కాలేజీ పిల్లల ఎదుట ఓ ప్రధాని అభ్యర్థి ఫుషప్స్ చేస్తున్నాడు… ఒంటి చేత్తో పుషప్స్ చేస్తూ సవాల్ విసురుతున్నాడు… చెరువుల్లో ఈతలు కొడుతున్నాడు… వంటల్లో ఉప్పు కలుపుతున్నాడు… తాటి ముంజలు తింటున్నాడు… మస్తు ప్రయాసపడుతున్నాడు… మోడీ ముదురు వేషాలతో పోలిస్తే ఇవి తక్కువేమీ కాదు… కానీ ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రధాని అభ్యర్థిత్వాలు తమను తాము గోసపెట్టుకున్న తీరు చూస్తే మనకే గోస అనిపిస్తుంది… ఆ వేషాలు సరే, కానీ కీలకమైన ఇష్యూస్ వచ్చినప్పుడు స్పందించే తీరులో, విధానాల్లో మెచ్యూరిటీ లెవల్ ముఖ్యం కదా… అక్కడ రాహుల్‌ను చూస్తే జాలేస్తోంది… కాదు, మన మీద మనకే జాలేస్తుంది… మరి వారస రాజకుమారుడు కదా… అయితే నవ్వొచ్చింది ఎక్కడా అంటే..? ఈమధ్య కొందరు జర్నలిస్టులతో వీడియో చాట్ చేశాడు రాజా వారు… అది చూస్తుంటే మన పాత సినిమాల్లో బాలయ్య, బ్రహ్మీ డైలాగులు గుర్తొచ్చాయి… ఇంతకు మించి పెద్ద వ్యాఖ్య అవసరం లేదు కదా… ఇదీ ఆ వీడియో….
Ads
Ads
ఏం గుర్తొచ్చాయీ అంటారా..? ముందుగా అదేదో దిక్కుమాలిన సినిమాలో బాలయ్య డైలాగ్… “Don’t trouble the trouble. If you trouble the trouble trouble troubles you. I am not the trouble, I am the truth…’’ దీనికి పేరడీగా ఇంకేదో సినిమాలో బ్రహ్మానందం స్పూఫ్ డైలాగ్… ‘‘Don’t fire the fire. If you fire the fire.. fire fires you. I am fire, I am the fire…’’ సేమ్… రాహుల్ గాంధీ కూడా…. స్ట్రాటజీ అంటూ తెగ ఆవేశపడిపోయాడు… తన సమాధానంలో బోలెడుసార్లు స్ట్రాటజీ అనే పదం స్ట్రాటజికల్‌గా వాడాడు… కాదు, వాడానని తను అనుకున్నాడు… కానీ అది మరీ మన ట్రబుల్, ఫైర్ బాపతు డైలాగ్ అయిపోయింది… పదే పదే చైనా విజన్ అంటాడు… మనకు అదర్శం ఆ చైనావాడే అన్నట్టుగా మాట్లాడాడు… కానీ ఆ స్ట్రాటజీ డైలాగ్ అర్థం గాక జనం జుత్తు పీక్కున్నారు… వోకే, చైనా పార్టీతో, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఒప్పందం కుదిరింది చాలా ఏళ్ల క్రితమే… కానీ చైనా అంటే ఓ బేమాన్ కేరక్టర్… అది మన సార్వభౌమత్వానికే సవాళ్లు విసురుతుంది.. సందు దొరికితే చాలు, ఇప్పటికిప్పుడు లడాఖ్, అరుణాచల్‌ప్రదేశ్ గట్రా చాలా ఏరియాలను ఆక్రమించుకుని, టిబెల్ తరహాలో కొండచిలువ మింగినట్టు మింగడానికి రెడీగా ఉంది… ఐనాసరే, చైనా విజన్ అని కీర్తిస్తుంటాడు మన రాజకుమారుడు… చివరకు అమెరికా సంబంధాల విషయంలోనూ చైనా ధోరణే కరెక్టు అంటాడు… సార్, రాహుల్ గారూ…. మీరు ఆ రాజవంశంలో పుట్టడం రాజ్యం ఖర్మ… మీ తప్పేమీ లేదు… లేదు… మీరు కానివ్వండి సార్, పుషప్స్ ఇంకాస్త గట్టిగా చూపించండి… మేం చప్పట్లు కొడతాం…!!
Share this Article