దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా 1975 లో వచ్చిన ఈ బాబు సినిమా . ఒక లవర్ బాయ్ – ముగ్గురు హీరోయిన్ల సినిమా . Above average గా ఆడిన సినిమా . నాలుగు సెంటర్లలో షిఫ్టింగుల మీద వంద రోజులు లాగించబడిన సినిమా . కధ తండ్రి కె యస్ ప్రకాశరావుది అయితే మెగాఫోన్ కొడుకు రాఘవేంద్రరావుది .
కాలేజీ కుర్రాళ్ళకు శోభన్ బాబు లేడీస్ ఫేషన్ టైలర్ పాత్ర బాగా నచ్చింది . మహిళలకు చెప్పే పనే లేదు . మరో విశేషం హిందీ నటి అరుణా ఇరానీ ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించటం . మిగిలిన ఇద్దరు వాణిశ్రీ , లక్ష్మి . లక్ష్మి చాలా గ్లామరస్ గా ఉంటుంది ఈ సినిమాలో .
ఓ జమీందారు కుమారుడు తండ్రికి ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుని రాజమహల్లో నుంచి బయటకు వెళ్ళి చనిపోతాడు . మనమడిని తాత దగ్గరకు పంపుతుంది తల్లి . మధ్యలో విలన్లు ఆ పిల్లాడిని దారి తప్పిస్తారు . ఆ పిల్లాడు టైలర్ బాబు అవుతాడు . విలన్ల ఆట కట్టించటంతో సినిమా ముగుస్తుంది .
Ads
సినిమాలో చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . డాన్సులు బాగుంటాయి . తాత కళ్ళు తెరిపించే నాటకం చాలా బాగుంటుంది . ఆ నాటకంలో పాట ఒక జంట కలిసిన తరుణాన జేగంట మ్రోగెను గుడిలోన చాలా శ్రావ్యంగా ఉంటుంది . దసరా బుల్లోడులో కారు లాగా ఈ సినిమాలో శోభన్ బాబు వాడే కారు వెరైటీగా బాగుంటుంది .
అయ్య బాబోయ్ అదిరిపోయింది , ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు నాకున్నవేమో రెండే కళ్ళు , ఓయమ్మో ఎంతలేసి సిగ్గొచ్చింది , నా స్నేహం పండి ప్రేమై నిండి చెలియా రావేలా పాటలు హిట్టయ్యాయి . పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . పాటలన్నీ సుశీలమ్మ , బాలసుబ్రమణ్యమే పాడారు .
శోభన్ బాబు , వాణిశ్రీ , లక్ష్మి , అరుణా ఇరానీ , మురళీమోహన్ , గుమ్మడి , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , మాదల రంగారావు , రావు గోపాలరావు , ముక్కామల , శ్రీధర్ , జి వరలక్ష్మి , మిక్కిలినేని , రాజబాబు ప్రభృతులు నటించారు .
An entertaining , musical , romantic , feel good movie . సినిమా యూట్యూబులో ఉంది . సినిమా చూడనివారు యూట్యూబులో చూడవచ్చు . చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( By దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
లాగింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక రంగుల పందిరి అని టాగ్ లైన్. 100% తన మార్క్ ఏమిటో మొదటి సినిమాతోనే చూపించారు దర్శకేంద్రులు. ఒక టైలర్ అయినా లారీ డ్రైవర్ అయినా జేబుదొంగ అయినా ఒక గైడ్ అయినా వాళ్ళ వేషధారణలు అంత రిచ్ గా ఉండేవి. ఇవన్నీ నిజజీవితంలో సాధ్యమేనా అని ఒక విలేకరి అడిగితే అసలు సినిమానే ఒక కల్పన. నిజజీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, అవి మరుద్దామని సినిమాకొస్తే ఇక్కడ కూడా అదే ఏడుపు చూపించడం సమంజసం కాదు. కోరికలు తీరని ఒక లారీ డ్రైవర్ తనని హీరోలో చూసుకుంటాడు. వాళ్లే నా ప్రేక్షకులు అని చెప్పారు. అలాగే మైంటైన్ చేసారు… (యలమంచిలి శ్రీనివాస్ కామెంట్)
Share this Article