.
Mani Bhushan …. అంతే, అంతే! Just names are changed, మిగతాదంతా same to same.
అనుమానం అక్కర్లేదు, పాతిక– ముప్పయి ఏళ్ల క్రితం ఓ ఇద్దరు మంత్రుల సమావేశం ఇలాగే జరిగేది.
Ads
- “The talks were conducted in the positive and constructive manner that has characterized their continuing dialogue.
Indian Foreign Minister Jaswanth Singh and US Deputy Secretary of State Strobe Talbott agreed on the need to intensify and broaden discussions and looked forward to further meetings”.
పైన పేర్కొన్న లైన్లలో సింగ్– తాల్బోట్ పేర్లు తీసేసి… పుతిన్– ట్రంప్ పేర్లు పెట్టుకోండి, చాలు. మిగతాదంతా సేమ్ టు సేమ్…
––
నిన్న రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ Anchorage (అలాస్కా)లోని సైనిక స్థావరం ఎయిర్ బేస్‌లో షేక్ హేండ్ ఇచ్చుకున్న సన్నివేశం చూడగానే… నాకు జశ్వంత్– తాల్బోట్ చర్చలు గుర్తొచ్చాయి.
1998లో పోక్రాన్ అణు పరీక్షల అనంతరం… ఇండో– అమెరికన్ ద్వైపాక్షిక సంబంధాలు, అణు నిరాయుధీకరణ వంటి అనేక అంశాలపై వత్తిడి పెరిగింది. వాటన్నింటినీ సర్దుబాటు చేసుకోవడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రి జశ్వంత్ సింగ్, అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి స్త్రోబ్ తాల్బోట్ చర్చలు జరిపారు.
ఎన్నిసార్లు అనుకున్నారు..? 11 విడతలు..! వాషింగ్టన్, ఢిల్లీ, లండన్ సహా అనేక దేశాల్లోని ప్రముఖ నగరాల్లో, ఒకటి రెండు వేసవి విడిది కేంద్రాల్లో కలిపి మొత్తంగా 1998 నుంచి 2000 నడుమ 11 దఫాలు చర్చించారు. ప్రతిసారి ఒకటే outcome.
- ‘‘జశ్వంత్–తాల్బోట్ మధ్య చర్చలు చాలా సుహృద్భావంగా జరిగాయి. తదుపరి విడత చర్చలకు మార్గం సుగమం అయింది. To that end, the two sides agreed to intensify their contacts at all levels in the months ahead’’…
ఈ వార్తల్ని నేను, Suresh Koheda ఎక్కువగా రాసేవాళ్లం. రెండు మూడు విడతల చర్చలు జరిగాక నవ్వలేక చచ్చేవాళ్లం.
మాలాగే కొందరు వెస్ట్రన్ జర్నలిస్టులకు సందేహమొచ్చి, వీళ్లు లోపాయికారిగా (of the record) ఏం మాటాడుకుంటారా అని కూపీ లాగారు. జశ్వంత్ సింగ్– తాల్బోట్ ఇద్దరికీ గుర్రాలంటే ఆసక్తి, రుచులు అంటే ఇష్టం అని తేలింది. గుర్రాలపై వెయ్యడానికి ఎక్కడెక్కడ మంచి Saddles (జీన్స్ వగైరా) దొరుకుతాయని, మంచి Continental cuisine ఎక్కడ దొరుకుతుంది అని చర్చించుకునేవారట!
..
దాదాపు 30 ఏళ్ల తర్వాత మొదలైన పుతిన్– ట్రంప్ చర్చలు కూడా ఇలాగే వేర్వేరు వేదికలపై అనేకమార్లు జరుగుతాయి. ప్రతిసారి ‘Great progress made, but we didn’t get there. No deal until there’s a deal’ అని చెప్పి వెళ్లిపోతుంటారు..! శుభం..!!
.
Share this Article