.
అనగనగా ఒక పేద విద్యార్ధి… అతను న్యాయవిద్య చదువుకోవడం కోసం, ఓ ప్రొఫెసర్ ను ఆశ్రయించాడు… ఫీజు ఏమిచ్చుకోగలవని అడిగాడు ప్రొఫెసర్… వీడి దగ్గర ఏముందనీ..? తెలివిగా… తన మొట్టమొదటి కేసు కనుక నెగ్గితే, దాంతో వచ్చిన డబ్బుతో ఫీజు ఇచ్చుకుంటాను అన్నాడు… అదీ ప్రొఫెసర్ తో డీల్… సరే, విద్యార్ధి తన చదువు పూర్తి చేసుకున్నాడు…
ఎన్నిసార్లు ఫీజు అడిగినా, తనకు ఒక్క కేసు కూడా తగల్లేదంటూ… ఎప్పటికీ తన బాకీ తీర్చకపోవడంతో, విసుగు చెందిన ప్రొఫెసర్ గారు కోర్టులో తన బాకీ వసూలు కోసం కేసు వేసాడు…
Ads
ఇద్దరూ లాయర్లే కదా… గురువు, శిష్యుడు… వాళ్ళ వాదనలు వాళ్ళే జడ్జి ముందు ఇలా వినిపించారు…
ప్రొఫెసర్
: నేను కనుక ఈ కేసు నెగ్గితే, లా ప్రకారం నా ఫీజు సొమ్ము నాకు చేరాలి… ఒకవేళ ఓడిపోతే, వాడు గెలిచాడు కాబట్టి, మా అగ్రిమెంట్ ప్రకారం, వాడు నా ఫీజు సొమ్ము చెల్లించాలి… ఎలా చూసినా నా సొమ్ము నాకు చేరాల్సిందే…
విద్యార్ధి
: నేను ఈ కేసు నెగ్గితే లా ప్రకారం నేను ఆయనకు ఏమీ ఇవ్వనక్కర్లేదు… ఎందుకంటే ఆయన కేసు కొట్టుకుపోయినట్టే కాబట్టి… ఒకవేళ నేను ఓడిపోతే, మా అగ్రిమెంట్ ప్రకారం, నేను ఆయనకు ఏమీ ఇవ్వనక్కర్లేదు… ఎందుకంటే తొలి ఫీజు ఇప్పటికీ రాలేదు కాబట్టి… ఎలా చూసినా నేను ఆయనకు ఏం ఇవ్వనవసరం లేదు…
ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో…
ఈ సంఘటన నిజంగానే జరిగింది… పురాతన గ్రీకు చరిత్రలో… ఇప్పటికీ పరిష్కారం దొరకని కేసుగా చరిత్రలో మిగిలింది… ఆ లా ప్రొఫెసర్ పేరు… ప్రోటగోరస్…
ఆ విద్యార్ధి పేరు..యూథోలస్… దీన్నే Protagoras paradox అంటారు… ఇలాంటివి ఏమైనా ఉన్నాయా…?
Share this Article