రాహుల్ గాంధీ అంతే… విదేశాలకు వెళ్లి భారత దేశాన్ని పలుచన చేసే వ్యాఖ్యలు చేస్తాడు… హిందూ మతం మీదా విషమే… ప్రత్యేకించి అయోధ్య మీద ఎప్పుడూ కాంగ్రెస్‌కు విద్వేషమే… వ్యతిరేకతే…
ఎన్నికలొస్తే మాత్రం ఓ జంధ్యం ప్రదర్శిస్తూ, నేను బ్రాహ్మడిని, హిందువును అంటూ గుళ్లు తిరుగుతూ హిందూ వోట్ల కోసం నాటకాలు… ఇప్పుడు అయోధ్య మీద మళ్లీ విషం… వెటకారం… అపహాస్యం…
తిరుమల లడ్డూ వివాదం ఇంకా ఒకవైపు పెరుగుతూనే ఉంది… జగన్ ఇష్టారాజ్యం వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు… మరోవైపు మరో కొత్త వివాదం… అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అపహాస్యం చేసేలా నాచ్ గానా ఈవెంట్ అని వ్యాఖ్యానించాడు రాహుల్… ‘‘అమితాబ్, అంబానీ, ఆదానీ, అలాంటి ధనికులు తప్ప ఈ ఓ రైతును పిలిచారా..? ఓ కూలీని పిలిచారా…? అంతా ఓ నాచ్ గానా..’’ అంటున్న వీడియో ఇప్పుడు కొత్త వివాదాన్ని రేకెత్తిస్తోంది…
Ads
అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీయేతర పక్షాలు అవాయిడ్ చేశాయి తెలుసు కదా… అయోధ్య అంటే అదేదో బీజేపీ గుడి, రాముడు అంటే బీజేపీ దేవుడు అన్నట్టుగా వక్రబాష్యాలు చెప్పుకుని, సగటు రామభక్తులకు వ్యతిరేక ధోరణి తీసుకున్నాయి కదా… ఇప్పుడైతే ఏకంగా నాచ్ గానా అనే ఓ వెకిలి వ్యాఖ్య కూడా చేశాడు…
ఈ వీడియో వైరల్ అవుతుండగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాహుల్ నాచ్ గానా వ్యాఖ్యలపై స్పందించాడు… ‘రాహుల్‌కు అలవాటే కదా, పదే పదే హిందువులను అవమానించడం… రాముడి ఉనికినే గుర్తించని కాంగ్రెస్ రామజన్మభూమినీ గుర్తించదు, హిందూ టెర్రరిజం అంటారు, ద్వారక నాటకం అంటారు…’’ అని విమర్శించాడు…
దీనికి కాంగ్రెస్ నాయకుడు మాణిక్కం ఠాకూర్ ‘‘నిజమే కదా, రాహుల్ అన్నదాంట్లో తప్పేముంది..? ఆ కార్యక్రమానికి వచ్చిన సామాన్య అయోధ్య జనమేమో మెయిన్ గేటు వద్ద పడిగాపులు గాస్తుంటే సూపర్ రిచ్, బాలీవుడ్ స్టార్లు మాత్రం గుడి ప్రాంగణంలో ఆసీనులయ్యారని తెలిసిందే కదా…’’ అని సమర్థించుకొచ్చాడు…
అయోధ్య మీద మళ్లీ ఎందుకు రాహుల్ రాద్దాంతం, అపహాస్యం చేసే మాటలకు ఎందుకు దిగినట్టు..? బీజేపీ మీద కోపాన్ని పదే పదే హిందూ మతం మీద, హిందూ దేవుళ్ల మీద ప్రదర్శిస్తున్నాడు దేనికి..? హిందూమతం మీద, హిందూ దేవుళ్ల మీద బీజేపీకి పేటెంట్ రైట్స్ ఉన్నాయనే భ్రమల్లో ఉన్నాడా..? లేక బీజేపీ కోణంలో రాముడిని చూస్తున్నాడా..? లేకపోతే సగటు హిందువు ప్రతిష్టాత్మకంగా భావించిన అయోధ్య ప్రాణప్రతిష్ఠను నాచ్ గానా అని ఎందుకు వెక్కిరిస్తున్నాడు..?!
Share this Article