రాహుల్ గాంధీ పప్పు స్థాయి నుంచి భారత్ జోడో యాత్ర తరువాత పరిపక్వ నాయకుడిగా ఎదిగాడని చాలామంది విశ్లేషకులు తెగరాసేస్తున్నారు… ఇక కాంగ్రెస్‌కు ఆపాత వైభవాన్ని రాహుల్ సంపాదించి పెట్టినట్టేననీ తీర్మానించేస్తున్నారు… శుభం… జరిగితే మంచిదే… కానీ రాహుల్ మారాడా..? ఎదిగాడా..? ఈ దేశ ప్రముఖ జర్నలిస్టుల్లో ఒకడైన కరణ్ థాపర్ రాసిన ఓ తాజా వ్యాసం కాస్త ఆలోచనాత్మకంగా ఉంది… దాని తెలుగు అనువాదాన్ని సాక్షి ఎడిట్ పేజీలో వేశారు… (ఆ పేజీలో చుక్క తెగి రాలిపడ్డట్టు ఇలా అప్పుడప్పుడూ కాస్త ఆలోచింపజేసే గెస్ట్ కాలమ్ కనిపిస్తుంది… అది వేరే సంగతి)…
ఆ వ్యాసంలో ఓ జర్నలిస్టు ప్రశ్న పట్ల రాహుల్ ప్రదర్శించిన అసహనం గురించి ఇలా రాసుకొచ్చాడు… ఇది చదివాక తన పరిణతిని మనమే అంచనా వేసుకుందాం… ‘‘ఓబీసీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించారని బీజేపీ ఆరోపిస్తుంది, మీ అభిప్రాయం ఏమిటి’ అని ఓ జర్నలిస్టు అడిగాడు… దానికి రాహుల్ ‘‘నువ్వు బీజేపీకి ఇంత నేరుగా ఎందుకు పనిచేస్తున్నావు..? నీకు వారి నుంచి ఆదేశాలు అందాయా..? నువ్వు బీజేపీ కోసం పనిచేయాలని అనుకుంటే వారి జెండా లేదా గుర్తును తెచ్చుకుని నీ ఛాతీపై పెట్టుకో… వారికి ఏరీతిలో జవాబులు చెప్పానో నీకు కూడా అలాగే చెబుతాను… అంతేతప్ప పాత్రికేయుడిగా నటించకు…’’
Ads
అంతేకాదు, ఈ సంయమన రాహిత్యానికి తోడు అందరూ వినేటట్టుగా ‘‘హవా నికల్ గయీ’’ అని సదరు జర్నలిస్టును మరింత వెటకారం చేశాడు… ఆయన మొహం నవ్వుతో కూడిన తెలివి వెలిగిపోయింది…’’ అని రాశాడు కరణ్ థాపర్ తన వ్యాసంలో… అస్సోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఒకప్పుడు కాంగ్రెసే… తను టెన్ జనపథ్ వెళ్లినప్పుడు కూడా ఇదే రాహుల్ తన కుక్కలతో మాట్లాడుతూ హిమంతను లైట్ తీసుకున్నాడు, ఫోఫోవోయ్ అన్నట్టుగా వ్యవహరించాడు… అది గుర్తొచ్చిందా..? తెలంగాణ సీఎం కేసీయార్, యాక్టింగ్ సీఎం కేటీయార్ ప్రెస్‌మీట్లు ఏమైనా గుర్తొచ్చాయా..?
అప్పట్లో 2013లో మన్మోహన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది… అది లాలూ కోసం ఉద్దేశించింది… ఏదేని నేరానికి సంబంధించి చట్టసభ సభ్యులు ఎవరికైనా శిక్ష పడితే, వెంటనే అనర్హత వేటు పడకుండా… 90 రోజుల్లోపు పునఃసమీక్ష కోరుతూ కోర్టులో అప్పీల్ చేసుకుంటే అనర్హతను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు అనేది ఆ ఆర్డినెన్స్ సారం… ఆ ఆర్డినెన్స్ కాపీని అందరి ముందు చింపేసి, ప్రధానిని అవమానించాడు… ప్రధానిగా మన్మోెహన్ స్థాయినీ దిగజార్చాడు…
మొన్నటి ప్రెస్‌మీట్‌లో ఆ జర్నలిస్టుకు సారీ చెప్పి ఉండాల్సింది… అంతకుముందే మన్మోహన్‌కూ సారీ చెప్పి ఉండాల్సింది… ఇదీ కరణ్ థాపర్ అభిప్రాయం… నిజానికి ‘‘మేం గాంధీలం… మేం క్షమాపణలు చెప్పం’’ అనే వ్యాఖ్య రాహుల్‌లోని అపరిణత నాయకుడిని బహిర్గతం చేస్తోంది… అసలు రాహుల్ కుటుంబానికీ గాంధీ అనే ఇంటిపేరుకూ సంబంధమే లేదు… అది రాజకీయ లబ్ధి కోసం, గాంధీ ఇమేజీని హైజాక్ చేయడానికి ఉద్దేశించిన పేరు మార్పిడి పథకం… అందుకే ప్రియాంక కూడా ప్రియాంక వాద్రాగా కాదు, ప్రియాంక గాంధీగా పిలవబడుతుంది… సోనియా గాంధీలాగే..!!
మేం క్షమాపణలు చెప్పం అని గర్వంగా చెప్పుకున్న ఇదే రాహుల్ గతంలో కోర్టులకు క్షమాపణలు చెప్పుకున్న ఉదంతాలు లేవా..? ఏమో, ఆర్ఎస్ఎస్ మీద వ్యాఖ్యలు వంటి ఒకటీరెండు పెండింగ్ కేసులూ ఉన్నాయి… ఎంతైనా మోడీ అదృష్టవంతుడు… ఇలాంటి ప్రత్యర్థి లభించినందుకు..! ఒక నెహ్రూ, ఒక ఇందిర పుట్టిన కుటుంబమేనా ఇది..? హతవిధీ…!!
Share this Article