Sai Vamshi …. … తెలుగువాళ్లం త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు గురించి మాట్లాడుకున్నంతగా కన్నడ వాగ్గేయకారులు పురందరదాసు గురించి ఎక్కువగా మాట్లాడుకోం! 1484లో పుట్టిన ఆయన 1564లో మరణించారు. 4.75 లక్షల కీర్తనలు రాసినట్టు ఉన్నా, ఇప్పుడు వెయ్యి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన కీర్తనలన్నీ అచ్చ కన్నడలోనే ఉండేందుకు ఆయన కృషి చేశారు. లోకంలోని ద్వేషం, క్రోధం, లోభం పోవాలంటే భక్తే సరైన మార్గం అని, దేవుడికి తనను తాను అర్పించుకున్నవాడు అన్నింటికీ అతీతుడవుతాడని ఆయన తన కీర్తనల ద్వారా ప్రచారం చేశారు. ఆ కాలంలోని కులవ్యవస్థను నిరసిస్తూ పాటలు రాసి, మనుషుల్లో ఈ ఎక్కువ తక్కువలేమిటి అని నిలదీశారు. అంటరానితనం సరైన విధానం కాదన్నారు. స్త్రీలకు ఆభరణాలు, అలంకారాల కన్నా జ్ఞానం, సహనం అసలైన అందాలని వర్ణించారు.
Share this Article