.
మల్టీ యాక్సిల్, ఏసీ, వోల్వో బస్సు దిగి… ఓ ఆర్టీసీ ఎర్ర బస్సు ఎక్కినట్టుంది..! పోలిక సరిగ్గా సరిపోలుతుందో లేదో తెలియదు గానీ… అమెరికాలో ఖతర్ ఎయిర్‌వేస్ ఫ్లయిట్ ఎక్కి, దోహాలో దిగి, అక్కడ ఇండిగో ఫ్లయిట్ ఎక్కితే అలాగే అనిపించింది… అబ్బే, ఇదేమంత చెప్పుకునే విషయమా అంటారా..? అవును, చెప్పుకునే విషయమే… మన విమానయాన సంస్థల ఇంటర్నేషనల్ సర్వీసులు ఎంత దరిద్రంగా ఉన్నాయో, అస్సలు ఏమాత్రం పోటీలోనే లేకుండా ఎలా పోతున్నాయో చెప్పుకోవాలి…
నిజం చెప్పాలంటే… ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ అనగానే (ప్రత్యేకించి అమెరికా) చాలామంది ఖతర్, ఇతిహాద్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు… ఎందుకు..? మనవాళ్లకు ప్రయాణికులు జస్ట్ కస్టమర్స్, కానీ వాళ్లకు ప్రయాణికులు గెస్టులు… అదీ తేడా…
Ads
రేట్ల గురించి కాదు… సర్వీస్, అతిథి పట్ల చూపే గౌరవం ముఖ్యం… ఉదాహరణకు ఈ జర్నీయే తీసుకుందాం… న్యూయార్స్ నుంచి దోహా… ఖతర్ ఎయిర్‌వేస్… బోయింగ్… బిజినెస్ క్లాస్ వదిలేస్తే, ఎకానమీలో ఒక వరుసకు పది (3+4+3)… ప్రతి సీటు ఎదుట ఎంటర్‌టెయిన్‌మెంట్ సెక్షన్లతోపాటు విమానం ఎంత ఎత్తులో ఉంది, ఏ స్పీడులో ఉంది, ఏ లొకేషన్‌లో వెళ్తున్నాం అనే వివరాలు డిస్‌ప్లే అవుతాయి… పాటలు, స్పోర్ట్స్, సినిమాలు ఎట్సెట్రా సరేసరి…
ప్రతి సీటుకూ చార్జింగ్ పాయింట్… ఫుడ్, బేవరేజెస్ నాణ్యత, క్వాంటిటీ ఎక్కువ… (ఇంటర్నేషనల్ ఫ్లయిట్లలో కూల్ డ్రింక్స్, టీ, కాఫీతోపాటు పలు రకాల లిక్కర్ కూడా లిమిటెడ్‌గా ఇస్తారు, అడిగితే… లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా సరే)
అన్నింటికీ మించి, గతంలో లేదు గానీ ఇప్పుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో ఖతర్ ఎయిర్‌వేస్ వాళ్లకు ఒప్పందం… ఆన్ బోర్డు (విమానంలో) కూడా వైఫై, ఇంటర్‌నెట్ ఇస్తున్నారు… జర్నీ మొత్తం… (బోయింగ్ విమానాల్లో ప్రధానంగా)… అంటే ఆ జర్నీ పీరియడ్‌లో మనం యాక్సెస్ అస్సలు కోల్పోము… (B777, A350, B787 విమానాల్లో, నిర్దిష్ట రూట్లలో)

దోహా నుంచి హైదరాబాద్… ఇండిగో… మనకు చాయిస్ వేరే లేదు కాబట్టి వేరే దిక్కులేక ఆ విమానాల్లోనే ప్రయాణించాలి… ఖతర్- ఇండిగో ఒప్పందాలు అవి… సరే, పోలిక చూద్దాం… న్యూయార్క్ నుంచి దోహా 12 గంటలు… దోహా నుంచి హైదరాబాద్ 4 గంటలు… కానీ ఆ ఎయిర్ బస్సు..?
దేశంలోని నగరాల నడుమ షటిల్ సర్వీస్ చేసే విమానాలు నయం… ఇది ఖతర్ నుంచి ఇండియా… అంటే ఇంటర్నేషనల్ ఫ్లయిటే కదా… నాలుగైదు దేశాలు, సముద్రం మీదుగానే వస్తాం కదా… మరీ ఈ డొమెస్టిక్ బాపతు విమానాలు దేనికి..? సీటుకు ఎదురుగా స్క్రీన్లు లేవు… ఫోన్ ఎలాగూ ఆఫ్… చివరకు చార్జింగ్ పాయింట్లు కూడా లేవు…
బ్రేక్ ఫాస్ట్… చటాక్ చిప్స్, 14 పాప్‌కార్న్, టీ లేదా కాఫీ… అంతే… లంచ్, డిన్నర్ మరీ నాసిరకం అట, తోటి ప్రయాణికుల ఫీడ్ బ్యాక్… ఇప్పుడు ఎయిర్ ఇండియా కాస్త ఎక్కువ ప్రచారం చేసుకుంటూ అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది… కానీ ఆప్ట్ చేసుకునే వారి సంఖ్య తక్కువే ఉంటోంది… ఎడారి దేశాల ఎయిర్‌వేస్ సివిల్ ఏవియేషన్ ప్రొఫెషనలిజం మనకు ఎందుకు లేదు..?
ర్యాంకు, ఎయిర్‌లైన్, దేశం
1 Singapore Airlines సింగపూర్
2 Qatar Airways ఖతర్
3 Cathay Pacific హాంకాంగ్
4 ANA జపాన్
5 Turkish Airlines టర్కీ
6 Emirates యూఏఈ
7 Air France ఫ్రాన్స్
8 Hainan Airlines చైనా
9 Japan Airlines జపాన్
10 Korean Air దక్షిణ కొరియా
Share this Article