.
Psy Vishesh….. “చీరలోనే అందం ఉంది. సామాన్లు కనిపించే బట్టల్లో కాదు” అని గరుడపురాణం శివాజీ చేసిన వ్యాఖ్యలు కేవలం అతని అభిప్రాయం మాత్రమే కాదు.
ఇది శతాబ్దాలుగా స్త్రీ శరీరంపై నడుస్తున్న మానసిక నియంత్రణకు ఒక ఉదాహరణ.
ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లు అసలు ఏం చెబుతున్నారు?
👉 “నీ శరీరం నీది కాదు.”
👉 “నువ్వు ఎలా ఉండాలో నేను నిర్ణయిస్తాను.”
👉 “నాకు అసౌకర్యంగా ఉంటే, నువ్వు మారాలి.”
ఇది సంస్కృతి కాదు.
ఇది psychological domination.
Ads
—
Victim Blaming ఎలా నేర్పబడుతుంది?
• “అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంది కాబట్టే”
• “మంచి అమ్మాయిలు అలా ఉండరు”
• “బయటకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి”
చిన్నప్పటి నుంచి ఇలాంటి మాటలు విన్న పిల్లల మెదడులో ఒక equation తయారవుతుంది.
Woman’s safety = woman’s responsibility
ఇది అబ్బాయిలకు ఏం నేర్పుతుంది?
👉 నా చూపు తప్పు కాదు
👉 నా ఆలోచన తప్పు కాదు
👉 ఆమె provoke చేసింది
ఇదే emotional immaturity.
బాధ్యత తీసుకోలేని మెదడు.
—
Moral Policing అంటే ఏమిటి?
సైకాలజీలో దీనికో పేరు ఉంది…
Moralized Control.
మనకు లోపల అసౌకర్యంగా అనిపిస్తే
దాన్ని మనం ఇలా justify చేస్తాం:
• సంస్కృతి
• విలువలు
• సంప్రదాయం
• మర్యాద
ఇవి నిజంగా విలువలు అయితే
అవి స్త్రీలపై మాత్రమే ఎందుకు వర్తిస్తాయి?
అబ్బాయి షర్ట్ తీసేస్తే సంస్కృతి గుర్తుకు రాదు.
అమ్మాయి చేతులు కనిపిస్తే సంస్కృతి గుర్తొస్తుంది.
ఇది విలువ కాదు.
ఇది double standard psychology.
—
పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం?
మీ కొడుకు ఒక అమ్మాయిని చూసి
అసౌకర్యంగా ఫీలవుతుంటే
మీరు చెప్పాల్సింది…
❌ “అలాంటి బట్టలు వేసుకుంటే అలా ఉంటుంది” అని కాదు.
✅ “నీ చూపు నీ కంట్రోల్‌లో ఉండాలి.”
✅ “నీ ఆలోచన నీ బాధ్యత.”
✅ “ఎవరూ నీ అసౌకర్యానికి బాధ్యులు కాదు” అని చెప్పాలి.
ఇదే mental discipline.
ఇదే నిజమైన సంస్కారం.
—
సంస్కృతి అంటే ఏమిటి?
సంస్కృతి అంటే
బట్టల పొడవు కాదు.
సంస్కృతి అంటే — impulse control.
సంస్కృతి అంటే — boundaries గౌరవించడం.
సంస్కృతి అంటే — ‘నో’ అంటే వినగలగడం.
బట్టలు మార్చితే సమాజం బాగుపడదు.
మెదళ్లు మారితేనే సమాజం మారుతుంది.
—
చివరిగా చాలా స్పష్టంగా చెబుతాను
ఇది ఫెమినిజం కాదు.
ఇది మగ– ఆడ యుద్ధం కాదు.
ఇది psychological responsibility గురించిన విషయం.
ఎవరు ఏం వేసుకున్నా
నీ చూపు
నీ ఆలోచన
నీ ప్రవర్తన
నీ బాధ్యత.
దాన్ని మేనేజ్ చేయలేని మెదడు
సంస్కృతి గురించి మాట్లాడే అర్హత కోల్పోతుంది.
బట్టలు సమస్య కాదు.
బాధ్యత తీసుకోని మెదడే సమస్య…………. సైకాలజిస్ట్ విశేష్
Share this Article