Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో… మీవల్ల కాదు !!

August 25, 2026 by M S R

.

అనగనగా ఒక పేద విద్యార్ధి… అతను న్యాయ విద్య చదువుకోవడం కోసం, ఓ ప్రొఫెసర్ ను ఆశ్రయించాడు… ఫీజు ఏం ఇచ్చుకోగలవని అడిగాడు ప్రొఫెసర్… వీడి దగ్గర ఏముందనీ..?

తెలివిగా… తన మొట్టమొదటి కేసు కనుక నెగ్గితే, దాంతో వచ్చిన డబ్బుతో ఫీజు ఇచ్చుకుంటాను అన్నాడు… అదీ ప్రొఫెసర్‌తో డీల్… సరే, విద్యార్ధి తన చదువు పూర్తి చేసుకున్నాడు…

Ads

ఎన్నిసార్లు ఫీజు అడిగినా, తనకు ఒక్క కేసు కూడా తగల్లేదంటూ… ఎప్పటికీ తన బాకీ తీర్చకపోవడంతో, విసుగు చెందిన ప్రొఫెసర్ గారు కోర్టులో తన బాకీ వసూలు కోసం కేసు వేసాడు…

ఇద్దరూ లాయర్లే కదా… గురువు, శిష్యుడు… వాళ్ళ వాదనలు వాళ్ళే జడ్జి ముందు ఇలా వినిపించారు…
ప్రొఫెసర్: నేను కనుక ఈ కేసు నెగ్గితే, లా ప్రకారం నా ఫీజు సొమ్ము నాకు చేరాలి… ఒకవేళ ఓడిపోతే, వాడు గెలిచాడు కాబట్టి, మా అగ్రిమెంట్ ప్రకారం, వాడు నా ఫీజు సొమ్ము చెల్లించాలి… ఎలా చూసినా నా సొమ్ము నాకు చేరాల్సిందే…

విద్యార్ధి: నేను ఈ కేసు నెగ్గితే లా ప్రకారం నేను ఆయనకు ఏమీ ఇవ్వనక్కర్లేదు… ఎందుకంటే ఆయన కేసు కొట్టుకుపోయినట్టే కాబట్టి… ఒకవేళ నేను ఓడిపోతే, మా అగ్రిమెంట్ ప్రకారం, నేను ఆయనకు ఏమీ ఇవ్వనక్కర్లేదు… ఎందుకంటే తొలి ఫీజు ఇప్పటికీ రాలేదు కాబట్టి… ఎలా చూసినా నేను ఆయనకు ఏం ఇవ్వనవసరం లేదు…

ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో…
ఈ సంఘటన నిజంగానే జరిగింది… పురాతన గ్రీకు చరిత్రలో… ఇప్పటికీ పరిష్కారం దొరకని కేసుగా చరిత్రలో మిగిలింది… ఆ లా ప్రొఫెసర్ పేరు… ప్రోటగోరస్…

ఆ విద్యార్ధి పేరు..యూథోలస్… దీన్నే Protagoras paradox అంటారు…

గతంలో భారతీయ విద్యావిధానంలో తర్కశాస్త్రం విధిగా బోధించబడేది… ఇలాంటి అనేక పాఠాలు విద్యార్థుల మెదళ్లకు పదును పెట్టేవి… ఇప్పుడు అన్నీ వదిలేశం కదా, తర్కం ఎక్కడిది..? అంతా సోషల్ మీడియా మార్క్ కుతర్కం తప్పితే !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇప్పుడు చెప్పండి… ఎవరు ఒప్పో… ఎవరు తప్పో… మీవల్ల కాదు !!
  • నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడం కాదు ! ఈ సుందరి ఏమన్నదో తెలుసా ?
  • ఏయ్, తప్పు..! సాదిక్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేయకూడదు !!
  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions