Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫాఫం జగనన్న..! రాధాకృష్ణ కవ్విస్తున్నా సరే, కర్తవ్యం తోచడం లేదు..!!

March 27, 2022 by M S R

ఫాఫం… జగన్‌కు చేతకావడం లేదు… మాటిమాటికీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గుర్తుచేస్తూనే ఉన్నాడు… దమ్ముంటే కేసులు పెట్టి, ఏం చేసుకుంటారో చేసుకొండి అని కూడా సవాళ్లు విసురుతున్నాడు… ‘‘మీరెంత తపస్సు చేసినా సరే నన్ను, నా చంద్రబాబును, నా లోకేష్‌ను ఏమీ చేయలేరుపో’’ అన్నట్టుగా రాస్తున్నాడు… ‘‘చంద్రబాబు నథింగ్, ఆంధ్రజ్యోతితోనే వార్’’ అంటున్నావు కదా, కమాన్, నేను ఏ యుద్ధానికైనా రెడీ’’ అన్నట్టుగా కలంపొగరు చూపిస్తున్నాడు…

(మీరు చదివింది కరెక్టే… అది కలంపొగరు… అంతేతప్ప కులంపొగరు అని చదవకూడదని మనవి… కలంపొగరు అంటే ప్రొఫెషనల్ టెంపర్‌మెంట్… కాకపోతే కాస్త ఇన్‌ఫెక్షన్, దానివల్ల యెల్లోయిష్ డిశ్చార్జ్… అఫ్‌కోర్స్, అది సాక్షికి లేదా..? నమస్తే తెలంగాణకు లేదా..? ఎవరు ఆరోగ్యవంతులు..? డిశ్చార్జ్ కలర్స్ వేరు…) ఈరోజు కూడా అన్యాపదేశంగానో, నేరుగానో మళ్లీ గుర్తుచేశాడు…

‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు రాధాకృష్ణ, రామోజీరావు అంటూ పదే పదే కలవరించారు. మమ్మల్ని చంద్రబాబుతో ముడిపెట్టడం ద్వారా మా విశ్వసనీయత దెబ్బతీయాలన్నది ఆయన ఆలోచన కావొచ్చుగానీ, ఈ ట్రిక్కులు ఇక చెల్లబోవు. మంత్రి కొడాలి నాని అయితే మా మీడియా సంస్థలను 420గా అభివర్ణిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలకోసం మేం చేస్తున్న పోరాటాన్ని మీ విమర్శలూ, దుష్ప్రచారం నిలువరించలేవు’’ అంటూనే…. ‘‘సభలో లేని నాపై ముఖ్యమంత్రి దుష్ప్రచారం చేస్తుంటే మాకున్న ప్రత్యామ్నాయం ఏమిటి? మేమేమైనా అంటే సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసు ఇస్తారు కదా? మరి మా హక్కులను ఎవరు రక్షించాలి? మీకు మాత్రమే హక్కులుంటాయా? మాకుండవా?’’ అని రాసుకొచ్చాడు… 

హైకోర్టు తీర్పు మీద శాసనసభలో జరిగిన చర్చ తీరును తప్పుపట్టడం లేదా విశ్లేషించడం లేదా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం పాత్రికేయ వృత్తిసహజమే కావచ్చుగాక… సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందేమో, నోటీసు ఇవ్వవచ్చునేమో ఓసారి పరిశీలించండి అని జగన్‌కు గుర్తుచేస్తున్నట్టుగా ఉన్నయ్ ఈ వాక్యాలు… ప్చ్, రాధాకృష్ణ ఇలా ఎన్నిసార్లు హింట్స్ ఇస్తున్నా సరే, జగన్‌కు ధైర్యం చాలడం లేదు… రాధాకృష్ణ జోలికి వెళ్లడానికి సాహసించడం లేదు… ఎందుకో మరి..! మరీ ఇంత బేలగా, బాహుబలి అనుకుంటే ఖడ్గతిక్కనలాగా మారిపోయావేం జగనన్నా..!?

Ads

సరే… ‘‘చంద్రబాబు మహాత్యాగి, రాజకీయ దురంధరుడు, జగన్ దుర్మార్గుడు, అవినీతిపరుడు’’ అనే తరహాలో తన వ్యాసాలు ఉంటయ్ కాబట్టి మళ్లీ మళ్లీ ఆ రాతల్లోకి దిగే సాహసం ఇప్పుడు అక్కర్లేదు… కానీ ఒకటీరెండు పేరాలు మాత్రం చదివించేలా ఉన్నయ్… ఆలోచింపజేసేలా ఉన్నయ్… అంటే, చంద్రబాబు బ్యాచ్ ఏదో శుద్ధపూస అని కాదు… కానీ చంద్రబాబు బ్యాచ్‌కన్నా జగన్ బ్యాచ్ ఏం భిన్నంగా ఉందనేదే ఇక్కడ అసలు ప్రశ్న… ఇవీ ఆ పేరాలు…

aj

‘‘ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏకంగా లోకేశ్‌ను ఉద్దేశించి ‘ముండ’ భాష ప్రయోగించగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పగలబడి నవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్రజాస్వామిక పదాలను శాసనసభలో వాడకూడదన్న స్పృహ లేకుండా శాసనసభ్యులు  ‘ముండ’ భాష వాడటం, దానిని ముఖ్యమంత్రి నవ్వులతో స్వాగతించడం, స్పీకర్‌ కనీసం అభ్యంతరం చెప్పకపోవడం వింతగా ఉంది. హైకోర్టు తీర్పు వల్ల శాసనసభ అధికారాలకు భంగం కలిగిందని గొంతు చించుకున్న వాళ్లు ఇటువంటి భాషా ప్రయోగం వల్ల సభా గౌరవం పెరుగుతుందని చెప్పగలరా?

నారాయణ స్వామి వాడిన పదం విన్న తర్వాత ఆరు దశాబ్దాల క్రితం అనంతపురం మునిసిపల్‌ ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి వర్గం, రామాచార్యులు వర్గానికి మధ్య చోటుచేసుకున్న సంవాదంపై రావినూతల శ్రీరాములు ‘ఆంధ్రజ్యోతి’లో రాసిన వ్యాసంలో పేర్కొన్న కొన్ని వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో పప్పూరి రామాచార్యుల వర్గం వారు నీలం సంజీవరెడ్డి వర్గం పోటీకి దింపిన ఒక వార్డు అభ్యర్థినిపై సమాజంలో ‘హీన పరిగణన’ ఉన్న కులానికి చెందిన మహిళను పోటీకి నిలబెట్టారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం వారు రామాచార్యులు నిలబెట్టిన అభ్యర్థినిని చులకన చేసి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో రామాచార్యులు… నీలం సంజీవరెడ్డి వర్గం నుంచి పోటీ చేస్తున్న మహిళను ‘పతివ్రత’ అంటూ తన పత్రికలో సంబోధించారు. ఇది నీలం సంజీవరెడ్డి వర్గానికి ఇబ్బందిగా పరిణమించి..  రామాచార్యుల వద్దకు వెళ్లి అలా పతివ్రత అని సంబోధించవద్దని కోరారు. దీంతో రామాచార్యులు తదుపరి సంచికలో ‘ఆమె పతివ్రత కాదట’ అని రాశారు. దీంతో నీలం సంజీవరెడ్డి వర్గం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. రామాచార్యులు వంటి చమత్కారులు ఇప్పటి శాసనసభలో ఉన్నారో లేదో తెలియదు. ఉంటే ‘ముండ’ అని పదం వాడిన వారిని ఏమని వ్యాఖ్యానించేవారో ఊహించుకోండి…’’ 

రాధాకృష్ణ రాసుకొచ్చిన ఈ పాత ఉదాహరణ ప్రస్తుత భాషాసంస్కారంపై విమర్శలకు ఎలా ఆప్ట్ అవుతుందో తనకే తెలియాలి… కానీ చదవడానికి ఇంట్రస్టింగుగా ఉంది… వేంఠనే ఓ తెలుగుదేశం ముఖ్యుడు వాడిన ‘‘బోసిడికే’’ అనే పదం అర్జెంటుగా గుర్తొచ్చింది కూడా… కాకపోతే ఆయన సభలో ఆ పదాన్ని వాడలేదు… కానీ జగన్ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఇదే చంద్రబాబు బ్యాచ్ ఏ పదాలతో ఎలా వెకిలి చేసేవారో కూడా, అప్పుడు రాధాకృష్ణ ప్రొఫెషనల్ టెంపర్‌మెంట్ ఏమైందో మనకు తెలియదు… అలాగని జగన్ బ్యాచ్ పరుషపదవాడకాన్ని మనం సమర్థించాల్సిన పని కూడా లేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions