.
ఓ మిత్రుడి రివ్యూలో బాగనిపించింది… కల్కి+ కాంతార + కేజీఎఫ్ + బాహుబలి = పుష్ప2
సరే, వాటిని కాపీ కొట్టినట్టు కాదు గానీ… ప్రజెంట్ ట్రెండ్ మూవీస్ ప్రేరణతో స్క్రిప్టు రాసుకున్నాడు సుకుమారుడు అని అర్థం… తన ప్రజెంటేషన్‌లో కూడా అదే ధోరణి కనిపించిందని సారాంశం…
Ads
అందులో తప్పేముంది అంటారా..? మరీ కేజీఎఫ్2 తరహాలో పుష్ప2… పార్లమెంటుకు వెళ్లి కాల్పులు జరపడం ఓ ట్రెండ్… ఇదీ అంతే… సెల్ఫీతో ఇగో దెబ్బ తిని ఏకంగా సీఎంనే మార్చిపారేస్తాడు… అలవోకగా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కింగ్ అయిపోతాడు…
నో నో… పోలికలు దేనికి..? ఎవరి బ్రాండ్ వాళ్లదే… కేజీఎఫ్‌లో గంగమ్మ జాతర లేదు కదా… ఇందులో ఉంది కదా… అదే బోలెడంత వైవిధ్యం, తేడా…
మరొకాయన రాశాడు… పుష్ప మూవీకి Narcos అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కథను తీసుకోవటమే కాదు… అసలు అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర డిజైన్ వెనుక రెండు మన పాత సినిమాలు ఉన్నాయట…
ఒకటి విజయకాంత్ హీరోగా వచ్చిన కెప్టెన్ ప్రభాకర్.., రెండు శ్రీహరి హీరోగా వచ్చిన పృథ్వి నారాయణ… హీరోకు నెగెటివ్ షేడ్స్ చూపించడంలో సుకుమార్ ప్రసిద్ధుడు…
కెప్టెన్ ప్రభాకర్ మూవీ తీసుకొండి… అందులో మన్సూర్ ఆలీ ఖాన్ పాత్ర నడవడిక, ఆహార్యం పాత్ర తీరుతెన్నులు మొత్తంగా కాపీ చేసి పుష్పరాజ్ పాత్రగా మార్చినట్టున్నారు… చివరకు కెప్టెన్ ప్రభాకర్ మూవీలో సదరు మన్సూర్ అలీ ఖాన్ గన్ భుజం మీద పెట్టుకుని కాల్చిన విధానం కూడా వదలలేదు …
కెప్టెన్ ప్రభాకర్ లో విలన్ పాత్రను పుష్పలో హీరో పాత్రగా సుకుమార్ మలిచినట్టు కనిపిస్తూనే ఉంది… పృథ్వి నారాయణ మూవీలో శ్రీహరి డ్యూయల్ రోల్ వేశాడు… ఇందులో ఒక శ్రీహరి పాత్ర పుష్పలో అల్లు అర్జున్ మాదిరిగానే జబ్బా జారినట్టు గూని పెట్టి నటించాడు .. ఆ పాత్ర రఫ్‌నెస్ కూడా పుష్పలో అల్లు అర్జున్ పాత్రను పోలి ఉంటుంది …
ట్విట్టర్‌లో ఎవరో పోస్ట్ చేసిన ఈ వీడియోలో శ్రీహరి పాత్ర మేనరిజం చూడొచ్చు… ఈ పోస్టు వైరలే… https://x.com/phanikumar2809/status/1772302914104521049
కెప్టెన్ ప్రభాకర్ మాత్రమే మంచి హిట్ మూవీ… కానీ పృథ్వి నారాయణ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్… మరి ఈ పుష్పరాజ్… ఎక్కడికో వెళ్లిపోయాడు… వాడుకునే తీరును బట్టే ఫలితం… అదే ఆధునిక సినిమా నీతి… గమనించగలరు… అది రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు…!!
Share this Article