ఏ టీవీ కార్యక్రమం చూసినా సరే…. యాంకర్ల మధ్య, యాంకర్లు-జడ్జిల మధ్య లవ్వు ట్రాకులు పెట్టేసి, నానా కథలు పడుతూ ఆపసోపాలు పడుతున్నయ్… మళ్లీ మళ్లీ ఎందుకు ఉదాహరణలు గానీ… సుధీర్- రష్మి దగ్గర నుంచి నిన్నామొన్నా రంగుపూసుకున్న కొత్త కమెడియన్ల దాకా… డాన్సర్లు, జడ్జిలు కూడా అతీతులు ఏమీ కాదు, అతీతంగా ఉండనివ్వరు షో నిర్వాహకులు, పత్తిత్తుల్లా ఉంటాము అంటే గేటు చూపిస్తారు… వీళ్లకు డబ్బు కావాలి, వాళ్లకు ఈ లవ్ ట్రాకులు కావాలి… అవే అలా ఉంటే, ఇక పక్కా స్క్రిప్టెడ్ దందాలాగా నడిచే బిగ్‌బాస్ ఎలా ఉంటుంది..? పక్కాగా లవ్ ట్రాకులు ఉంటయ్… ముందే చెబుతారు, మేం చెప్పినట్టు కథలు నడపాలి అని… అంటే టీవీ భాషలో పులిహోర కలపాలి అని…! గత సీజన్లో అయితే త్రికోణ ప్రేమల్ని కూడా చూశాం కదా… ఈసారి సింగర్ శ్రీరామచంద్ర దొరికినట్టున్నాడు బకరా… గానంలో తను గొప్పవాడు కావచ్చు, కానీ ఒక్కసారి బిగ్‌బాస్ హౌజులోకి వస్తే ఆ స్క్రిప్ట్ రాసినోడికి అలుసు… అంతే…
ఆల్రెడీ మెల్లిమెల్లిగా హమీదాకూ, శ్రీరాంచంద్రకూ నడుమ ఏదో కథ స్టార్ట్ చేసే ప్రయత్నం సాగుతోంది… ఆమె కూడా కాస్త యాక్టివ్… బిగ్‌బాస్ చెప్పినట్టు నటించగలదు, కథ రక్తికట్టించగలదు… పైన వీడియో చూశారు కదా… శ్రీరామచంద్రా… హమీదాతో ఆపుతారో లేక ఏ సిరి హన్మంతును కూడా జతచేస్తారో… అసలే ఈసారి శ్వేత, సరయు, లాహిరి ఎట్సెట్రా బోలెడు మంది… ఇటువైపు బాడీ బిల్డర్స్… ఎవరెవరికి ముడిపెడతారో చూద్దాం గానీ… ఒక్క విషయం చెప్పుకోవాలి… అప్పుడే ఏడ్పులు షురూ… ఆర్జే కాజల్ ఏదో ఇష్యూలో ఏడుస్తూ, నా బిడ్డ చూస్తే ఏడుస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది… ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… నిజానికి ఇప్పుడు హౌజులో ఉన్నవాళ్లలో సరదాగా అందరితో కలుస్తూ, చురుకుగా ఉన్నవాళ్లలో కాజల్ కూడా… మరి ఆమె ఎందుకు ట్రోల్ అవుతోంది…
Ads
https://www.youtube.com/watch?v=2PuuZ_9KHNg
ఆమె గతంలో బిగ్‌బాస్ శుద్ధ దండుగ అని కామెంట్లు చేసిందట తన రివ్యూల్లో… సో వాట్, చేయొచ్చుగాక… ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి హౌజుకు రావచ్చుగాక… అదేమీ తప్పు కాదు కదా… ఆమెకు డబ్బు కావాలి, పాపులారిటీ కావాలి, ఇదొక చాన్స్… జస్ట్, ఒక గేమ్… అంతే, అలాగే చూస్తుంది… అంతెందుకు కమెడియన్ లోబో కూడా గతంలో ఇలాగే కామెంట్ చేయలేదా..? వేరేవాళ్లు చేయలేదా..? బిగ్‌బాస్ వేస్ట్ అని కామెంట్ చేస్తే, ఇక హౌజులోకి రాకుండా అదేమైనా అనర్హతా..? కాదు కదా..! గత సీజన్ విజేత అభిజిత్ అభిమానులు కూడా కాజల్‌ను ట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… కానీ వాళ్లు నిజంగా కాజల్‌ను టార్గెట్ చేయాల్సిన పని లేదు… ఇవన్నీ బిగ్‌బాస్ స్క్రిప్టులో భాగంగా జరిగేవే… అంతెందుకు..? అభిజిత్‌కు దక్కాల్సిన డబ్బులో సొహైల్ తన ఫ్రెండ్ మెహబూబ్ సాయంతో సగం మేరకు చాకచక్యంగా సంపాదించిన తీరు గుర్తుంది కదా… నాగార్జున, చిరంజీవి, బిగ్‌బాస్ షో ప్లానర్స్ అందరూ మొహాలు తేలేశారు, చూశాం కదా…! సో, అంగీలు చింపుకోవడం వేస్ట్, జస్ట్, లైట్ తీసుకోవడమే… ఆమెను ఆమె ఆట ఆడనివ్వండి..!!
Share this Article