పునీత్ రాజకుమార్… వయస్సు నలభై ఆరేళ్లే… కన్నడ ఆరాధ్యనటుడు రాజకుమార్ కొడుకు… వారసత్వంతో తెరమీదకు వచ్చినా తన సొంత మెరిట్‌తో నిలబడ్డాడు… మెప్పిచాడు… కన్నడ ప్రేక్షకులు ప్రేమగా అప్పు, పవర్ స్టార్ అని పిలుచుకునే ఈ పాపులర్ హీరో కన్నడంలో హైలీ పెయిడ్ స్టార్… గుండెపోటుతో మరణించడం కన్నడ చిత్రసీమను, కన్నడ ప్రేక్షకలోకాన్ని విషాదంలో ముంచెత్తింది… ఇతర హీరోల్లాగా ఇతర భాషల చిత్రాలపై గానీ, పాన్ ఇండియా తరహా బహుభాషా చిత్రాలపై గానీ ఆసక్తి చూపకుండా కేవలం కన్నడకే పరిమితం కావడం వల్ల మన కొత్తతరం, తెలుగు ప్రేక్షకులకు పునీత్ పెద్దగా తెలియకపోవచ్చు… కానీ సౌత్ ఇండియా సూపర్ స్టార్లలో తనూ ఒకడు…
నిజానికి తను జస్ట్, హీరో మాత్రమే కాదు… ప్లేబాక్ సింగర్, ప్రొడ్యూసర్, టీవీ ప్రజెంటర్… అన్నింటికీ మించి పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్… చిన్నప్పుడు బెట్టాడ హూవు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు… లక్షలాది మంది ఫ్యాన్స్… మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలోనే కన్నడంలో కన్నడాడ కోట్యాధిపతి ప్రోగ్రాంకు తనే హోస్ట్… ఫ్యామిలీ పవర్ అనే కలర్స్ ప్రోగ్రాంకు కూడా… ఉదయ్ టీవీ కోసం నేత్రావతి సీరియల్ కూడా తనే నిర్మిస్తున్నాడు… సొంతంగా పీఆర్కే ఆడియో సంస్థ ఉంది… అలాగే ప్రీమియర్ ఫట్సల్ టీంకు ఓనర్… (ఫట్సల్ కూడా ఓరకం సాకర్ ఆట)… ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు, కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (నందిని బ్రాండ్), ఎల్ఈడీ బల్బ్ ప్రాజెక్టు, సెవన్ అప్ (పెప్సీకో), మలబార్ గోల్డ్, F-Square, Dixcy Scot, జియాక్స్ మొబైల్, పొత్తి సిల్క్స్, ఫ్లిప్ కార్ట్, మణప్పురం… ఎన్నో ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ తను… సోదరులు శివ, రాఘవేంద్ర కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు… అప్పూ, బై బై… అప్పుడే వెళ్లిపోవాల్సిన కేరక్టర్ కాదు నీది… బ్యాడ్ లక్… బ్యాడ్ డెస్టినీ…
Ads
ఎందుకింతగా చెప్పుకోవడం అంటే… తను డౌన్ టు ఎర్త్… దాతృత్వంలోనూ స్టారే… 26 అనాథాశ్రమాలు, 45 స్కూల్స్‌కు ఫ్రీ ఫుడ్ ఫర్, 16 వృద్దాశ్రమాలు, 19 గోశాలలు, 38 గ్రామాల దత్తత… ఇవన్నీ పునీత్‌కు మరో ఉదాత్తమైన మొహం… ప్చ్, మంచోడు కదా, అందుకే త్వరగా వెళ్లిపోయాడు..! చివరగా… పునీత్ విధి గురించి చెప్పిన ఓ బిట్ చూడండి… కలుక్కుమంటుంది… అన్నమయ్య అన్నట్టు…
నానాటి బతుకు నాటకముకానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజమునట్టనడిమి పని నాటకముయెట్ట నెదుట గల దీ ప్రపంచముకట్ట గడపటిది కైవల్యము
Share this Article