ఎంత గేమ్ ప్లాన్ ఉన్నా సరే… బిగ్‌బాస్‌లో సూత్రం ఏంటంటే..? ‘అతి’ చేయొద్దు… సరిగ్గా అక్కడే ప్రియ తప్పులో కాలేసింది… అందరినీ రెచ్చగొట్టింది… ఒక్కొక్కరినీ ఎక్స్‌పోజ్ చేస్తున్నాను అనుకుంది… కానీ ఎక్కడ తప్పు చేసిందీ అంటే..? ‘ఒర్లుతున్నావు’ అనే పదం దగ్గర తన తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకుంది… దాంతో ఒక్కసారిగా ఆమె మీద ఉన్న సదభిప్రాయం కాస్తా ఆవిరైపోయింది… అందుకే జనంలో వ్యతిరేకత పెరిగిపోయింది… వోట్లు తక్కువ పడ్డయ్… యానీ మాస్టర్ బయటికి వెళ్లాల్సింది కాస్తా ప్రియకు బిగ్‌బాస్ గేటు చూపించాల్సి వచ్చింది… అందుకే అనేది… ఎక్కడా అతి పనికిరాదు అని… మొన్నామధ్య మనం ఓ కథనంలో చెప్పుకున్నాం కదా… ఒర్లుతున్నావు అనే పదం మీద ప్రియ మాట్లాడుతూ, ఆ భాష నచ్చదు అంటూ వీజే సన్నీని బెదిరించిన తీరు ఆమెకు బాగా మైనస్ కాబోతున్నదని…. అవును, అదే జరిగింది…
నిజానికి ఆమె చాలా తెలివైంది… ఏజ్ బార్ యువతుల్ని బిగ్‌బాస్ మధ్యలోనే వదిలించుకుంటూ ఉంటుంది… వాళ్లు హౌజు గ్లామర్‌కు పనికిరారు, కనీసం నాలుగు స్టెప్పులు కూడా వేయలేరు, ఆ టీం ప్లాన్ చేసే స్క్రిప్టెడ్ లవ్ ట్రాకులకూ యూజ్‌లెస్… దానికితోడు ప్రస్తుతం హౌజులో యాక్టివ్‌గా ఉన్న సన్నీని టార్గెట్ చేసేసరికి ప్రియ మీద ఫుల్ వ్యతిరేకత పెరిగిపోయింది… ఆ ఒర్లుడు దగ్గర ఆగిపోలేదు ఆమె… అదేదో పిచ్చి టాస్కులో సన్నీని పట్టుకుని చెంప పగిలిపోద్ది అంటూ అనేకసార్లు బెదిరించిన తీరు ప్రియకు మరింత నెగెటివ్ అయిపోయింది… అసలు బిగ్‌బాస్ అంటేనే ఓ ఆట… అందులో సరదాగా ఉండాలి, పోటీ అయిపోయాక కలిసిపోవాలి… ఆఫ్టరాల్ ఎ గేమ్… కానీ ఆమె ఓవర్ చేసింది… దాంతో ఆమె చెంపే పగిలిపోయింది… హౌజు నుంచి బయటికి నెట్టేయబడింది…
Ads
ఆమె సినిమా నటి, ఆమె సీనియర్, ఆమె మెచ్యూర్డ్, ఆమె తెలివికలది, ఆమె అందమైనది, ఆమె యాక్టివ్…. కానీ ఇవి మాత్రమే సరిపోవు… బిగ్‌బాస్ ఆట తీరును పసిగట్టాలి, ఆ ఒడుపును ఒడిసిపట్టాలి… అక్కడ ఫెయిలైంది… మరీ ఒర్లడం, చెంపపగిలిపోద్ది కామెంట్లతో ప్రియ మీద ప్రేక్షకులకు ఉన్న కాస్తో కూస్తో పాజిటివిటీ కాస్తా ఆవిరైపోయింది… In biggboss every small issue counts… ప్రత్యేకించి ప్రజల నుంచి కనిపించే వ్యతిరేకత ఆ షో మీద పడకుండా చూసుకుంటుంది ఆ టీం… Because ఆ షోయే పెద్ద దందా… అలాంటప్పుడు ప్రియ అయితేనేం..? ఎవరైతేనేం..? తరిమేశారు… అదండీ సంగతి… లక్కీగా యానీ మాస్టర్ సేవ్ అయిపోయింది… పర్లేదు, ఆమె ఇంకా హౌజులో కొనసాగడానికి అర్హురాలే…!!
Share this Article