వేక్సిన్, ఆక్సిజన్, బెడ్స్, డ్రగ్స్… ఏవిషయంలోనూ మోడీ ప్రభుత్వానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు అని చెప్పుకుంటున్నదే కదా… ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ గట్రా పంచరంగుల ఫంగసులూ పుట్టుకురావడంతో… మొదట ఏదేదో చెప్పడానికి ప్రయత్నించింది… చివరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లలో మినరల్ వాటర్ వాడకపోవడమే కారణమనీ కొందరు నిపుణులు తోచిన ప్రచారం స్టార్ట్ చేసేశారు… ఇప్పుడు కేంద్రం కళ్లు తెరుచుకుని, మొదటి వారం స్టెరాయిడ్లు వాడకండిరా నాయనలారా అని ఇప్పుడు చెబుతోంది… తాజాగా కేంద్రం జారీచేసిన ప్రొటోకాల్, మార్గదర్శకాల్లో మరో ప్రధానమైన అంశం ప్లాస్మా థెరపీని ఎత్తేయడం… అంతేకాదు, ఐవర్ మెక్టిన్ ఇంకో ప్రధానమైన అంశం…
మైల్డ్, మోడరేట్ లక్షణాలున్న వాళ్లకు ఇచ్చే మెడికల్ కిట్లలో ఐవర్‌మెక్టిన్ మాత్రల్ని కూడా పెట్టేసి చాలారోజులుగా అమ్ముతున్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే… అవి పనిచేస్తున్నయ్ కూడా… కానీ సహజంగానే ఎప్పుడూ కళ్లుమూసుకుని పడుకునే డీసీజీఐ దీని వాడకానికి నో అనేసింది… అదేమంటే WHO వైపు చూపించేది… ఆ WHO మన డీసీజీఐ కూడా అధ్వానమే కదా… అమెరికా, బ్రిటన్ సైంటిస్టులు కొందరు ఐవర్ మెక్టిన్ వాడకమే ప్రస్తుతం బెటర్ అని వ్యాసాలు రాస్తే, మన గోవా ప్రభుత్వం ఎప్పుడో స్పందించి, 18 దాటిన ప్రతి ఒక్కరికీ ఈ మాత్రల్ని అందుబాటులో ఉంచింది అధికారికంగా… డోస్ చెప్పింది… అప్పుడైనా కేంద్రం కదలాలి కదా… నో, కదల్లేదు… కారు చౌకగా దొరికే మందు మీద దానికి ధ్యాసే లేదు… ఇక ఇప్పుడు తాపీగా మైల్డ్ లక్షణాలుంటే వాడుకోవచ్చులే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…
Ads
వేక్సిన్లపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది… ఈ దశలో రెండు మందులు కరోనా రోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నయ్… అది మన డీఆర్డీవో డెవలప్ చేసి, డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేసే టూడీజీ పొట్లాలు… వాటి రిజల్ట్ కూడా బాగుందని ప్రయోగఫలితాలు చెబుతున్నయ్… కానీ వాటి ఉత్పత్తి సరిపడా సాగేదెలా..? రోజుకు రెండు లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్న సునామీ స్థితిలో రెడ్డీస్ స్వల్ప ఉత్పత్తి మన అవసరాలకు సరిపోతుందా..? లేదు..! మరొకటి కాక్టెయిల్ యాంటీబాడీస్… అవీ దేశంలోకి రావడానికి కేంద్రం వోకే చెప్పింది… శాంపిల్ ప్రయోగాల్లో దీని ఫలితాలు కూడా చాలా బాగున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు… తాజాగా హైదరాబాద్ ఎఐజీ కూడా అదే చెప్పింది… మందు ధర 60 వేలు… హాస్పిటల్లో చేరే అవసరాన్ని చాలావరకు తగ్గిస్తుందనేది ఆశ… కానీ సేమ్, అదే సమస్య… తక్కువ లభ్యత..! రోజుకు 2 లక్షల కేసులొస్తున్న స్థితిలో జస్ట్, 2 లక్షల వయల్స్ మాత్రమే ప్రస్తుతానికి దిగుమతి అవుతాయట… సో, ఇప్పటికీ ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడే బాధ్యత, ఆశ ప్రధానంగా దేవుడి మీదే… మరి థర్డ్ వేవ్ వస్తే..? ఇలాంటి గొట్టు ప్రశ్నలు అడక్కండి ప్లీజ్…!
Share this Article