Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరు భాషల్లోనూ ఆ పాటను ఆ ఒక్కతే అదరగొట్టేసింది… కానీ..?

December 9, 2024 by M S R

.

పుష్ప సీక్వెల్ సంగీతం… ఈ పాటలు, ఈ బీజీఎం గొడవలు, సంగీత దర్శకుల మార్పుల గురించి చాలా చదువుకున్నాం కదా…

పాటలకు సంబంధించి ఒకటి విశేషంగా అనిపించింది… సూసేకి పాట హిట్టే కదా… అది పాడింది శ్రేయో ఘోషాల్… ఆరు భాషల్లోనూ ఆమే పాడటం విశేషం… (తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ)…

Ads

shreya

ఆమె సింగింగ్ కెపాసిటీ అమోఘం, అందరికీ తెలిసిందే… కానీ సాధన చేసి, ఒకే పాటను ఆరు భాషల్లో ఆ ఒడుపును పట్టుకుని ఆలపించడం ఆసక్తికరమైన సమాచారమే…

ఒక్కసారి పుష్ప ఫస్ట్ పార్ట్‌కు వెళ్దాం… ఊ అంటావా మామా పాట సూపర్ హిట్… మంగ్లి చెల్లెలు ఇంద్రావతి బాగా పాడింది… ఆమె పాడిన తీరే ఆ పాటకు ప్రధాన ఆకర్షణ… అదే పాటను కన్నడంలో మంగ్లి పాడింది… కానీ తమిళంలో ఆండ్రియాతో, మలయాళంలో రెమ్య నంబీశన్‌తో, హిందీలో కనికా కపూర్‌తో పాడించాడు దేవిశ్రీ ప్రసాద్…

dsp

శ్రీవల్లి పాటను నాలుగు సౌత్ భాషల్లో సిద్ శ్రీరాంతో పాడించినా హిందీలో వేరే గాయకుడితో పాడించాడు… కానీ మిగతా పాటల్లో భాషలవారీగా ఆయా భాషల్లో ప్రసిద్దులతో పాడించి గాత్ర వైవిధ్యాన్ని చూపించాడు డీఎస్పీ… కానీ పుష్ప సీక్వెల్‌కు వచ్చేసరికి…

dsp

సూసేకి పాటను ఐదు భాషల్లోనూ శ్రేయాతో పాడించగా… పుష్ప పుష్ప అనే టైటిల్ సాంగ్ మాత్రం హిందీ, తమిళం, తెలుగులో నకాశ్ అజీజ్‌తో పాడించి, కన్నడ, మలయాళం భాషల్లో మాత్రమే వేరే సింగర్స్‌తో పాడించాడు…

pushpa2

శ్రీలీల డాన్సిన కిస్సిక్ పాట బాగా హిట్టవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు గానీ… ఊ అంటావా పాటతో పోలిస్తే బాగా డల్… సూసేకి పాటను ఆరు భాషల్లోనూ శ్రేయాతో పాడించి, ఈ పాటను మాత్రం శుభలక్షిణిని ఎంచుకున్నాడు డీఎస్పీ… తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆమే పాడగా, మలయాళం, బెంగాలీ భాషల్లో మాత్రం స్థానిక సింగర్స్‌ను తీసుకున్నాడు…

rashmika

అసలు ఊ అంటావా పాటను అంత రక్తికట్టించారు కదా మన మంగ్లి, మన ఇంద్రావతి… మరి పుష్ప సీక్వెల్‌లో ఒక్క పాటకూ వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం ఏమిటో అర్థం కాలేదు… ఐటమ్ సాంగ్ కిస్సిక్ పాడే చాన్స్ తెలుగులోనైనా ఇంద్రావతికి ఇచ్చి ఉండాల్సిందేమో… శుభలక్షిణి పాట పర్లేదు గానీ ఇంద్రావతి గొంతులో ధ్వనించే ఓరకమైన మత్తు ఆమ గొంతులో మిస్సయినట్టు అనిపించింది..!!

pushpa2

కనీసం తెలుగు పాటలకైనా మొత్తం తెలుగు గాయకులు దొరకలేదా డీఎస్పీ…? ఒక్క పీలింగ్స్ పాటకు మాత్రం శంకర్ బాబు, దాస లక్ష్మిలకు మాత్రమే అవకాశం ఇచ్చి, మిగతావన్నీ పరభాషా గాయకులతో పాడించావు… తెలుగులో ఎందరు మంచి సింగర్స్ లేరు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!
  • నరాల్ని సుతారంగా గిచ్చే పాటగత్తె… సరిజోడుగా ఆయన అల్లరల్లరి….
  • అసలే సుగర్… మామిడి పండు చూస్తే టెంప్టింగ్… మరెలా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions