Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

QUAD … నాలుగు దేశాల కూటమి ఉన్నట్టా..? రద్దయిపోయినట్టేనా..?!

September 23, 2025 by M S R

.

పార్థసారథి పొట్లూరి .... ట్రంప్ పాకిస్తాన్ లో ముడి చమురుని వెలికి తీస్తాను అన్న మాట గుర్తుందా?
ఇదిగో పాకిస్తాన్ సౌదీ అరేబియా, చైనాల వైపు వెళ్లకుండా ఆపడానికే ఒక బిస్కెట్ వేసాడు. ఇప్పుడు అదే మాటని మళ్ళీ అనమనండి!

సౌదీ అరేబియా పరోక్షంగా చైనా పంచన చేరినట్లే అమెరికాని నమ్ముకోకుండా!
ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి టెహరాన్ వెళ్లి అలీ ఖోమేనిని కలిసి చర్చలు జరిపి వచ్చాడు.
So! దశబ్దాలుగా సౌదీ అరేబియా ఇరాన్ మధ్య ఉన్న వైరం పక్కన పెట్టి ఒక్కటయ్యాయి!

Ads

******************

రెండు సంఘటనలు జియో పాలిటిక్స్ ముఖచిత్రాన్ని మార్చివేసాయి.
ఇజ్రాయేల్ ఖతార్ మీద దాడి చేయడం ఒకటయితే ఖతార్ లోని అమెరికన్ ఎయిర్ బేస్ లో ఉన్న రాడార్లని స్విచ్ ఆఫ్ చేయడం!

బోనస్ గా ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ కి ఆకాశంలో ఇంధనం నింపడానికి వాడిన బోయింగ్ 707 ఫ్యూయల్ టాంకర్ బ్రిటన్ ది!
పాలస్తీనాని ఒక దేశంగా గుర్తిస్తున్నామని బ్రిటన్, ఫ్రాన్స్, జెర్మనీ బహిరంగంగా ప్రకటించాయి. మరి ఖతార్ మీద దాడి చేయడానికి ఇజ్రాయేల్ ఫైటర్ జెట్స్ కి ఇంధనం సరఫరా చేయడం దేనికి?

******************
40 J-10CE ఫైటర్ జెట్స్ ని చైనా ఇరాన్ కి పంపించింది!
అఫ్కోర్స్! చైనా పాకిస్తాన్ కి ఇచ్చినవి కావు. ఇవి ఒరిజనల్!
So! ఒక్క దెబ్బతో ఆట మారిపోయింది! ఇరాన్ పని అయిపోలేదు! రహస్యంగా అణు వార్ హెడ్స్ ని తయారు చేసే పనిలో ఉంది!

ఒక్క నెల గడువు ఇస్తే చాలు. ఇరాన్ మీద దాడి చేయడం అంత సులువు కాదు అమెరికాకి అయినా, ఇజ్రాయేల్ కి అయినా!
బహుశా! ఇరాన్ రహస్య అణు కార్యక్రమం గురుంచి జిన్జ్పింగ్ సౌదీ ప్రిన్స్ MBS కి చెప్పి ఖోమేనిని కలవమని సలహా ఇచ్చి ఉండవచ్చు!
అమెరికా వ్యతిరేక కూటమిలో 57 ముస్లిం దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికన్ దేశాలు చేరిపోయినట్లే!
భారత్ ని దూరం చేసుకుంది అమెరికానే!

జపాన్ ని ఒప్పించగలిగితే QUAD నుండి జపాన్, భారత్ తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే డిసెంబర్ నెలలో జరగబోయే QUAD సమావేశాన్ని ట్రంప్ ముందుగానే రద్దు చేసుకున్నాడు కాబట్టి QUAD అనేది అనధికారకంగా రద్దు అయినట్లే.
SO! WHAT NEXT?

ఓట్ చోర్ నినాదాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి మోడీ చేత రాజీనామా చేయించే కార్యక్రమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకొస్తారు!
మోడీ రాజీనామా చేస్తే జియో పాలిటిక్స్ దాని డైనమిక్స్ లో విపరీతమైన మార్పులు వస్తాయని బలంగా నమ్ముతున్నది ఇల్యూమినాటి!

గత ఆగస్టు మొదటి వారంలో జార్జ్ సోరోస్ మియాన్మార్ ( బర్మా) వచ్చి వెళ్లిన తరువాత రాహుల్ ఓట్ చోర్ నినాదాన్ని మొదలు పెట్టాడు.
జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ బర్మాలో కూడా ఉంది. ఓట్ చోర్ ప్రాజెక్టు కోసం బహుశా ఫండింగ్ బర్మా, బంగ్లాదేశ్ ల మీదుగా వెస్ట్ బెంగాల్ లోకి, ఆపై భారత్ లోని వివిధ ప్రాంతాలలోకి ప్రవహిస్తుండవచ్చు.

