.
నిజమే… గ్రేటే… అసలు టీవీల ఎదుట ప్రేక్షకులు ఓపికగా కూర్చుని సినిమాల్ని చూడటమే తగ్గిపోయిన ఈ రోజుల్లో… పెద్ద పెద్ద తోపు హీరోల సినిమాలు సైతం బుల్లి తెర మీద ఢమాల్ అంటుంటే… సినిమాల టీవీ రైట్స్ నానాటికీ పడిపోతున్న నేపథ్యంలో…
పుష్ప-2 సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటోంది… దాని థియేటర్ వసూళ్లు తోటి హీరోలందరూ కుళ్లుకునే రేంజులో ఎక్కడికో వెళ్లిపోగా… టీవీ రేటింగ్స్ కూడా సూపర్ అనిపించుకుంటున్నాయి… సుడి… సంధ్య థియేటర్ దుర్ఘటన, అరెస్టు, ఇండస్ట్రీ మొత్తం తన ఇంటికి ఓదార్పు యాత్రం చేయడం మినహా…
Ads
ఈ టేబుల్ చూశారు కదా… మొదట ప్రసారంవేళ 12.73 రేటింగ్… తరువాత ఐదు వారాలకు మళ్లీ ప్రసారం… ఈసారి 6.81 రేటింగ్… మరో ఐదు వారాలకు మళ్లీ ప్రసారం… ఈసారి మరింత రేటింగ్ పెరిగి 10.57… దుమ్ము రేపింది… ఈలెక్కన మరో ఐదు వారాలకు మళ్లీ ప్రసారం చేస్తుంది స్టార్ మాటీవీ… (HYD 15 + )…
మరి ఈ లెక్కన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రికార్డే కదా అంటారా..? అదయితే ఫస్ట్ ప్రసారం సమయంలో ఏకంగా 15.13 రేటింగ్స్ సాధించింది… ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ రానంత రేటింగ్… ఆరు వారాలకు మళ్లీ ప్రసారం చేస్తే ఈసారి 6.53 రేటింగ్… కాకపోతే ఓటీటీ, టీవీల్లో ఒకేసారి వచ్చేయడం ప్లస్ ఫ్యామిలీ, ఫన్ సినిమా కావడంతో ఈ రేటింగ్ సాధ్యమైందని ఓ విశ్లేషణ…
అన్నట్టు… వెంకటేశ్, సౌందర్య పాత సినిమా రాజా… దీని రికార్డు ఏ సినిమాకూ చేతకాదు, ఎప్పుడు ప్రసారం చేసినా సరే ఓ పెద్ద కొత్త సీరియల్ రేంజులో రేటింగ్స్ వస్తూనే ఉంటాయి… అదేమిటో…
పైన చార్టు ఫిక్షన్ కేటగిరీలో కొన్ని టీవీ ప్రోగ్రాముల రేటింగ్స్… ఎప్పటిలాగే స్టార్ మా సీరియళ్లు టాప్… కార్తీకదీపాన్ని మించి గుండె నిండా గుడిగంటలు… దీటుగా ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్లస్ ఇంటింటి రామాయణం… జీతెలుగు సీరియళ్ల కూడా మంచి రేటింగ్స్ సంపాదిస్తున్నాయి.,.జగద్ధాత్రి, మేఘసందేశం, చామంతి సీరియళ్లు పోటీపడుతున్నాయి ఆ చానెల్‌లో…
ఇదేమో నాన్- ఫిక్షన్ కేటగిరీ… నిజానికి టీవీల్లో వంటల ప్రోగ్రాములు ఎప్పుడూ అట్టర్ ఫ్లాప్… ఆమధ్య యాంకర్ సుమ చేసిన ఇలాంటి ఫన్ బేస్డ్ వంటల షో కూడా పెద్దగా ఆదరణ పొందలేదు… కానీ స్టార్ మాటీవీలో కుకూ విత్ జాతిరత్నాలు మాత్రం హిట్… ఇదీ వంటలకన్నా ఫన్ ఓరియెంటెడ్ సరదా ప్రోగ్రామే… యాంకర్ ప్రదీప్ హోస్ట్, వెటరన్ హీరోయిన్ రాధ, చెఫ్ సంజయ్ తుమ్మ, నటుడు ఆశిష్ విద్యార్థి ఈ షోకి జడ్డీలు… (తమిళంలో కుకూ విత్ కోమలిని పేరిట ఓ ప్రోగ్రాం వస్తుంది, ఇదీ అదే టైపు)…
దర్శకుడు అనిల్ రావిపూడి, నటి కమ్ నాయకురాలు రోజా, సుడిగాలి సుధీర్ కనిపించే డ్రామా జూనియర్స్ జీతెలుగులో హిట్… ఈటీవీకి సంబంధించి శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త బెటర్ టీఆర్పీలు కాగా… పాడుతా తీయగా షోకు కీరవాణిని తెచ్చుకున్నా సరే రేటింగ్స్ అంతంతమాత్రమే… మరీ ఒకటిన్నరలోపే… ( - ఇన్‌పుట్స్ :: గోపు విజయకుమార్ రెడ్డి)
Share this Article