అమెరికా ప్రపంచంలోకెల్లా ఓ పే-ద్ద మాయా బజార్. చాలావరకు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కనిపిస్తాయి. పైపైన చూస్తే ఒకరకంగా కనిపిస్తుంది, డీప్ గా అబ్సర్వ్ చేసి చూసినా, మనం కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నా ఇంకో రకంగా కనిపిస్తుంది…
అది పక్కన పెడితే, ఇంకో 8 వారాల్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉన్నవి రెండే రెండు పార్టీలు కదా…
1. రిపబ్లికన్ పార్టీ
2. డెమోక్రాటిక్ పార్టీ
Ads
అమెరికా ప్రజల్లో 80% మంది వ్యక్తులని బట్టి ఓట్లు వేయరు, పార్టీకున్న ప్రాధమిక పాలసీ, విధానాలని బట్టి వోటు వేస్తారు.
ఉదాహరణకి రిపబ్లికన్ పార్టీ ప్రధానంగా అబార్షన్లకి వ్యతిరేకం, గే (ఆడ-ఆడ, మగ-మగ) మ్యారేజ్ లకి వ్యతిరేకం. ధనవంతులకి ట్యాక్స్ కట్ చేస్తే వారు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారు అనేది రిపబ్లికన్ పార్టీ విధానం. ట్యాక్స్ లు తక్కువ ఉండాలి, ప్రభుత్వం తక్కువ జోక్యం చేసుకోవాలి, మిలటరీ మీద ఎక్కువ ఖర్చు చేయాలి అనేది ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ విధానం.
డెమోక్రాటిక్ పార్టీ ప్రధానంగా అబార్షన్లకి, ఆడ-ఆడ, మగ-మగ మ్యారేజ్ లకి అనుకూలం. ట్యాక్స్ ల విషయంలో ధనవంతులకి ఎక్కువ ట్యాక్స్ లు ఉండాలి, ఇంకా చాలా విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండాలి, మిలటరీకి తక్కువ ఖర్చు చేయాలి అనేది ప్రధానంగా డెమోక్రాటిక్ పార్టీ విధానం.
పార్టీ విధానాలని పక్కన పెడితే – అమెరికా మీడియా బయటికి శుద్దపూసలాగా కనిపిస్తుంది కానీ అమెరికన్ మీడియాని మించిన కరప్ట్ మీడియా ప్రపంచం మొత్తంలో ఎక్కడా ఉండదు అనేది ఒక అభిప్రాయం.
ఫాక్స్ మీడియా తప్ప అమెరికాలో ఉన్న మీడియా అంతా డెమొక్రాటిక్ కి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఫాక్స్ లో కూడా కొంత మంది డెమొక్రాటిక్ వైపు ఉన్నారు. ఏ మీడియా తీసుకున్నా; న్యూయార్క్ టైంస్, వాషింగ్టన్ పోస్ట్, చికాగో ట్రిబ్యూన్ పత్రికలు, MSNBC న్యూస్, CNN, NBC, CBS, ABC, NPR ఛానల్స్ అన్నీ డెమోక్రాటిక్ పార్టీకి డైరక్ట్ గా, ఇన్ డైరక్ట్ గా సపోర్ట్ చేస్తాయి. “చెప్పేది శ్రీ రంగ నీతులు, చేసేది —” అన్నది అమెరికాకి, అమెరికా విధానాలకి, అమెరికా మీడియాకి 100% సరిపోతుంది.
అమెరికా బయట ఉండే దేశాల్లోని ప్రజలకి అమెరికా ఎన్నికలు అనగానే ఇమ్మిగ్రేషన్, ఫారిన్ పాలసీ, అమెరికా ఎకానమీ మాత్రమే ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి ఈ మూడు విషయాల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ దే పై చేయి కాబట్టి, అతనే గెలుస్తాడు అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. కానీ అమెరికా ఎన్నికల్లో అమెరికా ప్రజలు చూసే 20 ప్రధాన విషయాలు.
1. ఎకానమీ
2. హెల్త్ కేర్
3. ఇమ్మిగ్రేషన్
4. సామాజిక న్యాయం
5. ట్యాక్స్ విధానం
6. ఫారిన్ పాలసీ (రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలగునవి)
7. అబార్షన్ విధానం
8. విద్య, వైద్యం
9. హౌజింగ్
10. క్రైం
11. సుప్రీం కోర్ట్, జస్టిస్ సిస్టం
12. ప్రజాస్వామ్యం
13. వాతావరణ మార్పులు
14. ద్రవ్యోల్బణం
15. నిరుద్యోగం
16. నాయకత్వ లక్షణాలు
17. మోటివేషన్
18. ఎనర్జీ పాలసీ
19. బోర్డర్ సెక్యూరిటీ
20. గన్ కల్చర్
అమెరికా ఎన్నికలు ఎలక్టోరల్ వోట్లని బట్టి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి సైజ్ ని బట్టి కొన్ని ఎలక్టోరల్ వోట్లు కేటాయించారు. ఉదాహరణకి టెక్సాస్ రాష్ట్రానికి 40, చికాగో ఉన్న ఇల్లినోయిస్ రాష్ట్రానికి 19, క్యాలిఫోర్నియా రాష్ట్రానికి 54… అలా 50 రాష్ట్రాలకి కలిపి 538 ఎలక్టోరల్ ఉంటై. రెండు పార్టీల నుంచి నిలబడిన వ్యక్తుల్లో ఆయా రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎలక్టోరల్ ఓట్లు వారికే వస్తాయి.
