పార్ధసారధి పోట్లూరి ….. యూదులు రష్యాలో మాత్రమే సురక్షితంగా ఉండగలరు…. పుతిన్ తాజా వ్యాఖ్య… సగటు భారతీయ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతూ, ఎలా ప్రవర్తిస్తారో అచ్చంగా అలానే ప్రవర్తిస్తున్నాడు పుతిన్!
వివరాలలోకి వెళ్లేముందు… ఒక ముఖ్యమైన విషయం ప్రస్తావిస్తాను… మాస్కోలో నివాసం ఉండే యూదుల మత పెద్ద (Cheif Rabbi) పించాస్ గోల్డ్స్మిత్ (Pinchas Goldschmidt) పుతిన్ స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టగానే రష్యాని వదిలి వెళ్ళిపోయాడు 2022 డిసెంబర్ లో !
అక్టోబర్ 25. పుతిన్ రష్యా లోని అన్ని మతాలకు చెందిన పెద్దలని పిలిచి వారితో సమావేశం అయ్యాడు. ఊరికె పిచ్చాపాటి కబుర్లు తప్పితే పుతిన్ వాళ్ళతో మాట్లాడడానికి ఏముంటుంది? గొప్ప చెప్పుకోవడానికి .. చూసారా? రష్యాలో క్రైస్తవులు, ముస్లింలు, యూదులు, బౌద్ధులు అందరూ కలిసిమెలిసి ఉంటారు అని.
Ads
అమెరికాతో పాటు యూరోపు, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో హమాస్ కి సానుభూతిగా జరుగుతున్న ప్రదర్శనలని చూపిస్తూ చేసిన డ్రామా అది!
సమావేశం చివరలో రష్యాలో యూదుల మత గురువు బెరెల్ లాజర్ (Berel Lazer) చేత ఒక ప్రకటన చేయించాడు పుతిన్: దాని సారాంశం ఏమిటంటే ‘‘రష్యాలో అన్ని మతాలు సమానంగా చూడబడుతున్నాయి. యూదులకి రష్యా సురక్షిత ప్రదేశం!’’ ఫోటో, వీడియోని విడుదల చేసింది క్రెమ్లిన్!
పుతిన్ మరో ప్రకటన చేశాడు: రుస్సో ఫోబియా, ఇస్లామో ఫోబియా, యాంటీ సెమిటీజమ్ లాంటి వాటికి రష్యాలో చోటు లేదు, ఇవన్నీ పశ్చిమ దేశాలలో మాత్రమే ఉంటాయి… అని! తరువాతి రోజు అంటే అక్టోబర్ 26 న పుతిన్ హమాస్ పొలిట్ బ్యూరో సభ్యులతో ఒకసారి, ఇరాన్ ప్రతినిధులతో ఒకసారి, అందరితో కలిసి మరోసారి సమావేశమయ్యాడు! దాని ఫలితమే అమెరికా, యూరోప్, భారత్ లలో ముస్లింలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు, కేరళ చర్చిలో బాంబ్ బ్లాస్ట్ !
పుతిన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు హమాస్ వెనుక ఉన్నది నేనే అని. నిన్న అనగా అక్టోబర్ 28 న ఏం జరిగింది? పుతిన్ చెప్తున్నది ఒకటి – చేస్తున్నది ఇంకొకటి! రష్యాలో రెండు అటానమస్ రిపబ్లిక్కులు ఉన్నాయి. దగేస్తాన్ లోని కరచాయ్-చేర్క్కేసియా (Karachay- Cherkessia). ఇవి రెండు కూడా రష్యన్ ఫెడరేషన్ లో భాగంగా ఉంటూ అటానామస్ స్టాటస్ కలిగి ఉన్నాయి. మొన్న సాయంత్రం చీకటి పడగానే Khasavyurt అనే పట్టణంలో స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి యాంటీ సేమేటిక్ (యూదు వ్యతిరేక) నినాదాలు చేశారు.
ఫ్లెమింగో హోటల్ వద్దకి 500 మంది చేరుకొని ‘యూదులని చంపేయండి’ అంటూ నినాదాలు చేశారు. అక్కడే ఉన్న రష్యన్ పోలీసులు వాళ్ళని ఆపకపోగా వాళ్లలో 10 మందిని ఫ్లెమింగో హోటల్ లోకి పంపించారు! ఆ హోటల్లో యూదులు ఉంటున్నారు చాలా కాలం నుండి… కానీ వారు రష్యన్ పౌరులు కాదు, శరణార్ధుల హోదాలో ఉంటున్నారు. కానీ స్థానిక క్రిస్టియన్ లు ముందే యూదులని సురక్షిత ప్రాంతాలకు పంపించేశారు.
