Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుండమార్పిడి… అక్కడ మొగుడు కొడితే ఇక్కడా మొగుడు కొడతాడు…

June 28, 2024 by M S R

కృష్ణ , శోభన్ బాబులు పోటాపోటీగా తమ నటనతో అదరకొట్టిన సినిమా 1973 లో వచ్చిన ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా . అసలు టైటిలే అదిరిపోయింది . ముఖ్యంగా మహిళల సెంటిమెంటును పురిగొల్పి , వాళ్ళ ఆదరణ పొందిన సినిమా . శోభన్ బాబు , కృష్ణలు కలిసి నటించిన ఆరో సినిమా ఇది .

టైటిల్సులో ఎవరి పేరు ముందు వేయాలి అనే తర్జనభర్జనలతో , పేర్లు వేయకుండా ఇద్దరి ఫొటోలు పెట్టేసారు . తమిళంలో సక్సెస్ అయిన పుగంద వీడు అనే సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . చెల్లెలు సెంటిమెంటుతో శోభన్ బాబు , తల్లి సెంటిమెంటుతో కృష్ణ చాలా గొప్పగా నటించిన సినిమా . శుచి , శుభ్రతల obsession తో సతమతమయ్యే కలవారి అమ్మాయిగా లక్ష్మి , పేద కుటుంబంలో పుట్టి సర్దుకుపోయే మనస్తత్వం కల అమ్మాయిగా చంద్రకళ బాగా నటించారు .

శోభన్ బాబు తల్లిగా మహానటి సావిత్రి , కృష్ణ లక్ష్మిల తండ్రిగా , కుష్టు వ్యాధి మనిషిగా నాగయ్యల నటన చెప్పేదేముంది ! Veterans . కుండ మార్పిడి పెళ్ళిళ్ళు మా చిన్నప్పుడు బాగానే ఉండేవి . అప్పట్లో పెళ్ళిళ్ళు ఎక్కువగా బంధువుల మధ్యే జరుగుతుండేవి . మేనరికం వంటి ఆచారాలు , నమ్మకాలు ఉండటం వలన ఈ కుండ మార్పిడి పెళ్ళిళ్ళు విస్తృతంగా ఉండేవి .

Ads

అక్కడ మెగుడు కొడితే , ఇక్కడ మెగుడు కూడా కొట్టేవాడు . న్యూటన్స్ లా బాగా పనిచేస్తుండేది . ఇద్దరూ చక్కగా పెట్టె బేడా సర్దుకొని పుట్టిళ్ళకు చేరేవాళ్ళు . ఈ సినిమా కధ కూడా అదే , అంతే .

సత్యం సంగీత దర్శకత్వంలో బాల సుబ్రమణ్యం పాడిన ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను అనే పాట సూపర్ హిట్టయింది . అలాగే సిరిమల్లె సొగసూ జాబిల్లి మనసూ , చిన్నారి కన్నయ్యా నా ఆశ నీవయ్యా , అహా బోల్తా పడ్డావు బుజ్జి నాయనా పాటలు కూడా హిట్టయ్యాయి . సిరిమల్లె సొగసు పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

ఈ సినిమాలో తప్పక మెచ్చుకోవలసింది యన్ ఆర్ నంది డైలాగ్స్ . చాలా పదునుగా , పొదుపుగా ఉంటాయి . యస్ పట్టు దర్శకత్వంలో ప్రతిష్టాత్మమైన AVM బేనర్లో వచ్చింది . మళయాళంలో సింధు అనే టైటిల్ తో రీమేక్ చేసారు . లక్ష్మి మూడు భాషల్లోనూ నటించగా , చంద్రకళ తెలుగు , తమిళ భాషల్లో నటించింది . వీరందరితో పాటు రాజబాబు , రమాప్రభ హాస్య జంట .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . రెండు మూడు సార్లు చూసినట్లు గుర్తు . యూట్యూబులో ఉంది . చక్కని సెంటిమెంటల్ , నీట్ , ఫీల్ గుడ్ మూవీ . చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ చక్కని సినిమా . బిర్రయిన స్క్రీన్ ప్లే , నీట్ డైరెక్షన్ , పదునైన మాటలు , శ్రావ్యమైన సంగీతం , తమ తమ పాత్రలకు 100% న్యాయం చేసిన నటులు , వెరశి మంచి సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……….. By డోగిపర్తి సుబ్రహ్మణ్యం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దిల్ కా దడ్‌కన్ రకుల్‌కు ఏమైంది..? మెడపై ఆ ప్యాచ్ ఏమిటి..?
  • మై డియర్ ఆర్కే… సలహాలు తీసుకునే స్థితిలో వాళ్లున్నారా అసలు..?!
  • మోకాలిలో బుర్ర కాదు గానీ…. మోకాలి కింద మాత్రం గుండె ఉంటుంది..!!
  • అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
  • మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
  • జూదం, మద్యం… వీటికన్నా రీల్స్, షార్ట్స్ డేంజరస్… ఇక మీ ఇష్టం…
  • రాజకుటుంబం… బోల్డ్ పాత్రలు, వివాదాలు… ఈమె కథే కాస్త డిఫరెంటు…
  • బ్లాస్టింగ్ కుట్ర కాదు… అసలు కాళేశ్వరం కుట్ర ఏమిటో బ్లాస్టింగ్ నిజాలు…
  • మోహన్‌ లాల్‌లోని ఆ నిజనటుడికి ‘హృదయపూర్వ’క అభినందన..!!
  • తెలుగు ఇండియన్ ఐడల్…! ఈ బుగ్గలు పిండే టాస్కులేంటి థమన్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions