Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రావుగారింట్లో రేవతి వింత పాత్ర..! కేర్‌టేకర్ కమ్ టీచర్ కమ్ ఎవరీథింగ్…!!

December 10, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. 100 % సంసారపక్ష చక్కని సినిమా 1988 జూన్లో వచ్చిన ఈ రావు గారిల్లు . అక్కినేని స్వంత సినిమా . ఈ సినిమాలో నాగార్జున సినిమా ఏక్టర్ నాగార్జునలాగే తళుక్కుమంటారు. ప్రముఖ నటి రాశి అయిదారేళ్ళ వయసులో ఏయన్నార్ సంతానంలో ఒక కూతురిగా నటించింది .

ఫస్ట్ హాఫ్ అంతా జయసుధది , సెకండ్ హాఫ్ అంతా రేవతిది . ఏయన్నార్ , జయసుధలకు అయిదుగురు సంతానం . చక్కని సంసారం . ఓ రోడ్ ప్రమాదంలో జయసుధ చనిపోతుంది . కుటుంబం అంతా ఖేద సముద్రంలో మునిగిపోతుంది . ఏయన్నార్ దేవదాసు అయిపోతాడు .

Ads

అతని స్నేహితుడు మురళీమోహన్ రేవతిని ఆ ఇంటికి కేర్ టేకర్ కం టీచర్ కం ఎవ్విరీ థింగ్ గా పంపుతాడు . మొదట్లో ఎవరూ ఆమోదించకపోయినా సహనంతో అందరినీ గెలిచి సంసారాన్ని గాడిలోకి తెస్తుంది . ఆమెను తన తండ్రిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపొమ్మని పిల్లలు పట్టుపడతారు .

కానీ , ఏయన్నార్ ఆసక్తి చూపడు . రేవతి ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి సన్నధ్ధం అవుతుంది . పిల్లలు , ఏయన్నార్ ఒప్పించి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి తెచ్చుకోవడంతో సినిమా ముగుస్తుంది . ఈ శాకాహార సినిమాలో నూతన్ ప్రసాద్ ధరించిన ఓ నాన్ వెజిటేరియన్ పాత్ర కూడా ఉంటుంది . అతనికి PA గా బ్రహ్మానందం . ఇద్దరూ బాగా నటించారు . ముత్యాలముగ్గు సినిమాలో కాంట్రాక్టరు రావు గోపాలరావు పాత్రలాగా అన్ని రకాల చట్టవిరుధ్ధ పనులూ చేస్తూ ఉంటాడు .

1965 లో వచ్చిన The Sound of Music అనే ఇంగ్లీషు సినిమా ఆధారంగా మన తెలుగు సినిమా నిర్మించబడింది . మన తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కధ మలచబడింది . ఈ ఇంగ్లీషు సినిమాను నేను హైదరాబాద్ యన్టీఆర్ నిర్మించిన రామకృష్ణ 70 MM థియేటర్లో చూసాను . 1968- 69 సంవత్సరంలో PUC విద్యార్ధిగా మా కళాశాల నిర్వహించిన Industrial Tour లో మొదటిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ సినిమాను చూసాను . అప్పట్లోనే యన్టీఆర్ థియేటర్ ప్రారంభించబడింది .

ఏయన్నార్ , జయసుధ , రేవతి , నూతన్ ప్రసాద్ చాలా బాగా నటించారు . ఏయన్నార్ , జయసుధ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది నూతన్ ప్రసాద్ ఒక్కో సినిమాకు ఒక్కో ప్రత్యేక శైలితో డైలాగ్స్ డెలివర్ చేస్తూ ఉండేవాడు . ఈ సినిమాలో కూడా అందరినీ బాబా అంటూ సాప్ట్ క్రిమినల్ పాత్రను బాగా పోషించాడు .‌ఇతర ప్రధాన పాత్రల్లో మురళీమోహన్ , హేమసుందర్ , సుత్తి వేలు  తదితరులు నటించారు . అయిదుగురు పిల్లల పేర్లు నాకు తెలియవు . బేబీ రాశి పేరు మాత్రమే తెలుసు .

revathi

ప్రముఖ డైలాగ్స్ రైటర్ డి వి నరసరాజు గారు ఈ సినిమాకు డైలాగ్సును వ్రాసారు . అన్నపూర్ణ ఫిలింస్ , యార్లగడ్డ సురేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తరణి రావు దర్శకుడు . బాగా డైరెక్ట్ చేసాడు . ఆయనకిది మొదటి సినిమాయే అనుకుంటాను . రాం గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ , కె శివ నాగేశ్వరరావు అసోసియేట్ డైరెక్టర్ .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . కుటుంబం అంతా కలిసి పాడే పిక్నిక్ పాట మధుర మధురమీవేళ , ఏయన్నార్ మురళీమోహన్ కలిసి పాడే పార్టీ పాట మగ పురుషులకిక తిరుగే లేదు బాగుంటాయి . మనుషుల మమతల , చురచుర చూసే , బోరు బోరు చదువు అంటూ సాగే మిగిలిన పాటలు కూడా బాగుంటాయి . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , మనో , రమోలా పాటల్ని పాడారు .

అయిదు కేంద్రాలలో వంద రోజుల పోస్టర్ పడిన ఈ చక్కని సంసారపక్ష సినిమా యూట్యూబులో ఉంది . పేరుకు చివర రావు అని ఉన్నవారు తమ ఇళ్ళను రావు గారిల్లు అని చెప్పుకుంటూ ఉంటారు . ఈ సినిమా టైటిల్ అంత పాపులర్ అయింది . ఇంతకుముందు చూడకపోతే తప్పక చూడండి . It’s a neat , feel good , family oriented emotional movie .

నేను పరిచయం చేస్తున్న 1190 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • థాంక్స్ రెహమాన్… నీ అభిమానుల కళ్లు కూడా తెరిపించావు…
  • అబుదాబి ఆయిల్ క్షేత్రాల్లో… ఇండియా సొంత ఉత్పత్తి… శుభసంకేతం…
  • దంపతులకు జాయింట్ టాక్స్ … మధ్యతరగతికి ‘బడ్జెట్’ వరం..?
  • 2 గంటల పర్యటనకు ఓ విశిష్ట అతిథి..! మోడీ స్వీయ స్వాగతం వెనుక..?!
  • సాక్షి…! భర్త విలన్… భార్య షీరో… అప్పట్లో ఓ క్రైమ్ థ్రిల్లర్…
  • మన పీఎస్ఎల్‌వీ వరుస వైఫల్యాల వెనుక ఏదైనా ‘స్పేస్‌వార్’..?
  • ఆ చివరి బాల్ అలాగే మిగిలి ఉంది… 22 పరుగులు వచ్చి గెలిచేశారు…
  • ప్రియమైన భార్యామణి గారికి… నాకు ఓ ‘పర్‌ఫెక్ట్ మ్యాచ్’ దొరికింది సుమా…
  • ఉడకని అమెరికా పప్పులు…. ట్రంపరికి ఇండియా సైలెంట్ వాతలు…
  • గిల్ సొంత హైటెక్ వాటర్ ప్యూరిఫయర్… కోహ్లీ అత్యంత ఖరీదైన వాటర్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions