Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతరిక్షంలోకి వెళ్లాడు… తిరిగి వచ్చేసరికి దేశమే ముక్కలుచెక్కలు…

March 4, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి………  రష్యా తన సూయజ్ అంతరిక్ష నౌక లేదా రాకెట్ మీద ఉన్న అమెరికా, జపాన్, బ్రిటన్ దేశాల జెండాలని చెరిపేసి, రష్యా జెండాతో పాటు భారత దేశ జెండాని మాత్రం అలానే ఉంచేసింది! ఈ కథేమిటంటే…? రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన సంఘటనలో అమెరికా, బ్రిటన్, జపాన్ లు రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కదా ! బదులుగా రష్యా ఆయా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల విమానాలు తమ గగనతలం మీదుగా ఎగరకుండా ఆంక్షలు విధించింది.

గతంలో సోవియట్ యూనియన్ అంతరిక్షంలో ‘MIR ‘ అనే పేరుతో ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించింది. దానికి గాను సూయజ్ రాకెట్ ని ప్రయోగించింది. దానికి గుర్తుగా ఆ సూయజ్ రాకెట్ ని కజకిస్థాన్‌లోని బైకనూర్ లో ప్రదర్శనకి ఉంచింది. ఆపట్లో రష్యాతో పాటు అమెరికా, జపాన్, బ్రిటన్ లు కూడా మిర్ అంతరిక్ష కేంద్రంలో పని చేయడానికి తమ శాస్త్రవేత్తలని పంపించాయి. మన దేశం నుండి రాకేశ్ శర్మ కూడా మీర్ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళాడు. దానికి గుర్తుగా అమెరికా, భారత్ , జపాన్, బ్రిటన్ దేశాల జెండాలని సూయజ్ రాకెట్ మీద అతికించారు. ఈ రోజు అన్ని దేశాల జెండాలని పెయింట్ తో కప్పేసి రష్యా, భారత్ జెండాలని అలానే వదిలేసారు.

రోస్ కాస్మోస్ [Roscosmos] అంతరిక్ష కేంద్ర డైరెక్టర్ దిమిత్రి రోగోజిన్ [Dmitry Rogozin] మాట్లాడుతూ…. ఇప్పుడు సూయజ్ రాకెట్ చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు Twitter లో ట్వీట్ చేస్తూ ! అయితే సందర్భం వచ్చింది కాబట్టి పాత విషయం ఒకటి ప్రస్తావించక తప్పదు ఇప్పుడు. 1991 లో సోవియట్ యూనియన్ ముక్కలు అయిపోయినప్పుడు రష్యాకి చెందిన సెర్గీ క్రికలేవ్ [ Sergei Krikalev ] మిర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నాడు. నిజానికి క్రికలేవ్ సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడు అంటే On May 18, 1991 సూయజ్ రాకెట్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళాడు. అతను అక్కడ ఉండాల్సిన సమయం మూడు నెలలు మాత్రమే…

Ads

కానీ ఈ లోపు సోవియట్ పతనం అవడం, కజకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడడం, రష్యా మరో దేశంగా ఏర్పడడం వలన సూయజ్ రాకెట్ ని తిరిగి అంతరిక్షంలోకి పంపడానికి అప్పట్లో రష్యా దగ్గర డబ్బులు లేవు… దాంతో రాకెట్ ప్రయోగం వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఇవేవీ క్రికలేవ్ కి తెలియదు. ఫోన్ లో మాత్రం ఏదో టెక్నికల్ సమస్య వల్ల రాకెట్ ప్రయోగం ఆలస్యం అవుతున్నది అంటూ కాలం వెళ్ళబుచ్చారు. అలా 803d 9h 39m లు అంతరిక్ష కేంద్రంలో గడిపాడు. చివరకి మళ్ళీ రాకెట్ ప్రయోగించి భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు క్రికలేవ్ వేరే దేశంలో లాండ్ అయ్యాడు. అది కజకిస్తాన్… భూమి మీదకి వచ్చిన తరువాతే క్రికలేవ్ కి సోవియట్ యూనియన్ ఇక లేదని, తాను కజకిస్తాన్ అనే వేరే దేశంలో లాండ్ అయ్యానని తెలిసింది.

russia

మళ్ళీ ప్రస్తుతానికి వస్తే సూయజ్‌ రాకెట్ మీద అమెరికా, బ్రిటన్, జపాన్ దేశాల జెండాలని తీసేసి భారత దేశ జెండా ని అలానే ఉంచేయడం అనేది భారత దేశానికి ఇబ్బందికరమయిన విషయం అవుతుంది. ఎందుకంటే అమెరికాతో పాటు యూరోపుకి భారత్ మరియు రష్యాలు బాగా దగ్గర అయ్యాయి అనే సందేశం ఇచ్చినట్లవుతుంది. మన ఎటువైపూ మొగ్గకుండా తటస్థంగా ఉండడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పుతిన్ తీసుకున్న ఈ చర్య కేవలం భారత్ మాతోనే ఉంది అని గర్వంగా చెప్పుకున్తున్నట్లుగా ఉంది కదా?

mir

ప్రస్తుతం రష్యా, భారత్, చైనా ఒక కూటమిగా ఏర్పడబోతున్నాయి అనే అనుమానం అంకుల్ శామ్ కి వచ్చేసింది. ఆ అనుమానం నిజమే అని చెప్పడానికా అన్నట్లు పుతిన్ తీసుకున్న ఈ చర్య స్పష్టంగా తనకి భారత్ కావాలి అని తొందరపడుతున్నట్లుగా ఉన్నది. ఇది మనల్ని ఇరుకున పెట్టే చర్య అనడంలో సందేహం లేదు. కానీ క్వాడ్ విషయంలో ఇప్పటికీ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించడంలో అమెరికా విఫలం అయ్యింది. దానికి తోడు మనతో సంప్రదించకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో ప్రత్యేక కూటమి ఏర్పరచడం క్వాడ్ మనుగడ మీద సందేహాలకి తావు ఇచ్చింది అమెరికానే… ఇండియా లేకుండా మూడు దేశాలు కూటమిగా ఏర్పడినప్పుడు, ఇక నాలుగు దేశాల కూటమి ఉనికికి అర్థమేముంది..? అందుకే చూద్దాం, రేపు అమెరికా నుండి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions