.
బహుశా ఎవడికీ సానుభూతి కూడా ఉండదేమో,., పుష్ప2 ప్రీమియర్ షాలు పలుచోట్ల రద్దవుతున్నాయనే వార్తలతో…
సినిమా తీసినవాడికే నమ్మకం లేదు, నటించినవాడికీ నమ్మకం లేదు… రీషూట్లు… మ్యూజిక్ వాడిని మార్చేశారు… సుదీర్ఘ జాప్యం… ఎన్నో ఎన్నో మైనస్ పాయింట్లు…
Ads
పాటలకు హైప్ రాలేదు… చివరకు శ్రీలీల ఐటమ్ డాన్సు మీద ఆశలు… తీరా చూస్తే ఆ పాట కూడా మైనస్… కానీ ఫ్యాన్స్ పిచ్చి మీద నమ్మకం… పిచ్చి ప్రేక్షకుల మీద నమ్మకం… ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేశారు…
దిక్కుమాలిన రెండు తెలుగు ప్రభుత్వాలు మతిమాలిన నిర్ణయాలు తీసుకుని, గతంలో ఎన్నడూ లేని రేట్లు ఫిక్స్ చేశాయి… సిగ్గూశరం, సోయి ఉండవు కదా ప్రస్తుత ప్రభుత్వాలకు… రేవంత్, చంద్రబాబు ఏమీ మినహాయింపు కాదు కదా…
కానీ ఏమైంది..? చల్లారింది హైప్… ఏమిటింత అరాచకం అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో బలంగా ఏర్పడింది… తన స్వార్థం… 300 కోట్లా, 200 కోట్లా పక్కన పెడితే… ఈ రేట్ల పెంపు ఇండస్ట్రీ అభివృద్ధికి బాట అని సోకాల్డ్ పుష్పరాజ్ ట్వీట్లు…
ఆ స్మగ్లర్ కథను కనులారా వీక్షించి తరించాలట ప్రేక్షకులు… కానీ చివరకు ఏమైంది..? పైన చూశారుగా ఓ ట్వీట్… అదీ దురవస్థ… వోకే, థియేటర్లలో దుమ్ము రేపుతుందా..? దుమ్ముకొట్టుకుపోతుందా చూద్దాం… కానీ జరుగుతున్న పరిణామాలు ఏవీ సినిమా ఇండస్ట్రీకి మంచివి కావు…
రాను రాను ఇంకెవరూ థియేటర్ మొహం చూడడు… బంగారు గుడ్ల బాతును కోసుకుతింటున్నారు నిర్మాతలు, హీరోలు… పలుచోట్ల, పలు థియేటర్లలో ప్రీమియర్లు రద్దు కావడం అనేది మామూలు విషయం కాదు… పుష్ప2 మీద జనంలో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత…
పైకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప2 మేనియా ఉన్నట్టు కనిపిస్తుంది… కానీ రియాలిటీ ఇది… పోతేపోనీ, బన్నీ క్రేజు ఇప్పట్లో చల్లారదు… మరీ ఘోరం ఏమిటంటే..? రాజకీయరంగు పులుముకోవడం… ఎవరో జనసేన లీడరట… పుష్ప సినిమాను నడవనివ్వబోం అని ప్రకటన…
(ఇది బెంగళూరులో ఒకచోట … ఇద్దరికి 5200… ఇంత అరాచకం మునుపెన్నడూ లేదు… జనం ఇంకా థియేటర్స్ కు దూరమయ్యే దుస్థితి…)
థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షేర్ మీద పంచాయితీలు ఉన్నాయి… To be in simple words… Totally meesed up….
పవన్ కల్యాణ్ స్పందించాలి… రేప్పొద్దున నీ సినిమాలకూ వైసీపీ ఇలాగే స్పందించాలా..? వోకేానా..? ఇదేనా ఏపీ సినిమా పాలసీ… సీజ్ ది షిప్ అన్నట్టుగా… సీజ్ ఆల్ పుష్ప థియేటర్స్ అన్నట్టుగా వాతావరణం ఏర్పడాలా..?
ఈ సిట్యుయేషన్ మునుపెన్నడూ లేదు… ఇది ఇండస్ట్రీకి మంచిది కాదు… ఇంకా ఎటు తీసుకుపోతున్నారో టాలీవుడ్‌ను..!! అటూ ఇటూ, రెండు వైపులా వేర్వేరు కారణాలు ఉండవచ్చుగాక… ఎవరి తీరూ బాగాలేదు… వాడ్డూయూసే డిప్యూటీ సీఎం… నాట్ నాగబాబూ… నువ్వు సమాధానం చెప్పాలి..!!
పుష్ప సీక్వెల్ మీద సినిమా మీద ప్రేక్షక తిరస్కరణ అనేది…. సుకుమార్, బన్నీ, రష్మిక, డీఎస్పీలకు చెంపపెట్టు కాదు… రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు..!!
Sorry బన్నీ… ఎదిగే క్రమం , తీరు ఇది కాదు… పుష్పరాజ్ తరహాలోనే గాంబ్లింగ్ సరికాదు… వీటికి అతీతంగా నిలబడాలి నువ్వు… !!
Share this Article