చాలామందికి ఉన్న doubt ఏంటంటే, సరైన weight తోనే Semi Finals గెలిచింది కదా, Silver ఎందుకు ఇవ్వరు? అని…..
United World Wrestling ప్రకారం, అలా ఇవ్వరు.
వినీష్ అప్పీల్ కూడా తన disqualification కి దారి తీసిన ‘పరిస్థితులకి’ సంబంధించినది. లేదా tournament లో తన overall performance ని చూసి consider చేయమని కూడా చెప్పి ఉండొచ్చు.
Ads
అంతేకానీ సెమి ఫైనల్స్ గెలిచినందుకు తనకి silver రావాలి అని కాదు.
——-
ఇది ఒకసారి చదవండి….. ఆ 50 kg womens wrestling లో మెడల్స్ సాధించిన వాళ్ళు…
Gold: Sarah Hildebrandt (USA)
Silver: Yusneylis Guzman Lopez (Cuba)
Bronze: Susaki Yui (Japan)
Bronze: Feng Ziqi (People’s Republic of China)…. దీన్ని repechage round అంటారు. knockout competition లో finalists తో పోటీపడి ఓడిపోయిన వారికి ఇచ్చే రెండవ అవకాశం. ఇది bronze medal కి మాత్రమే ఉంటుంది. wrestling / judo ఆటలకి మాత్రమే ఈ round ఉంటుంది.
———-
మనం న్యూస్ ఏం విన్నాం?
Vinesh, Paris 2024 ‘Olympics wrestling competition’ నుంచి disqualify అయ్యింది అని….
Final match కి మాత్రమే disqualify అయ్యింది అని కాదు..
——
దీనికి కారణాలు ఏంటంటే…. (UWW రూల్స్ ప్రకారం)
1) రెస్లింగ్ లో Preliminary rounds నుంచి final వరకు మొత్తం ‘8 రౌండ్స్’ ఉంటాయి.
ఈ 8 రౌండ్స్ అన్నీ కలిపి “One Tournament” “single event” గా consider చేస్తారు.
ఈ 8 వేరువేరు Individual matches కాదు. ఇవన్నీ interconnected.
So సెమీఫైనల్స్ అనేదాన్ని independent గా చూడరు. అది ఒక ‘ongoing tournament structure’ లో ఒక ముఖ్యమైన భాగం.
అదొక continuation మాత్రమే…
అందులో win అయితే, automatic గా silver ఇచ్చేయరు. silver వచ్చేస్తుంది / వచ్చేసింది అనకూడదు.
సెమిస్ గెలవడం వల్ల, silver విన్ అయ్యే probability చాలా ఎక్కువ ఉంటుంది అనేది మాత్రమే వాస్తవం.
ఎందుకంటే disqualification ల ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి.
—-
Javelin లో 2 rounds / Running లో 3 rounds మాత్రమే ఉంటాయి.
అథ్లెట్స్ అందరూ ఒకేసారి లేదా ఒకరితరువాత ఒకరు, ఒకే time period లో, ఒక round ని complete చేస్తారు. అది sequential గా లేదా straightforward manner లో జరుగుతుంది కాబట్టి అదంతా ఒక “single competition” లాగా evident గా కనిపిస్తుంది మనకి .
కానీ wrestling లో one-on-one matches జరుగుతాయి.
దానికో multi-stage format & structure ఉంటుంది. ఎవరు ఎవరితో ఏరోజు ఆడబోతున్నారు అనేది చూడటానికి కొంచెం complex ఉంటుంది.
ఈ competitions అన్నింటినీ accomodate చేయడానికి multiple days కావాలి.
ఈరోజు సెమిస్ – రేపు ఫైనల్స్ ఉంటుంది.
సో ఇలా each stage మీద separate గా మన focussed attention ఉండటం వల్ల.
మనలో semis అనేది ఒక ‘separate individual / independent match’ అనే “perception” తయారు అవుతుంది.
అందుకే ఒక broader tournament నుంచి సెమిస్ ని disconnect చేసేసి……silver మెడల్ రావాలి అని expect చేస్తూ ఉంటాం.
——-
2) Silver మెడల్ అనేది, final match ఆడి opponent చేతిలో ఓడిపోయాకే ఇస్తారు. గెలిస్తేనేమో gold.
final ఆడకుండా silver ఎట్టి పరిస్థితుల్లో రాదు.
——
3) Athletes ఈ “entire competition” లో (8 రౌండ్స్) వాళ్ళకి పెట్టిన weight limits ని ‘consistent’ గా meet అవుతూ ఉండాలి. అలా qualify అవుతూ చివర వరకూ ఉంటేనే, వాళ్ళు competition లో ఉంటారు, అందులో నలుగురికి ఎదో ఒక మెడల్ వస్తుంది.
(ఈ mandate, wrestling regulations ది).
ఏ stage లో అయినా ఒక్కసారి weight limit violation జరిగితే, entire event నుంచి disqualify చేస్తారు.
Vinesh ఇప్పుడు కేవలం final నుంచి diqualify అయ్యినట్టు కాదు, entire event నుంచి disqualify అయ్యినట్టు.
————
4) మెడల్ matches లో procedure ఏం ఉంటుందంటే…… ఒక wrestler disqualify అయితే, అప్పటివరకూ వాళ్ళ కింద ఉన్న highest-rank ఉన్న wrestler ని పైకి పంపిస్తారు…. వాళ్ళ spot ని fill చేయడానికి.
Semis లో Vinesh poghat చేతిలో ఓడిపోయిన Yusneylis Guzman Lopez, actual గా bronze match ఆడాలి.
కానీ poghat disqualify అయ్యింది కాబట్టి, Guzman Lopez తన spot ని తీసుకుని – ఇంకో semifinalist అయిన Sarah Hildebrandt తో ఫైనల్స్ ఆడింది.
ఆ ఫైనల్స్ ఆడి ఓడిపోయింది కాబట్టి తనకి silver ఇచ్చారు. Sarah గోల్డ్ తీసుకుంది.
——
అంతేకాని, semis వరకు వచ్చి disqualify అయ్యింది కాబట్టి vinesh కి silver ఇచ్చేసి, final ఆడకుండానే Sarah కి automatic గా gold ఇవ్వరు.
“ఈ ఆటలో చివరి వరకూ పోటీ జరగాలి.” ఇది uww నియమం.
ఎవరైనా disqualify అయితే medal placements ని adjust చేసేస్తారు.
actual competition నుంచి వచ్చిన results / performance ని base చేసుకుని మాత్రమే మెడల్స్ ఇవ్వాలి వాళ్ళు.
ఒకరి disqualification, ఒక tournament outcome ని & medal distribution ని ప్రభావితం చేస్తుంది.
కానీ ఒక disqualification వల్ల, ఆ tournament లో “పోటీని / fairness ని compromise అవ్వనివ్వరు.”
వాళ్ళకి ఒకరి individual కేసు కంటే ఆ tournament structure ఇంకా fairness ని మైంటైన్ చేయడమే top priority.
(అసలు Final మ్యాచ్ జరిగిన విషయం, Guzman Lopez తన స్థానం లో ఆడి silver గెలిచిన విషయం కూడా చాలా మందికి తెలియదు. silver రావాలి అనే దగ్గరే ఆగిపోయారు.)
5) vinesh final మ్యాచ్ కంటే ముందే, అంటే weigh-in లోనే disqualify అయ్యింది కాబట్టి, Guzman Lopez తన position ని తీసుకుంది.
కానీ disqualification లు final match మొదలు అయ్యాక – మధ్యలో – match అయిపోయిన వెంటనే కూడా జరుగుతాయి.
ఇలాంటి situation లోనే మాత్రమే opponent కి automatic గా gold ఇచ్చేస్తారు.
disqualify అయ్యినవారికి ఏ మెడల్ ఇవ్వరు.
silver మెడల్ అనేదే ఆ tournament లో cancel అయిపోతుంది.
6) disqualifications చాలా రకాలు ఉంటాయి.
illegal holds / techniques, ఉద్దేశపూర్వకంగా fouls చేయడం, physical / verbal abuse చేయడం, technical violations, medical issues, performance ని enhance చేసే డ్రగ్స్ వాడటం, refree instructions ని ignore చేసి ఆడటం etc.
ఏది జరిగినా tournament నుంచి తీసేస్తారు. మెడల్ ఇవ్వరు.
——-
అయితే అథ్లెట్స్ రకరకాలా scenarios లో Court of Arbitration for Sport (CAS) కి appeal చేసుకోవచ్చు. Diqualification unfair అనిపిస్తే / valid reasons ఉన్నట్టు అయితే….
reasons లో బలముంటే consider చేస్తారు CAS.
Olympic events చాలా tight షెడ్యూల్ ని demand చేస్తాయి. ఒకే రోజు multiple rounds ఆడాల్సి వస్తూ ఉంటుంది.
Another semifinalist, Sarah Hildebrandt ఒక రోజులో రెండు matches ఆడితే, vinesh మూడు ఆడాల్సి వచ్చింది. next డే morning ఏ weigh in ఉంది.
సో, తనకి కష్టం అయ్యింది.
ఒకే రోజు మూడు అయినా ఆడాలి అనేది UWW రూల్ కాదు. Olympic schedule, athletes నుంచి demand చేస్తూ ఉంటుంది ఇలాంటివి.
& అందరూ ఒకే time frame లో attend అయ్యి weigh – in లో పాల్గొనాలి అనేది మాత్రం UWW రూల్. వాళ్ళు fairness ని maintain చేయడానికి ఒకే టైం లో అందరికీ test చేస్తారు. ఈ weigh in కి చెప్పిన time కి హాజరు అవ్వకపోయినా disqualify అవుతారు.
అందుకే vinesh టైం అడిగినా ఇవ్వలేదు.
so, olympic tight షెడ్యూల్ ఇంకా uww రూల్, రెండూ కలిసి తన disqualification కి కారణం అయ్యాయి.
———-
Vinesh Phogat అప్పీల్ చేసింది. ఈరోజు రావాల్సిన Verdict రెండు రోజులు postpone చేసారు. ఈరోజు closing ceremony ఉండటం వల్ల అయ్యి ఉండొచ్చు. లేదా ఇవ్వము అనే నిర్ణయాన్ని ఒలింపిక్స్ మొత్తం ప్రశాంతంగా end అయిపోయాక మెల్లిగా చెప్పాలి అనుకుని ఉండొచ్చు….. (శరత్ కుమార్)
Share this Article