Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మికకు కత్తెర… పుష్ప సీక్వెల్‌‌ పాత్ర కుదింపు… స్క్రీన్ స్పేస్ తక్కువే…

February 12, 2023 by M S R

సొంత కన్నడ ఇండస్ట్రీ దాదాపు తనను వదిలేసినా, వ్యతిరేకత కనబరుస్తున్నా సరే… రష్మిక హేపీగానే ఉంది… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంచి ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు, పెద్ద బ్యానర్ల అవకాశాలు తలుపు తడుతున్నాయి… రెమ్యునరేషన్ భారీగా అందుతోంది… షేర్ చేసుకోవడానికి జాన్ దోస్త్ విజయ్ దేవరకొండ ఉండనే ఉన్నాడు…
హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను రిలీజ్ అయిపోగా, చేతిలో యానిమల్ ప్రాజెక్టు ఉంది… తెలుగులో పుష్ప-2 చేస్తోంది… ఈ పుష్ప దగ్గరే చిన్న చిక్కు… ఆమెకు పుష్ప టీం కత్తెర వేస్తోందని వార్తలు… పుష్ప సీక్వెల్‌లో ఆమె పాత్రను బాగా కుదించేస్తున్నారనీ, స్క్రీన్ స్పేస్ కూడా బాగా తగ్గిపోయిందనీ టాక్… దానికి ఆమె బాగా బాధపడుతోందట…
పుష్ప సీక్వెల్‌లో ఆమె పాత్రకు ప్రాధాన్యం తగ్గితే తగ్గుతుందేమో… ఎందుకంటే… కొత్త పాత్రలు వస్తాయి, ఫహాద్ ఫాజిల్ పాత్ర పెరుగుతుంది… దాంతో సహజంగానే రష్మిక పాత్ర కుదించుకుపోతుంది… కానీ ఆమె బాధపడుతుందా..? పడదు… ఆమె ఇలాంటివన్నీ లైట్ తీసుకుంటుంది… దానికి ఉదాహరణ… వారసుడు సినిమాలో ఆమె పాత్ర నామమాత్రం… ఇది ముందే తెలిసీ ఆమె ఆ సినిమా చేసింది… కారణం… విజయ్ వంటి పాపులర్ హీరో సినిమా ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇస్తే అది తనకు మరిన్ని మంచి అవకాశాలు తీసుకొస్తుందని…

RASHMIKA

ఆమెకు ఇలాంటి లెక్కలు బాగా తెలుసు… పుష్ప సినిమా ద్వారా ఆమె రేంజ్ పెరిగింది… పాన్ ఇండియా స్టార్ అయ్యింది… హిందీలో కూడా రెండు స్ట్రెయిట్ సినిమాలు చేయడం వల్ల హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం అయిపోయింది… యానిమల్ సినిమా కూడా ఆమె స్థానాన్ని హిందీలో ఇంకాస్త పెంచుతుంది… ఇప్పుడు ఆమెకు కావల్సింది ఈ అవసరాలే…

పుష్ప-్ర2 సినిమాలో ఆమె పాత్ర నామమాత్రంగా ఉన్నాసరే ఆమె బాధపడదు… తనను నేషనల్ క్రష్ చేసేసిన పుష్ప సినిమా మళ్లీ పాన్ ఇండియా రేంజులో విడుదల కాబోతోంది… సో, తనకు నేషనల్ ఇమేజీ పెరిగే కోణంలో ఇది ప్రిస్టేజియస్ ప్రాజెక్టు… అందుకని ఆమె ఏమీ పట్టించుకోదు… ఆమెకు అర్జెంటుగా మరో కొత్త సినిమా కావాలి… చేతిలో ప్రస్తుతం యానిమల్, పుష్ప సీక్వెల్ మాత్రమే ఉన్నాయి… అందుకని మరో పెద్ద బ్యానర్, వీలైతే హిందీ సినిమా కావాలని కోరుకుంటోంది…

Ads

పుష్ప సీక్వెల్‌లో రష్మిక పాత్ర చనిపోతుందని కూడా మొదట్లో పుకార్లు వ్యాపించాయి… అబ్బే, అదేమీ లేదు, రష్మిక పాత్ర పదిలమే అంటూ ఆ సినిమా టీం ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చింది… ఇప్పుడిక ఈ పాత్ర కుదింపు పేరిట కొత్త ప్రచారం స్టార్టయింది… వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు… ఇక త్వరలోనే చిత్ర బృందం బ్యాంకాక్ వెళ్లనుంది… అక్కడి అడవుల్లో బన్నీపై కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తారట… పనిలోపనిగా అక్కడే ఓ పాట కూడా షూట్ చేస్తారుట… సో, ఆమె లెక్కల్లో రష్మిక పాత్ర కుదించినా సరే, ఆమెకు పెద్ద షాక్ అనేదేమీ ఉండదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions