మొన్నామధ్య తెలుగు ప్రమోషన్ల కోసం వచ్చినప్పుడు ధనుష్ తమిళంలోనే మాట్లాడాడు… వచ్చినవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు… కనీసం ఇంగ్లిషులో మాట్లాడినా బాగుండేది… సినిమా టైటిట్ కూడా రాయన్ అని పెట్టారు… రాయుడో మరొకటో పెడితే తెలుగుకు తగిన టైటిల్ అయి ఉండేది… తెలుగు ప్రేక్షకులే కదా, ఎలా రిలీజ్ చేసినా పట్టించుకోరు అనే ధీమా…
సేమ్, సినిమా చూస్తుంటే ధనుష్ తమిళ ప్రసంగంలాగే… ఏమీ అర్థం కాదు, ఎక్కడా హై ఉడదు, ఒక్క పాట కనెక్ట్ కాదు, ఏ సీన్ కూడా ఎమోషనల్‌గా ఎలివేట్ కాలేదు… తెలుగు మార్కెట్, హిందీ మార్కెట్ పొటెన్సీ ఎక్కువ కాబట్టి… అర్జెంటుగా ఆ రెండు భాషల్లోకి డబ్ చేసి వదిలారు… అంతే తప్ప నిఖార్సయిన తమిళ వాసన… తమిళంలో ఏమో గానీ, తెలుగులో సినిమా మీద బజ్ కూడా ఏమీ రాలేదు…
Ads
ధనుష్ మంచి నటుడు… అందులో డౌట్ లేదు… ఎవరూ తనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనీ లేదు… ఇందులో కూడా బాగానే చేశాడు… ఎటొచ్చీ కథకుడిగా, దర్శకుడిగా రాణించలేకపోయాడు… ఇది తనకు 50 వ సినిమా… దర్శకుడిగా రెండో సినిమా… పైగా పెద్ద పెద్ద యాక్టర్లున్నారు… సందీప్ కిషన్, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఎట్సెట్రా… అపర్ణా ధనుష్ జోడీ కాదు…
ఏఆర్ రెహమాన్ బీజీఎం కొంత పర్లేదు… ఇంత పెద్ద స్టార్లు, టెక్నిషియన్లు ఉన్నా సరే… స్టోరీ, దర్శకత్వం అనుకున్నంతమేరకు లేకపోవడంతో సినిమా యావరేజ్ అయిపోయింది… ఏదో క్రైమ్ ఫ్లాష్ బ్యాక్… గుట్టుగా కుటుంబం వేరేచోట గడపడం బొచ్చెడు సినిమాల్లో చూసిందే… అన్నాదమ్ముల అనుబంధం, అన్నాచెల్లెలి ప్రేమ, కుటుంబం కోసం అన్న పడే ప్రయాస… మన సినిమాల్లో కొత్తేమీ కాదు…
పైగా గ్యాంగ్ వార్ నేపథ్యం… అన్నకు ఎదురుతిరిగే తమ్ముళ్లు… హేమిటో… కథ ఎటెటో వెళ్లిపోయింది… ఫ్లాట్‌గా..! సన్ పిక్చర్స్ వారి సినిమా కాబట్టి నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడలేదు కానీ ధనుష్ కథ, దర్శకత్వం జోలికి పోకుండా ఉండాల్సింది… సందీప్ కిషన్ తదితరులు తమ పాత్రలకు తగినట్టు నటిస్తూ పోయారు గానీ, అసలు కథే వీక్‌గా ఉండి పాత్రలు తేలిపోయాయి…
ప్రత్యేకంగా చెప్పాల్సింది దుషారా విజయన్ గురించి… ధనుష్ చెల్లె దుర్గ పాత్రలో అదరగొట్టేసింది… ఆ పాత్రకు కూడా కథలో చాలా ప్రాధాన్యమిచ్చాడు ధనుష్… అపర్ణా బాలమురళిని ఎందుకు తీసుకున్నారో తెలియదు, ఆమె మెరిట్ ఉన్న నటి, తనకు తగిన పాత్ర కాదు ఇది… ధనుష్ నటన, దుషారా నటన… ఇవే ప్లస్ పాయింట్స్… రెహమాన్ మ్యూజిక్, కథ, ఫ్లాట్ నెరేషన్, సెకండాఫ్ ప్రజెంటేషన్ గట్రా మైనస్ పాయింట్స్… అన్నింటికీ మించి విపరీతమైన హింస… అదీ దుర్భరం..!!
Share this Article