Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నో పటాకులు, నో దీపాలు… రాహుల్‌ దీపావళి అంటే జస్ట్, ఇమర్తి, బేసన్ లడ్డూ…

October 21, 2025 by M S R

.

దీపావళి సందర్భంగా చంద్రబాబు, రేవంత్, వెంకయ్యనాయుడు ఎట్సెట్రా… చివరకు జగన్ కూడా పటాకులు కాల్చారు, ఫోటోలు దిగారు… కేటీయార్, కేసీయార్ ఫోటోలు కనిపించలేదు… నో నో, జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ముస్లిం వోట్లకూ దీనికీ సంబంధం లేదు…

హబ్బా, ఆ షర్మిల ప్రస్తావన మళ్లీ మళ్లీ తీసుకురాకండి ప్లీజ్… ఆమెకు హిందూ పండుగలు అన్నా, కల్చర్ అన్నా తెగ చిరాకు… అవసరమైతే ఈ పండుగలను నిషేధించాలని కూడా డిమాండ్ చేయగలదు… మొన్నామధ్య ఎస్సీ కాలనీల్లో గుళ్లెవడు కట్టమన్నాడు, బళ్లలో టాయిలెట్లు కట్టండి అనడిగింది కదా… ఫాఫం కాంగ్రెస్ పార్టీ… కానీ జగన్ ఫాఫం, కాస్త లిబరల్… తను పొలిటిషియన్, షర్మిల మతప్రచారక్…

Ads

సరే, విషయానికి వద్దాం… మోడీ ఎప్పటిలాగే సైనికులతో దీపావళి చేసుకున్నాడు… ఈసారి ఐఎన్ఎస్ విక్రాంత్‌లో నేవీ జవాన్లతో సెలబ్రేట్ చేసుకున్నాడు… దాదాపు పదేళ్లు ఆర్మీతో కనెక్టయ్యే విషయంలో మోడీ ధోరణి డిఫరెంట్, వాంఛనీయం కూడా… సాక్షాత్తూ ఈ దేశ ప్రధాని తమతో పండుగ జరుపుకోవడం అంటే అది ఆర్మీ భిన్న విభాగాల్లో ఎంతటి పాజిటివ్ స్పూర్తినిస్తుందో అర్థం చేసుకోవాల్సిందే…

మరి రాహుల్ గాంధీ..? సుప్రీంకు కోపమొస్తుందనేమో ఫాఫం పటాకుల జోలికి పోలేదు గానీ… స్వీట్లు కొనుక్కోవడానికి ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపుకి వెళ్లాడు… ఆ షాపు యజమాని సుశాంత్ జైన్… గాంధీ (నెహ్రూ లేదా వాద్రా) కుటుంబానికి ఆ స్వీట్ షాపుతో సంబంధం ఉంది…

సుశాంత్ జైన్ రాహుల్‌తో మాట్లాడుతూ…, రాహుల్ జీ, మీ పెళ్లి కోసం మేమంతా వేచి ఉన్నాం, ఆ వేడుకలలో మిఠాయి ఆర్డర్‌ పొందాలని ఎదురు చూస్తున్నాం అని చెప్పాడు… ఫాఫం…

తన తల్లిదండ్రుల పెళ్లికి కూడా స్వీట్లు ఆర్డర్ ఇచ్చింది అదే షాపు అని రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడని మీడియా మస్తు రాసింది… అవునూ, నిజంగా ఢిల్లీలోనే జరిగిందా సోనియా, రాజీవ్ పెళ్లి… ఏమోలెండి… కానీ రాహుల్ పెళ్లి కోరడం తప్పు కదా ఆ షాపు యజమాని…

వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలనే సదుద్దేశంతో పాపం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు కదా రాహుల్… పార్టీ వర్గాల ప్రచారం మేరకు… ఏమో, పెళ్లయ్యీ, వేరే విదేశీ ఇంటికి అల్లుడై ఉంటాడు, అందుకే హఠాత్తుగా అప్పుడప్పుడూ మాయం అయిపోతుంటాడు అని బీజేపీ వర్గాలు విమర్శించినా సరే..!

తెలంగాణలో అయితే 55 ఏళ్ల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌కు ఎవరైనా పిల్లనిచ్చే ఆలోచనలో ఉంటే… బిడ్డ అంత చేదయిందా, అయితే బావిలో తోసెయ్ గానీ ఈ పెళ్లేమిట్రా అంటారు… సరే, అదంతా వేరే సంగతి గానీ… రాహుల్‌కు ఇష్టమైన స్వీట్లు ఇమర్తి, బేసన్ లడ్డూలు అట… తనే వాటిని చేయడానికి చేతులు కలపబోయాడు…

rahul

తీపి తనకు అచ్చిరాని సబ్జెక్టు కదా, వదిలేశాడు… గాంధీ కుటుంబంలో ఏ శుభ కార్యాలు జరిగినా తమ షాపు నుంచే మిఠాయిలు వెళతాయని ఆ ఓనర్ చెప్పాడు…

షాపులో కాసేపు గడిపిన రాహుల్ గాంధీ తన తండ్రిని గుర్తుచేసుకుంటూ .., ‘ రాజీవ్ గాంధీకి ఇమర్తి అన్నా బేసన్ లడ్డు అన్నా ఇష్టమని … తనకు కూడా అవే ఇష్టమని…’ చెప్తూ ఆ స్వీట్లు ఎలా తయారు చేయాలో షాపు కుర్రాళ్లను అడగటమే కాదు, స్వయంగా లడ్డులు చేయడానికి ట్రై చేశాడు…

నిజమైన తీపి భోజనపు ప్లేటులోనే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉందని ఏదో అనకే అర్థం కాని ఏదో ట్వీట్ కొట్టాడు.,. సరే గానీ… ఇమర్తి అంటే ఏమిటి..? జాంగ్రీ, జిలేబీకి మరో పేరా అని డౌటొచ్చింది చాలామందికి…

imarthi

నిజానికి ఇమర్తి అంటే జిలేబీ కాదు, జాంగ్రీ కాదు… జిలేబీ మైదాతో లేదా ఫర్మెంటెడ్ పిండితోనే చేస్తారు, అది డిఫరెంట్… జాంగ్రీకి బియ్యం, మినప్పప్పు మిక్స్… కానీ ఇమర్తి పూర్తిగా మినప్పప్పుతో చేస్తారు, పూర్తి నార్త్ ఇండియన్ స్టయిల్… చూడటానికి రెండూ సేమ్ ఉంటాయి… బేసన్ లడ్డూ… శెనగపిండితో చేసే ఈ లడ్డూ దేశంలో ఎక్కడైనా ఒకే తీరు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ అందమైన పిశాచి రష్మిక బలం… అడ్డమైన తెలుగీకరణ పెద్ద శాపం…
  • నో పటాకులు, నో దీపాలు… రాహుల్‌ దీపావళి అంటే జస్ట్, ఇమర్తి, బేసన్ లడ్డూ…
  • ఫాఫం బీజేపీ..! పదే పదే ఏదో ఓ ప్రధాన పార్టీకి తోకగా మిగిలిపోవడమేనా..?!
  • తస్కిన మేడిగడ్డకు తోడుగా… అన్నారం బరాజుకు ఓ ఇసుక వ్యాధి..!!
  • టి.సుబ్బరామిరెడ్డి ఫెయిల్డ్ ప్రాజెక్ట్… త్రిమూర్తులూ కాపాడలేకపోయారు…
  • పోలీసుల ఓవరాక్షన్… సీఎం వద్దకు చేరిన ఓ ‘ఎన్‌కౌంటర్’ కథ…
  • వరల్డ్ కప్ జట్టు కోణంలో… కోహ్లీ, రోహిత్ కొనసాగింపుపై చర్చోపచర్చలు..!!
  • అందని అవార్డు పుల్లన…! పిచ్చి కూతలరాయుళ్ల జాబితాలో విశాల్ కూడా..!!
  • గోల్డ్ ఫామింగ్..! చెట్లకు నిజంగానే బంగారం కాసే రోజులొస్తున్నయ్…!!
  • ఆ ఆయుధం ఓనర్ ఎవరు..? అప్పగించడానికి వాళ్లెవరు..? ఇదీ చర్చ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions