.
Pardha Saradhi Upadrasta … రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కేసు – ఈ రోజు కోర్టు లో ఏమి జరిగింది? రాహుల్ గాంధీ అనుమానిత బ్రిటిష్ పౌరసత్వం కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి , కేంద్ర హోమ్ శాఖను కు అలహాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను బెంచ్ ముందు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమవుతోంది… అసలు కేసు ఎలా ప్రారంభమైంది?
Ads
పిటిషనర్ రాహుల్ గాంధీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో నమోదైన ఒక కంపెనీ డాక్యుమెంట్లలో తనను బ్రిటిష్ సిటిజన్‌గా పేర్కొన్నారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
ఆ కంపెనీ పేరు Backops Limited అని చెప్పబడుతోంది. ఆ కంపెనీ రికార్డుల్లో రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడిగా ఉన్నారని పేర్కొనబడిందని పిటిషన్‌లో వాదన ఉంది.
కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు… ఈ అంశంపై గతంలో కూడా కేంద్ర హోమ్ శాఖకు, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోమ్ శాఖ అధికారికంగా british ప్రభుత్వం నుండి డాక్యుమెంట్లు తెప్పించింది.
విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరసత్వం ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది అనే అంశం కారణంగా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.
కోర్టులో ఏమి జరిగింది? …. తాజాగా విచారణ సందర్భంగా అలహాబాద్ హై కోర్టు కేంద్రాన్ని అడిగింది: ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులు ఏమిటి?
హోం మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న ఫైళ్లు , కమ్యూనికేషన్ వివరాలు ఏమిటి?
ఈ నేపథ్యంలో కోర్టు మొత్తం కేస్ ఫైల్‌ను బెంచ్ ముందు ఉంచాలని కేంద్రానికి ఆదేశించింది.
తదుపరి విచారణ… ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ మార్చి 19న జరగనుంది. ఆ రోజున కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం సమర్పించే రికార్డుల ఆధారంగా కేసు దిశ మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
అంతకు ముందు ఈ కేసు కోర్టు ముందుకు వచ్చినప్పుడు సాక్ష్యాలు పూర్తిగా లేవు అని కేసును ముందుకు తీసుకెళ్లలేదు కోర్టు. పిటిషనర్ ఇంకా ఫాలో అప్ చేయగా అధికారికంగా సాక్ష్యాలు తెప్పించండి అని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
ఇప్పుడు ఫైల్ మొత్తం మాకు ఇవ్వండి అనటం ద్వారా సాక్ష్యాలను కోర్టు అనుమతించినట్లు అయ్యింది.
రాహుల్ గాంధీ విదేశీ పౌరసత్వం తీసుకున్నారా లేదా అన్నది ఇప్పటికీ అధికారికంగా నిరూపించబడలేదు. అయితే కోర్టు విచారణ కారణంగా ఈ అంశం మళ్లీ జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. — ఉపద్రష్ట పార్ధసారధి
#RahulGandhi #AllahabadHighCourt #CitizenshipCase #IndianPolitics #BreakingNews #PardhaTalks
Share this Article