.
ఉమ్మడి ఏపీ రాజకీయాలు… ఎప్పుడూ వైఎస్‌ఆర్ కుప్పం జోలికి పోలేదు… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ఉండేవాళ్లు, అంతే… వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుప్పం మీద కాన్సంట్రేషన్ లేదు…
సేమ్… చంద్రబాబు కూడా ఎప్పుడూ పులివెందుల జోలికి పోలేదు… ఎవరో ఓ టీడీపీ అభ్యర్థి ఉండేవాడు… అంతే… ఇదేకదా… తెలుగు ప్రజానీకానికి తెలిసింది… అదేకాదు…
Ads
టీడీపీ అంటే కమ్మల పార్టీ అని… కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అని అనుకునేవాళ్లు తప్ప అది ఇప్పుడున్న రేంజులో కులసమరం కాదు… అంతేకాదు… చంద్రబాబు వ్యక్తిగతంగా ఏమైనా అడిగితే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ మరోమాట లేకుండా చేసేవాడు సాయం…
బాలకృష్ణ ఇంట్లో కాల్పులు కేసే మంచి ఉదాహరణ… రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండటం వేరు… ఆ ఘర్షణ వేరు… కానీ శతృత్వం స్థాయికి చేరకూడదు అంటారు పెద్దలు… పగలు, ప్రతీకారాలు కావు రాజకీయాలు…
కాలం మారింది… వైఎస్ ప్లేసులో జగన్ వచ్చాడు, నో హైకమాండ్… ఓన్లీ సింగిల్ కమాండ్… తను కొన్నేళ్ల క్రితం కుప్పం జోలికి వెళ్లాడు, గెలికాడు… వైనాట్ 175 అనే కార్యాచరణకు ముందే కుప్పంలో చంద్రబాబును ఓడించి, పంపించేయాలనీ ప్రయత్నాలు…
సభలో చంద్రబాబు మీద దుర్భాషలు, ఎగతాళి, అవమానాలు సరేసరి… ఇప్పుడు టీడీపీలోనూ చంద్రబాబుది కాదు… లోకేష్ జమానా వచ్చింది… తను పాత లోకేష్ కాదు… అన్నీ తానై నడిపిస్తున్నాడు… చాన్స్ పులివెందులలో వచ్చింది… జెడ్పీటీసీ ఎన్నిక…
నిజానికి మామూలు పరిస్థితుల్లో అదసలు ఓ ఎన్నికే కాదు… కానీ టీడీపీ ఓసారి పవర్ చూపించదలిచింది… వైఎస్ ప్లేసులోకి జగన్ వచ్చినట్టే… చంద్రబాబు ప్లేసులోకి లోకేష్ వస్తున్నాడు… అధికారంలో ఉన్నవాడు చేయదలుచుకుంటే ఏమేం చేయవచ్చో అన్నీ చేశారు…
ఏమైంది..? టీడీపీకి 90 శాతం వోట్లు, వైసీపీకి 10 శాతం వోట్లు… వైఎస్ కంచుకోటలో ఈ భారీ ఓటమి ఎలా సాధ్యమైంది..? టీడీపీ వాళ్లు కూడా నమ్మరు ఈ ఫలితాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్టు..! అదసలు ఓ ఎన్నికలాగా జరిగితే కదా… ఒక దశలో వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది… చివరకు పార్టీ అభ్యర్థి కూడా వోటేయ లేదని చదివాను…
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలయితే కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంటుంది, స్వతంత్ర పర్యవేక్షకులు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు… కానీ దీందేముంది..? స్టేటులో పవర్‌లో ఉన్నవాళ్లు కక్షగడితే ఓ స్థానిక ఎన్నిక ఎలా ఉంటుందో టీడీపీ రుచిచూపించింది సమాజానికి…
జగన్ కూడా ఊహించి ఉండడు… టీడీపీ క్యాంపు నుంచి మరీ ఈ రేంజ్ దాడి, దెబ్బ ఉంటుందని..! ఏపీలో ఇప్పటికే కులరాజకీయాలు మరీ విషమించాయి… పగలు, కక్షల రాజకీయాలు పంజా విసురుతున్నాయి… ఇంకా రాబోయే రోజుల్లో అక్కడ రాజకీయాలు ఇంకా ఏ స్థాయికి దిగజారిపోనున్నాయో..!!
ఈ ఎన్నికల చంద్రబాబు కూటమి పాలనకు జనామోదం ఏమీ కాదు… జగన్ పట్ల ఇంకా జనతిరస్కృతి కొనసాగుతుందనే సంకేతమూ కాదు… ఈ ఎన్నిక తీరు వేరు… అవునూ, పులివెందుల ఆడ పులి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్కడైనా కనిపించిందా మాస్టారూ..!?
Share this Article