Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రధానిపై క్షుద్ర పూజల ప్రయోగం… విరుగుడుగా ప్రత్యేక పూజలు…

June 30, 2025 by M S R

.

క్షుద్ర పూజల వలయంలో పివి!… ఇదీ ఓ ఆర్టికల్ హెడింగ్… ఈ కథ ఇప్పుడెందుకూ అంటే..? నిన్న మాజీ ప్రధానిని స్మరించుకున్నాం కదా… దక్షిణాచారం, వామాచారం, క్షుద్ర పూజల గురించీ మాట్లాడుకుంటున్నాం కదా కామాఖ్య సంగతుల్లోనే…

ఎస్, ప్రపంచ వ్యాప్తంగా వేల తెగలు… ఎవరి దేవుళ్లకు, దేవతలకు వాళ్ల పద్ధతుల్లో పూజా విధానాలు ఉంటయ్… ఏదీ నీచం కాదు, ఏదీ క్షుద్రం కాదు… పాత్రికేయం సృష్ఠించిన ఓ క్షుద్ర పదం అది… అంతే…

Ads

విశ్వంలో నెగెటివ్ ఫోర్స ఉంటుంది, పాజిటివ్ ఫోర్స ఉంటుంది… ఒకటి దేవుడు, మరొకటి దెయ్యం… లేదా భూతం లేదా పిశాచం… పేరు ఏదైనా సరే… పాజిటివ్ ఫోర్స్ కరుణ కోసం చేసే పూజలు, నమ్మకాలు ఒకటైపు… అదే సమయంలో పిశాచశక్తిని అంటే దైవేతర ప్రతికూల శక్తి కరుణ కోసం చేసే పూజలు మరోరకం…

పోనీ, సింపుల్‌గా… వెజ్… నాన్-వెజ్… ఎలాగూ చర్చ వచ్చింది కదా… మాజీ టీటీడీ ఈవో, పీవీ మీడియా అడ్వయిజర్‌గా పనిచేసిన పీవీఆర్‌కే ప్రసాద్ రాసిన ఓ పుస్తకంలో ఓ చాప్టర్ టచ్ చేద్దాం… ఇలా… (పీవీకి హిందూ పురాణాలు, శాస్త్రాలు, పద్ధతులు, మర్మాలు అన్నీ తెలుసు… రిటైరయ్యాక కుర్తాళం పీఠాధిపతిగా వెళ్లాలనీ అనుకున్నాడని ఈ చాప్టర్ చదివేముందు గుర్తుంచుకొండి…



ప్రధానమంత్రి పదవి నుంచి పివి నరసింహారావుని దించేయాలని క్షుద్రపూజలు మొదలవుతున్నాయి. 1992 మేలో నేను ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా చేరిన కొన్ని మాసాల తరువాత ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి కొందరు పండితులు ప్రధానమంత్రికివ్వాలని ప్రసాదం తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన విషయం నన్ను సంభ్రమంలో ముంచేసింది.

‘‘అయ్యా, వచ్చే నెలలో ఉజ్జయినిలో ఒక భారీ క్షుద్రపూజని ఎవరో తలపెట్టారు. ఆ పూజ లక్ష్యం – నరసింహారావుగారిని ప్రధానమంత్రి పదవినుంచి దించేయటం…..’’
ఆ రాత్రి పివిగారు భోజనం చేసి, స్థిమితపడ్డాక, ఉజ్జయిని పండితులు చెప్పిందంతా చెప్పాను. ఆయన పెద్ద పెట్టున ఒక నవ్వు నవ్వి మొత్తం విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు.

‘‘ఉజ్జయిని పండితులు చెప్పింది నిజం కాదని మాత్రం అనలేను. ఎందుకంటే ఇలాంటివి ఢిల్లీ రాజకీయాలలో సహజం. చాలామంది నాయకుల కోసం ఇలాంటి పూజలు చేసే వాళ్ళు ఇక్కడ సిద్ధంగా వుంటారు.