***************
సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరగగానే ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ కి 40km దూరంలో ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్ ని తమకి అప్పగించమని తాలిబన్లని డిమాండ్ చేస్తున్నాడు.
1959 లో బగ్రామ్ ఎయిర్ బేస్ ని అమెరికా నిర్మించింది. 1981-91 వరకూ అప్పటి సోవియట్ యూనియన్ పదేళ్ల పాటు ఈ ఎయిర్ బేస్ ని వాడుకుంది.

తిరిగి ఈ ఎయిర్ బేస్ ని 2010లో అమెరికా ఆధునికంగా పునర్నిర్మించి తన స్థావరంగా వాడుకుంది. 2001 నుండి 2021 వరకూ నాటో దళాలకి ముఖ్యమైన ఎయిర్ బేస్ గా ఉపయోగ పడింది!
1వ శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య రాజధానిగా ఒక వెలుగు వెలిగింది బగ్రామ్. పాత సిల్క్ రూట్ కి కేంద్రంగా ఉండేది.
ట్రంప్ బగ్రామ్ ఎయిర్ బేస్ ని తమకి అప్పగించకపోతే తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాడు!
తాలిబాన్లు మాత్రం ఒక్క అంగుళం కూడా ఇచ్చేది లేదని ఘాటుగా సమాధానం ఇస్తున్నారు!

ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికాకి ఎందుకంత అవసరం అయింది?
బగ్రామ్ ఎయిర్ బేస్ లో ఉన్న రన్వేని 3.6 కిలోమీటర్ల పొడవుతో నిర్మించింది అమెరికా 2010 లో. ఈ రన్వే
మీద మిలిటరీ కి చెందిన హెవీ ట్రాన్స్పోర్ట్ విమానాలు దిగడానికి వీలవుతుంది.
మొన్న పాకిస్తాన్ తన అణు వార్ హెడ్లని రహస్యంగా సముద్రమార్గంలో సౌదీ అరేబియాకి తరలించింది. ఇజ్రాయేల్ సౌదీ అరేబియా, పాకిస్తాన్ మీద దాడికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ సౌదీ అరేబియా నుండి అణ్వస్త్రాలని ఇజ్రాయేల్ మీదకి ప్రయోగిస్తుంది అన్నమాట.
NATO తరహా అరబ్ కూటమికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.

ఆఫ్ఘానిస్థాన్ లోని బగ్రామ్ ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకొని ఒకవైపు చైనాని, మరోవైపు పాకిస్థాన్ ని కంట్రోల్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నాడు ట్రంప్!
యూట్యూబ్ లో భారత్ కి షాక్ అంటూ థంబ్ నెయిల్ పెట్టి అశుద్ధాన్ని వండుతున్న యూట్యూబ్ శుంఠలకి నాదొక ప్రశ్న…అణు ఆయుధాలు పాకిస్థాన్ లో ఉన్నప్పుడే మూడు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారత్!
అణ్వాయుధాలు పాకిస్తాన్ లో ఉన్నప్పుడే బ్రహ్మోస్ తో వాటి మీదనే దాడి చేసింది భారత్!
ఇప్పుడు అవే అణ్వాయుధాలు సౌదీ అరేబియాలోకి వెళితే భారత్ కి షాక్ ఎలా తగులుతుంది?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…
  • కుహనా సెక్యులర్ పార్టీల బ్లాక్ మెయిల్ పాలిటిక్స్‌కు ఎదురుదెబ్బ..!!
  • అడుగడుగునా అల్లరల్లరి… జంధ్యాల మార్క్ మరో కామెడీ…
  • ఒక దేశం మరో దేశాధ్యక్షుడిని పట్టుకొచ్చి, విచారించి, శిక్షించగలదా..?!
  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • భేష్ రేవంత్..! పరోక్షంగా బీఆర్ఎస్- వైసీపీ సర్టిఫికెట్…! ‘సాక్షే’ సాక్షి..!!
  • ఏ అవకాశం ఎవరిని వరిస్తుందో… ఏ రేంజుకు ఎత్తుతుందో ఎవరికెరుక..!!
  • మరో బ్లో- ఔట్…! నాటి పాశర్లపూడి నుంచి నేటి మలికిపురం దాకా..!!
  • ప్రపంచంలోకెల్లా అతి పెద్ద శివలింగం… గుళ్ల సముదాయం కూడా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions