కాపీరాయుడికి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారమా? కేంద్ర (అ)సాహిత్య అకాడమీ భావదారిద్ర్యం… సాహిత్యమా ఏదీ నీ దారి..? ఎటు నీ
( ఓ లుక్కేసుకోండి…)
….. శ్రీ శ్రీ !!
Ads
— తక్కెడ శిల.!!
చేయడానికి “..
— అఖిలాశ!! ( ఉరఫ్ తక్కెడ శిల జానిబాషా చరణ్ )
“సీడ్ బాల్.”కవిత … మెర్సీ మార్గరెట్
…………….18..5..2017.
ఇప్పుడు తక్కెడ వారి తవికను చదవండి!!
అదే.. అదే.. హమారా దేశ్ మహాన్ “..
చూశారుగా ఈ తవికలో ఎంత దేశభక్తిని నూరిపోశాడో! ఇందులో తక్కెడగారు అక్షరాలా పొలికేక కూడా వేశారు. బహుశా ఈ పాటికే ఈ పొలికేక మీ చెవుల్లో ఘూర్ణిల్లుతూ వుండాలి. ఇందులో తన గొంతుతో మన గొంతుల్ని కూడా కలిపి కేక వేయాలంటున్నాడు. ఎంత ప్రమాదభరిత ప్రపోజల్..? తస్మాత్ జాగ్రత్త !!—– ఎ.రజాహుస్సేన్.!!
Prasen Bellamkonda స్పష్టీకరణ ఏమిటంటే…
మృణాళిని గారు కన్వీనర్ గా మా టీం పనిచేయడం మార్చిలో మొదలైంది. ఈ యువ అవార్దు ఎంపిక ప్రక్రియ.. అంటే జ్యూరీ ఎంపిక, షార్ట్ లిస్టింగ్ వంటి కార్యక్రమాలు… అంతకు పది నెలల ముందే ప్రారంభం అయాయి, ముగిసాయి కూడా. అవార్డు ఎంపిక తేదీ నాటికి మృణాళిని గారు కన్వీనర్ కనుక జ్యూరీ సమావేశాన్ని ఫెసిలిటేట్ చేయడం అనే పనిని మాత్రం ఆవిడ పర్యవేక్షించారు. అంతకు ముందెప్పుడో జరిగిపోయిన జ్యూరీ ఎంపికలో కానీ జ్యూరీ నిర్ణయంలో కానీ మృణాళిని గారి ప్రమేయం రవ్వంత కూడా లేదు… ఉండదు. మిగిలిన ముగ్గురు జనరల్ కౌన్సిల్ సభ్యుల ప్రమేయం కూడా అసలే లేదు… ఉండదు. ఇక్కడ జ్యూరీ నిర్ణయమే ఫైనల్. కొన్ని అపార్ధాలను తుడిచెయ్యాలని ఈ వివరణ.
యువపురస్కార జ్యూరీ సభ్యులు ఆవుల మంజులత, వడ్డేపల్లి కృష్ణ,. దర్భశయనం శ్రీనివాసాచార్య ఈ ఎంపిక చేశారు. ఒక కవి కవిత్వాన్నో, విమర్శకుడి విమర్శనో ఫైనల్ చేసే సమయంలో ఎంతో ఎక్సర్ సైజ్ చేయాలి. ఆ కవి తాలూకు సాహిత్య కృషి పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలించాలి.. చర్చించాలి.. అతడు రాసిన ఇతర పుస్తకాల సమాచారాన్ని వడపోయాలి. అప్పుడు గాని పురస్కార అర్హతపై ఒక నిర్ణయానికి రావాలి.
కానీ. తక్కడశిల జానీ విషయంలో ఇవేం.. జరిగినట్టులేదు.. ఎందుకంటే అతడో కాపీ కవి అని, శ్రీశ్రీ మహాప్రస్థానాన్నే మక్కికి మక్కి దించి “విప్లవ సూర్యుడు” అనే పుస్తకాన్ని సైతం ముద్రించాడని సాహితీ లోకం మొత్తానికి తెలుసు.. చిన్నపిల్లాడ్ని అడిగినా ఈ సంగతి చెబుతారు.. అలాంటిది వెనుకా ముందూ చూడకుండా. ఏకపక్షంగా తక్కెడశిల జానీకి సంబంధించిన కవిత్వం, విమర్శ రెండు కేటగిరీల్లో కూడా పేరు ఫైనల్ చేశారు. కనీసం
ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా, నిస్సిగ్గుగా యువ పురస్కారానికి జానీ పేరును ఫైనల్ చేశారు. ఇది అత్యంత దురదృష్టకరం. ఈ శతాబ్దిలోనే సాహిత్య అకాడమీ చేసిన చారిత్రక తప్పిదం…
Share this Article