అమెరికాలో మన బతుకులపై విద్యావేత్త Amarnath Vasireddy వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… ‘‘అమెరికాలో తెలుగు వాళ్ల ప్రాక్సీ బతుకులు’’ అనే శీర్షికతో… నిజానికి దీన్ని రాసింది సూరపనేని హరగోపాల్… ఏదో సైటులో కూడా ఆయన పేరుతోనే కనిపించింది… కాకపోతే విషయ ప్రాధాన్యం, రచనా తీరును బట్టి చాలామంది షేర్ చేసుకుంటున్నారు… దాని సారాంశం ఏమిటంటే…
ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువంటే కష్టం, తక్కువ కాలేజీలు, కానీ ఇప్పుడు ప్రైమరీ స్కూళ్లలా బోలెడు… వీథికొకటి… నాలుగేళ్ల బీటెక్ పెద్ద ఇష్యూయే కాదు ఇప్పుడు… కాపీయింగ్ ఎట్సెట్రా…
ఎంసెట్ ర్యాంకుతో పనిలేదు, డబ్బు పడేస్తే చాలు, ఎక్కడో ఓ సీటు… బీటెక్ మమ అనిపించేసి, 2, 3 లక్షలు పారేస్తే జీఆర్ఈ, టోఫెల్ కూడా మన తరఫున ‘చక్కబెట్టడానికి’ ప్రాక్సీలు… వీటికి కూడా కన్సల్టెన్సీలు, కాకపోతే అన్ అఫిషియల్…
Ads
ఈ స్కోర్లతో అప్లయ్ చేసుకుంటే అమెరికా యూనివర్శిటీలు సీట్లు ఇచ్చేస్తున్నాయి… గతంలో కాన్సులేట్లలో నిశిత పరిశీలన ఉండేది, ఇప్పుడు ఎడాపెడా ఇచ్చేస్తున్నారు… అక్కడికి వెళ్లినా వాళ్ల తరఫున ప్రాజెక్టులు, పరీక్షలకు కూడా తెలుగు కన్సల్టెన్సీలు ప్రాక్సీలను అరేంజ్ చేస్తున్నయ్… ఎంఎస్ అయిపోతోంది…
అక్కడి వర్శిటీలకు కావల్సింది విద్యాదందా… అందుకే అవీ పట్టించుకోవు… వీళ్లేమో ఆడ్ జాబ్స్ చేసుకుంటూ, డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా బతికేస్తుంటారు… ప్రాక్సీ తోవలో వీళ్లను మందలుమందలుగా పట్టుకొచ్చిన బ్రోకర్లు హీరోలకు సపోర్టింగ్ నినాదాలకి, హాల్స్ వద్ద రభస చేయడానికి, కులం గుంపులు కట్టించడానికి వాడుతుంటారు…
ఈ ప్రాక్సీ దందాతో వచ్చే జీతాల్లో కొంత కేండిడేట్లకు, కొంత బినామీ వర్కర్లకు, మరికొంత బ్రోకర్లకు… ప్రాక్సీలుగా పనిచేసేది కూడా మనవాళ్లే… ఏకకాలంలో నాలుగైదు కొలువులు చేసేవారున్నారు… జస్ట్, డబ్బు కావాలి… అంతే… ఎబోవ్ యావరేజ్ పిల్లలు కూడా 3, 4 కొలువులు చేసేస్తున్నారు… కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రం హోం పద్ధతి బాగా చెలామణీలోకి వచ్చింది కదా, ఈ ప్రాక్సీ కొలువులు మరింత పెరిగిపోయాయి… ఈ దందాలో ఉన్న కన్సల్టెన్సీల్లో అధికశాతం మన తెలుగువాళ్లవే…
ఇదీ ఆ పోస్టు సారాంశం… నిజమే… అందరినీ నిందించలేం, అందరూ అలాంటివాళ్లే అని ముద్రలు వేయలేం… కానీ ఇప్పటిదాకా చెప్పుకున్న అవలక్షణాలు మాత్రం బాగా పెరిగిపోయాయి… ఇలాంటి కేరక్టర్ల వల్ల నిజాయితీపరులైన మనవాళ్లకు సరైన గుర్తింపు దక్కడం లేదు… వాడు మూణ్నాలుగు కొలువులు చేస్తున్నాడు, నువ్వూ చేయవచ్చుగా అని ఇండియా నుంచి ఒత్తిళ్లు… ఇదొక విషవలయం… అయితే దీనికి భిన్నమైన వాదనను కొందరు నెటిజన్లు వినిపిస్తున్నారు… వితండవాదమే అనిపించవచ్చుగాక, కానీ ఓ జస్టిఫికేషన్…
Share this Article