నెహ్రూ గారు నమ్మేవారో లేదో తెలీదు కాని ఆయన కూతురు నమ్మేది. ఆమె దగ్గర కొంతమంది మంత్రులు కూడా బాగా నమ్మేవారు. నీకు గుర్తుందో లేదో, నువ్వు తిరుపతిలో ఎగ్జిక్యూటివ్‍ ఆఫీసర్‍గా వున్నప్పుడు ఒక కాశ్మీరీ పండితుణ్ణి ‘వివిఐపి’గా చెప్పి నీ దగ్గరకు పంపించాను…

ఆయనంటే ఇందిరాగాంధీకి బాగా నమ్మకం. ఆవిడ కోసం ఆయన హోమాలు, యాగాలు, పూజలు చేయిస్తూ వుండేవాడు. మనకి దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలోనే ఈ రకమైన క్షుద్ర పూజల మీద విశ్వాసం ఎక్కువ. చాలామంది పండితుల కుటుంబాల్ని ఢిల్లీ రాజకీయాలే పోషిస్తుంటాయి….’’

‘‘సర్‍, మనం కూడా ఏమన్నా చేద్దాం సర్‍.’’
‘‘ఏమిటీ, క్షుద్రపూజలా?” పివి నావంక నమ్మలేనట్లుగా చూశారు. బహుశా తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‍ ఆఫీసర్‍గా చేసిన ప్రసాదేమిటి, ఇలా క్షుద్ర పూజలంటున్నాడేమిటి? – అని ఆయనకి విస్మయం కలిగించవచ్చు.

నేను కంగారుపడ్డాను. ‘‘అహహ, అది కాదు సర్‍. వాళ్ళు చేసే క్షుద్ర పూజలని నిర్వీర్యం చేయించే సాత్త్విక పూజలేమైనా చేయిస్తే మంచిది గదా అని… మీ ఇష్టం. మీరెలా చెబితే అలా సర్‍…” అప్పుడు మళ్ళీ ఉజ్జయిని పండితులు చెప్పిన విషయాలు ఎత్తాను.

‘‘మీరు దిగిపోవాలని కోరుకునే వాళ్ళున్నారా సర్‍?’’
‘‘వున్నారయ్యా – మా పార్టీలోనే ముగ్గురు నలుగురున్నారు. ఇటువంటి ప్రయోగాలు వాళ్ళకేం కొత్త కాదు…’’
‘‘కాబట్టి సర్‍, మన జాగ్రత్తలో మనం వుండాలి. మనం ఎవరికీ అపకారం చేయద్దు. కాని అసాధారణమైన సంస్కరణలు తీసుకొస్తున్న మిమ్మల్ని మేం కాపాడుకోవాలి. ఈ దేశం కోసమైనా కాపాడుకోవాలి… మీరింకేమీ చెప్పకండి. సాత్త్విక పూజలు, హోమాలూ చేసేవాళ్ళున్నారు. నేను ఏర్పాటుచేస్తాను…

పార్టీ తరఫున కోట్లు ఖర్చుపెడుతున్నాం. అందులోంచే కొంత దీనికీ పెడదాం. పదిమంది పండితుల్ని పోషించాం అనుకోండి…’’

నా ఉత్సాహాన్ని ఊపునీ ఆయన గట్టిగా కాదనలేకపోయారు. ఆయనేం చెప్పినా నేనింక వినే స్థితిలో లేనని అర్థం చేసుకున్నారు. అయిష్టంగా తలూపేసి లోపలికెళ్ళిపోయారు.
ఆ తరువాత పి.వి.గారి మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాసపరీక్ష నెదుర్కొనే ముందే మొదటి హోమం జరిగింది… ఆయన ప్రభుత్వం విశ్వాసపరీక్షలో నెగ్గింది…



సో, నెగటివ్‌కు విరుగుడు పాజిటివ్ పూజ… పాజిటివిటీకి విరుగుడు నెగెటివ్ పూజలు… అంతే తేడా… నో క్షుద్రం, నో నీచ… జస్ట్, పద్ధతులు వేరు… మనమే పిచ్చి పేర్లు పెడుతున్నాం… అంతే…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions