.
ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది బిగ్‌బాస్ టీమ్… ఈ సీజన్ చివరి కెప్టెన్ ఎంపిక కోసం పాత బిగ్‌బాస్ సీజన్లలో మెరిసిన కొందరిని పట్టుకొచ్చాడు… వాళ్లతో పోటీ…
ఎవరెవరు గెలిస్తే వాళ్ల మధ్య చివరి పోటీ పెడతాడు… మానస్, హారిక, ప్రియాంక, గౌతమ్ తదతరులు వచ్చారు… (మానస్ వచ్చినప్పుడు తనూజ చాలా ముభావంగా, దూరదూరంగా ఉండిపోయింది, పాత పంచాయితీలు ఏమైనా ఉన్నాయా..?)
Ads
నిజానికి ఈ సీజన్ కెప్టెన్సీకి పెద్ద వాల్యూ ఏమీ లేదు… అందరూ చివరి వారాల్లోకి వచ్చేశారు… ఇక రెండు డబుల్ ఎలిమినేషన్లు రెండు వారాల్లో పూర్తి చేసి, ఐదుగురినో, ఆరుగురినో ఫినాలే వీక్‌లో ఉంచేస్తారు… చివరి రెండు వారాల్లో కెప్టెన్ ఉండడు… అంతా ఏవీ షోలు, రంగురంగుల డెకరేషన్ల నడుమ ప్రి-వీడ్కోలు షోలు ఉంటాయి…
ఐతే ఇప్పటివరకు వెళ్లిపోయిన వారి సంగతి ఎలా ఉన్నా… హౌజులో మిగిలిన 9 మంది స్థితీగతీ ఏమిటంటే..? కనిపిస్తున్న వోటింగు సరళిని బట్టి…
– మొదట్లో సుమన్ శెట్టి టాప్ త్రీలో ఉండేవాడు… ఒక దశలో తనూజకు మంచి పోటీ, ట్రోఫీ కొడతాడేమో అన్నంత సీన్ ఉండేది… ఇప్పుడు దారుణంగా వోటింగ్ పడిపోయింది… దిగువ నుంచి 2, 3 ప్లేసుల్లో ఉన్నాడు…
– దివ్య గురించి వదిలేయండి, పోయిన వారం తృటిలో ఎలిమినేషన్ తప్పించుకుంది… ఆమె మాట తీరు పెళుసు, దురుసు… బాడీ లాంగ్వేజీ కూడా… ఈసారి అందరికన్నా లీస్ట్ వోటింగ్, ఎలాగూ ఎలిమినేషన్ తప్పదు, ఆమెతోపాటు సంజన వెళ్తుందా, సుమన్ వెళ్తాడా చూడాలి…
– సంజన… అసలు ఇన్నిరోజులు ఉండటమే గొప్ప… లక్కీగా నెట్టుకొస్తోంది… లాస్ట్ వీక్ సెకండ్ వీక్ వోటింగ్… ఈసారి ఎలిమినేషన్‌కు సుమన్‌తో పోటీపడుతోంది…
– రీఎంట్రీ తరువాత భరణి మరీ డిఫెన్సివ్, సేఫ్ మోడ్‌లో ఉన్నాడు… బాండింగ్ బాధితుడు… మధ్యస్థ వోటింగ్ తనది… టాప్ ఫైవ్ ఆర్ టాప్ సిక్స్‌లో ఉంటాడో లేడో ఇప్పుడే చెప్పలేం…
– ఇమాన్యుయేల్ తన ఆటను తానే చెడగొట్టుకున్నాడు… మొదట్లో తనూజతో బలమైన పోటీ అనిపించుకున్నాడు… ట్రోఫీ తనదే అనే రేంజ్ ఉండేది… ఇప్పుడు మూడో ప్లేసు వోటింగులో… అదీ పడాల కల్యాణ్‌కు చాలా దూరంలోనే… కాకపోతే ఫినాలేలో గ్యారంటీ… బహుశా టాప్ త్రీ…
– రీతూ చౌదరి… గత సీజన్ విష్ణుప్రియలాగా… డెమోన్ పవన్‌తో లవ్ ట్రాకుతో… బిగ్‌బాస్ ఆశీస్సులతో బాగానే నెట్టుకొచ్చింది… ఫినాలేలో డెమోన్ ఉండకపోవచ్చు… కొన్ని ఏడుపులు, పెడబొబ్బల సీన్ల తరువాత రీతూను మాత్రం ఫినాలేకు ఉంచుతారేమో…
– హఠాత్తుగా పుంజుకున్న పడాల కల్యాణ్ మొన్నటి నామినేషన్ల ఎపిసోడ్‌లో ఓ ఉన్మాదిలా వ్యవహరించాడు… వోటింగు మీద దాని ప్రభావం కనిపించడం లేదు కానీ మైనస్ మాత్రం అవుతున్నాడు.,. కానీ స్టిల్ తనూజకు తనే బలమైన పోటీదారుగా కనిపిస్తున్నాడు…!!
Share this Article