ఇక స్థానికులు అందరినీ ఉద్దేశించి తీవ్రమయిన హెచ్చరిక ఒకటి చేశారు: దగేస్థాన్ లో ఎవరూ యూదులకి ఇళ్ళు అద్దెకి ఇవ్వడం, స్థలాలు అమ్మడం చేయవద్దు అని…
So! హిట్లర్ నాటి పరిస్థితులు మళ్లీ పునరావృతం చేసే పనిలో భాగంగా దాగేస్తాన్ లో పునాదులు వేస్తున్నాడు పుతిన్! ఇది రష్యా అంతటికీ వ్యాపించి తద్వారా ఇతర దేశాలకి పాకితే యూదులు మళ్లీ 100 ఏళ్ల క్రితం పరిస్థితుల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి! యూదుల మత పెద్ద (Cheif Rabbi) పించాస్ గోల్డ్స్మిత్ (Pinchas Goldschmidt) రష్యాని వదిలి వెళుతూ రష్యాలో ఉన్న యూదులు దేశం వదిలి వెళ్లిపోండి, లేదంటే యూదులని బలి పశువులను చేస్తాడు పుతిన్ అని హెచ్చరించాడు, ఇప్పుడు అదే నిజం అయ్యింది.
అసలు ఉక్రేయిన్ లో స్పెషల్ మిలటరీ ఆపరేషన్ మొదలయినప్పటి నుండి పుతిన్ తో పాటు రష్యన్ విదేశాంగ మంత్రి లవరోవ్ లు ఇద్దరూ యూదు వ్యతిరేక ప్రకటనలు చేస్తూ వస్తున్నా జెలెన్స్కీ యూదుడు కాబట్టి అలా అంటున్నారు అనుకున్నారు కానీ ఇప్పుడు బయట పడ్డారు. యాంటీ సెమిటీజమ్ అనేది సోవియట్ యూనియన్ పాలసీగా ఉంది. ఇవాళ పుతిన్ యూదులు రష్యాలో సురక్షితంగా ఉన్నారు అని చెప్పడాన్ని చరిత్ర తెలియనివారు నమ్ముతారు.
సిక్స్ డేస్ వార్ గా ప్రసిద్ది చెందిన యుద్ధంలో పాల్గొన్న అరబ్ దేశాలకి ఆయుధాలు అమ్మింది అప్పటి USSR! తన యుద్ధవిమానాలని కూడా పంపించింది అరబ్ దేశాలకి 1960, 70 లలో… అఫ్కోర్స్ ఇజ్రాయెల్ ఆ విమానాలని కూల్చేసింది. ఈజిప్టు, జోర్డాన్, సిరియా, యుద్ధ టాంకులని ఇజ్రాయిల్ నాశనం చేసింది. అవన్నీ USSR అమ్మినవే! 1920 ల నుండే రష్యన్లు ఇజ్రాయెల్ లేదా యూదు వ్యతిరేక టెర్రర్ గ్రూపులకి డబ్బు, ఆయుధాలు సప్లై చేస్తూ వస్తున్నది. 1990 లో సోవియట్ విచ్చిన్నం తరువాత సహాయం ఆగిపోయింది. తరువాత ఇరాన్ ఆ బాధ్యత తీసుకుంది.
హమాస్ దాడి తరువాత భారత్ లోని ముస్లింలు కొందరు పుతిన్ ఫోటోని DP గా పెట్టుకుంటున్నారు, కానీ ఒకసారి వెనక్కి వెళితే ఇదే పుతిన్ కాకసస్ అల్లర్ల సందర్భంగా ముస్లింలని తీవ్రంగా అణిచివేశాడు. మాస్కోలోని 20 లక్షల మంది ముస్లింలకి రెండు నెలల పాటు నిద్ర లేకుండా చేసాడు.
చరిత్ర తెలుసుకోండి…
So! హమాస్ మాజీ చీఫ్ కేరళలోని మలప్పురంలోని ముస్లిమ్స్ తో మాట్లాడిన తరువాత రెండు బాంబ్ బ్లాస్ట్స్ లు జరిగాయి. మన దేశంతో శత్రుత్వం కోరి తెచ్చుకోవడం పుతిన్ అవివేకానికి పరాకాష్ట! దీనికి విరుగుడుగా ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న జెలెన్స్కీ కి మోదీ అపాయింట్మెంట్ వచ్చే నెలలో ఖరారు అవ్వవచ్చు…
Share this Article