క్యాలిఫోర్నియాలో డెమోక్రాటీక్ పార్టీ నుంచి కమలా దేవి నిలబడాల్సిన అవసరం లేదు. అక్కడ కొండాపూర్ కుక్కని నిలబెట్టినా అక్కడ డెమోక్రాటిక్ వైపే ఎక్కువ ఓట్లు వేస్తారు. ఆటోమ్యాటిక్ గా అక్కడ ఉన్న 54 డెమోక్రాటీక్ క్యాండిడేట్ కే వస్తాయి. సియాటెల్ ఉన్న వాషింగ్టన్ (12), చికాగో ఉన్న ఇల్లినోయిస్ (19), న్యూయార్క్ (28), న్యూజర్సీ (14), మేరీ ల్యాండ్ (10) – 127 సీట్లు లేదా ఎలక్టోరల్ ఓట్లు ఎవరు నిలబడినా డెమోక్రాటిక్ పార్టీ క్యాండిడేట్ కే వస్తాయి. అధ్యక్షుడిగా గెలవటానికి కావాల్సిన సీట్లు 270. అదే విధంగా రిపబ్లికన్ పార్టీ నుంచి ఎవరు నిలబడినా నార్ట్ డకోటా, అర్కన్సాస్స్, టెన్నెసీ, అలబామా, మిస్సిస్సిపి, లూసియానా, కెంటకీ మొదలగు రాష్ట్రాల్లోని ఓట్లు రిపబ్లికన్ అభ్యర్ధికే వస్తాయి. వారి వారి పార్టీ విధానాలని బట్టి…
క్యాండిడేట్ ని బట్టి వేసే ఓట్లు 20% లోపే ఉంటాయి. అమెరికా ప్రజలు చూసే 20 అంశాల్లో ఎకానమీ, ఇమ్మిగ్రేషన్, ఫారన్ పాలసీ, నాయకత్వ లక్షణాలు, బోర్డర్ సెక్యూరిటీ… ఈ 5 అంశాల్లో డోనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతారు, కానీ మిగతా 15 అంశాల్లో డెమొక్రాటిక్ క్యాండిడేట్ కమలా దేవి వైపు మొగ్గు ఉంది. అన్నింటికి మించి అమెరికా మీడియా అంతా డెమొక్రాటిక్ పార్టీ వైపు ఉంది.
డోనాల్డ్ ట్రంప్ ఎమోషనల్ పర్సన్, కమలా దేవి తెలివి కలది. అమెరికాలో ఉన్న 47 రాష్ట్రాల్లో పార్టీ విధానాలని బట్టి, క్యాండిడేట్స్ ని బట్టి ఆల్ రడీ ఒక అంచనా ఉంది. మిగిలిన 3 రాష్ట్రాల్లో ఎవరు గెలిస్తే వారే అమెరికా ప్రెసిడెంట్ అవి; మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్ వేనియా…. నెవేడా, ఆరిజోనా లో 50-50 ఉంది… అవి డోనాల్డ్ ట్రంప్ గెలిచి, ఈ మూడింటిలో ఒక్క దానిలో ట్రంప్ గెలిచినా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడు… ఒకవేళ ఆరిజోనాలో కమలా దేవి గెలిస్తే ఈ మూడింటిలో రెండు రాష్ట్రాల్లో ట్రంప్ గెలవాలి… లేదు అంటే కమలా దేవినే అమెరికా అధ్యక్షుడు అవుతారు…
నిజంగా ఈ ఎన్నికలు మాత్రం అమెరికా భవిష్యత్ నిర్దేశించేవి… ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికన్ మీడియా మీద, అమెరికాలో కరప్ట్ అయిన వ్యవస్థల మీద డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేదా మీడియా అండదండలతో కమలా దేవి గెలుస్తారా చూడాలి. ఎవరు గెలిచినా అదొక మాయా బజార్; అమెరికాలో ఉన్నది లేనట్లు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్లు కనిపిస్తుంది…. – పూర్తి వ్యక్తిగత అభిప్రాయం (జగన్నాథ్ గౌడ్)
Share this Article