Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తన మొదటి సినిమా క్వాలిటీపై కనీసం చిరంజీవి దృష్టిపెట్టాలి కదా…

December 1, 2024 by M S R

.

చిరంజీవి నటించిన మొదటి సినిమా . 1979 లో వచ్చిన ఈ పునాదిరాళ్ళు సినిమా చిరంజీవికి అద్భుతమైన పునాదిని వేసింది .

పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ ఆడియన్సుకు ఎలా ప్రెజెంట్ చేసారు అనేదాన్ని బట్టి ఉంటుంది .

Ads

ఆడియన్సుకు పట్టేలా ఈ సినిమాను ప్రెజెంట్ చేసారు . టైటిల్సులోనే నిర్మాతలు సినిమా ఉద్దేశం చెప్పేసారు . యువతే పునాదిరాళ్ళు అని . యాదృచ్చికంగా చిరంజీవి మొదటి మూడు సినిమాలు ఇలాంటి కధాంశంతోనే వచ్చాయి . మన ఊరి పాండవులు , ప్రాణం ఖరీదు కూడా ఈ కోవకు చెందినవే .

చిరంజీవి నలుగురు మిత్రులలో ఒకడిగా నటించినా తన ప్రతిభను చక్కగా ప్రదర్శించుకున్నాడు . ముఖ్యంగా ఏ పల్లె ఏ వాడ అనే పాటలో చీరె కట్టుకుని కులుకు డాన్స్ వేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు . సాఫ్ట్ విలనీలో గోకిన రామారావు గొప్ప నటనను ప్రదర్శించాడు . ఇలాంటి పాత్రలు అతనికీ కొట్టిన పిండే .

ఇతర పాత్రల్లో నరసింహరాజు , కె వి చలం , కవిత , రోజారమణి , మహానటి సావిత్రి , జయమాలిని నటించారు . ఈ సినిమాకు హీరో నరసింహరాజే . హీరోయిన్ రోజారమణే అని చెప్పాలి . బాలనటిగా కానివ్వండి యువతిగా కానివ్వండి ఈ సినిమా ఆమెకు వందో సినిమా అని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పారు .

ఈ సినిమాకు దర్శకుడు , మొదట సోలో నిర్మాత గూడపాటి రాజకుమార్ . మొదట బ్లాక్ & వైట్లో కొంత తీసిన తర్వాత కలర్లో తీయాలనే ఆలోచనతో ఫజలుల్లా హక్ అనే ఔత్సాహకుడిని కలుపుకున్నారు . నిర్మాతగా టైటిల్సులో ఈయన పేరే ఉంటుంది . ఆయనతో పాటు మరి కొందరు ఆయన స్నేహితులు భాగస్తులులాగా ఉన్నారు . చాలా ముస్లిం పేర్లు టైటిల్సులో పడతాయి . కధ , మాటలు ధర్మవిజయ పిక్చర్స్ అనే పేర్కొన్నారు .

ఈ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని ప్రేంజీ అందించారు . పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . బయట కూడా బాగానే పాపులర్ అయ్యాయి . చిరు చిరు నవ్వుల చిలకల్లారా అనే పాట పిల్లల మీద తీసింది చాలా బాగుంటుంది . అలాగే భారతదేశపు భావి పౌరులం అనే పాట నరసింహరాజు , చిరంజీవి , వారి మిత్రుల మీద ఉంటుంది . బాగా చిత్రీకరించారు కూడా .

కంచె చేను మేయునాడు కాచువాడు ఎవడురా అనే విషాదగీతం బాగుంటుంది . పాటల్ని జాలాది , గూడపాటి రాజకుమార్లే వ్రాసారు . పి యస్ నివాస్ ఫొటోగ్రాఫీ దర్శకుడు . ఈ సినిమాలో నటనకు గోకిన రామారావుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది . అలాగే సినిమాకు కూడా కాంస్య నంది వచ్చింది .

మొత్తం మీద చిరంజీవికి గట్టి పునాది వేసిన ఈ పునాదిరాళ్ళు సినిమా చూడవలసిన సినిమాయే . యూట్యూబులో ఉంది . వీడియో క్వాలిటీ బాగాలేదు . చిరంజీవి అభిమాన సంఘాలు తమ మెగాస్టార్ మొదటి సినిమా వీడియోని క్వాలిటీగా ఉండేదాన్ని యూట్యూబులోకి ఎక్కించుకోకపోతే ఎలా ! మీ తర్వాత తరం అభిమానులు చిరంజీవి మొదటి సినిమాను క్వాలిటీగా చూడాలి కదా అభిమానులూ ! ఆ పని మీద ఉండండి .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… — దోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ తప్పుడు కలెక్షన్ల ప్రకటనలతో ఇప్పుడు ఒరిగేదేమిటి సూర్యా..?!
  • ప్చ్, మన బ్రాహ్మి ఆగిపోయాడు… కానీ వడివేలు వదలడం లేదు…
  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions