Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎహె పో… నేను అసలే ఆడను… అదసలు బౌలింగే కాదు…

April 11, 2026 by M S R

.

ఉస్మాన్ తారిఖ్… అత్యంత వివాదస్పద బౌలర్… ఈ పాకిస్థానీ బౌలర్ త్రో చేస్తున్నాడా..? బౌలింగ్ చేస్తున్నాడా..? ఎవరికీ అర్థం కాని స్టయిల్ గురించి బోలెడు వివాదాలు, విమర్శలు, వెక్కిరింపులు… కానీ ఐసీసీ మాత్రం అది లీగల్ బౌలింగే (అనుమతించదగిన) అని తేల్చిచెప్పింది, ఐనా సరే బ్యాటర్లు ఆ బౌలింగ్ తీరు పట్ల వ్యతిరేకతను వ్యక్తపరుస్తూనే ఉన్నారు…

(ఏమో, సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్ అతన్ని ఎందుకు అప్రోచ్ కాలేదో తెలియదు, అదే ఇంగ్లండ్ లీగ్ కోసమే లెండి… పాకిస్థానీ క్రికెటర్ల ప్రేమికురాలు కదా… డబ్బు తప్ప దేశం అనే సోయి ఏమాత్రం లేని కేరక్టర్ కదా…) సరే, విషయంలోకి వద్దాం… ఐపీఎల్‌ను చూసి, కాదు, ఐపీఎల్‌లోకి రానివ్వకపోవడంతో పాకిస్థాన్ తన సొంత సూపర్ లీగ్ (PSL) ప్రారంభించింది… ఇక ఈ ఏడాది సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి…

Ads

అదొక అత్యంత నాసిరకం… చివరకు గల్లీ క్రికెట్, పోరగాళ్ల క్రికెట్‌కన్నా హీనంగా సాగుతోంది అది… బాల్ ట్యాంపరింగ్, బాల్ గులాబీ రంగులోకి మారడం, అంపైర్ల నిర్ణయాలు ఇలా ఎక్కడ చూసిన వివాదాలే కనిపిస్తున్నాయి… తాజాగా మరో వివాదం చర్చనీయాంశమైంది…

క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది… క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది… తారిఖ్ బంతిని విసిరే ముందు ఆగి రావడంపై మిచెల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు… ఏకంగా రెండుసార్లు క్రీజులో నుంచి పక్కకు తప్పుకున్నాడు… ఇలాంటి బౌలింగ్‌లో తాను అడనని సంకేతాలు ఇచ్చాడు… బాల్ విసిరేటప్పుడు వింతగా ఆగుతూ బంతిని వేయడం వల్ల తన ఏకాగ్రత దెబ్బతింటోందని మిచెల్ చెప్పాడు…

ఈ ఆసక్తికర సన్నివేశం మ్యాచ్ 9వ ఓవర్లో చోటుచేసుకుంది… ఈ ఓవర్‌లో పదే పదే ఆడకుండా మిచెల్ పక్కకు తప్పుకోగా, అంపైర్లు జోక్యం చేసుకుని ఆటను కొనసాగించాల్సిందిగా సూచించారు… అయితే నాలుగో బంతికి ముందు కూడా అదే రిపీట్ కావడంతో అంపైర్లు మిచెల్‌తో చర్చలు జరిపారు…

ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశం తర్వాత ఏం జరిగిందంటే… అంపైర్లు జోక్యం చేసుకుని డారిల్ మిచెల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు… ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం “లీగల్” అని, అతను బంతిని విసిరే క్రమంలో కావాలనే బ్యాటర్‌ను మోసం చేయడానికి ఆగడం లేదని వారు వివరించారు…

అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మిచెల్‌కు మరింత నిరాశను మిగిల్చాయి…

  • అదే ఓవర్‌లో వికెట్…: అంపైర్లతో చర్చ ముగిసిన తర్వాత మిచెల్ బ్యాటింగ్ కొనసాగించాడు… కానీ, అదే 9వ ఓవర్ ఐదో బంతికి ఉస్మాన్ తారిఖ్ తన వింతైన యాక్షన్‌తో మిచెల్‌ను బోల్తా కొట్టించాడు… తారిఖ్ వేసిన క్యారమ్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన మిచెల్, ఎల్బీడబ్ల్యూ (LBW)గా వెనుదిరిగాడు…

  • రివ్యూ వైఫల్యం..: మిచెల్ రివ్యూ తీసుకున్నప్పటికీ, రీప్లేలో బంతి నేరుగా వికెట్లను తాకనున్నట్లు స్పష్టమైంది… దీనితో అతను పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది…

  • చర్చనీయాంశంగా యాక్షన్…: మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది… గతంలోనే తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేసిన దాఖలాలు ఉన్నాయి…

మొత్తానికి, డారిల్ మిచెల్ ఎంత అసహనం వ్యక్తం చేసినా, చివరికి ఆ వింత బౌలింగ్ యాక్షన్‌కే అతను చిక్కడం గమనార్హం… పీఎస్ఎల్ చరిత్రలో ఇదొక విచిత్రమైన వివాదంగా నిలిచిపోయింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…
  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • సుడిగాలి సుధీర్… తనను రేయ్, రా, థూ అనడం సమంజసమేనా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions