.
భారత్ ‘స్వింగ్ పవర్’… రష్యా డీల్స్ తర్వాత అమెరికా హుటాహుటి పర్యటన – వ్యూహాత్మక రేసులో భారతే కీలకం!
రష్యా అధినేత పుతిన్ ఇండియాకు వచ్చి వెళ్లాడు… కీలకమైన రక్షణ, ఇంధన, సాంకేతిక ఒప్పందాలు కుదిరాయి… ప్రపంచంలో ఎవడికీ భయపడేది లేదనే సంకేతాల్ని ఇచ్చాయి… వెంటనే అమెరికా కదిలింది…
Ads
డిసెంబర్ 7న, అమెరికా అండర్ సెక్రటరీ అలిసన్ హుకర్ భారత గడ్డపై అడుగుపెట్టింది… పుతిన్ పర్యటనను ముగించిన సరిగ్గా 48 గంటల్లోనే, అమెరికా రంగంలోకి దిగింది… ఇది కేవలం దౌత్యపరమైన రొటీన్ పర్యటన కాదు – ఇది తక్షణ వ్యూహాత్మక జోక్యం…
హుకర్ పర్యటనలో కొన్ని భేటీలు ఢిల్లీలోని కీలక ప్రభుత్వ కార్యాలయాల్లో రహస్యంగా సాగాయి… వాటి లక్ష్యాలు…
-
ఇండో-పసిఫిక్ భద్రత, ప్రాంతీయ సహకారం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి…
-
రష్యా vs. అమెరికా…: రష్యా నుంచి రక్షణ పరికరాలపై భారత్ ఆధారపడటంపై వాషింగ్టన్ ఆందోళన చెందుతోంది… దీనికి ప్రతిగా, అమెరికా అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష సహకారం వంటి ఆకర్షణీయమైన అవకాశాలను భారత్ ముందు ఉంచుతోంది…
-
ఉగ్రవాదంపై సహకారం…: హుకర్ పర్యటనకు కొద్ది రోజుల ముందే భారత్, అమెరికాలు ఉగ్రవాద వ్యతిరేక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించాయి… ఉగ్రవాద సంస్థలపై చర్యలు, నిఘా సమాచారం పంచుకోవడం వంటి అంశాలపై అమెరికా మరింత పదునైన సహకారాన్ని కోరుతోంది… (అఫ్‌కోర్స్, ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్థాన్‌తో అమెరికా అంటకాగడం ఓ ఐరనీ)…
-
వాణిజ్య సంధి…: హుకర్ సమావేశాలతో పాటు, అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం కూడా భారత్‌లో ఉంది ఇప్పుడు… టారిఫ్ వివాదాలను పరిష్కరించుకుని, వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు…
హుకర్ ఢిల్లీ నుంచి బెంగళూరు పర్యటనకు వెళ్లడం కేవలం సందర్శన కాదు, అదీ వ్యూహాత్మకమే… ఆమె ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలతో సమావేశం కావడం, అంతరిక్ష కార్యక్రమాల్లో భారత్‌ను భవిష్యత్తు భాగస్వామిగా కోరుకుంటున్నామనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది…
కృత్రిమ మేధ (AI), అంతరిక్ష విజ్ఞానం, క్లైమేట్ టెక్ వంటి భవిష్యత్తు రంగాలలో భారత్ ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది… వెరసి ఈ పర్యటన కోర్ థీమ్ (ముఖ్య విషయం) ఒక్కటే… భారత్ ప్రపంచానికి కీలకంగా మారింది.
-
భారత్ నిశ్చిత వైఖరి…: రష్యా రాయితీ చమురు, రక్షణ అప్‌గ్రేడ్‌లు ఇస్తోంది. అమెరికా సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆఫర్ చేస్తోంది. ఈ ఒత్తిళ్ల మధ్య, భారత్ తన జాతీయ ప్రయోజనాలను బట్టి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరికీ తలవంచదు…
-
దౌత్య విజయం…: ఈ రెండు అగ్రరాజ్యాలు తమకు తిరుగులేని అవసరం ఉన్నందునే భారత్ వద్దకు వస్తున్నాయి… ఈ పర్యటన భారత్‌ను ప్రపంచ రాజకీయ పటంలో నిర్ణయాత్మక శక్తిగా అమెరికా బహిరంగంగా అంగీకరించినట్టు సూచిక…
Share this Article